శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భోపాల్‌లో ‘ఐ.ఐ.ఎస్.ఎఫ్-2022’ వైజ్ఞానిక ఉత్సవం మొదలు


మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,
కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ మంత్రి

డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ప్రారంభం..
క్వాంటం టెక్నాలజీలో ముందకు దూకేందుకు
భారత్ సంసిద్ధం: జితేంద్ర సింగ్

భోపాల్‌లో ఐ.ఐ.ఎస్.ఎఫ్. నిర్వహణ, జి-20కి అధ్యక్షత,
చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం-2023,
షాంఘై సహకార సంఘానికి సారథ్యం..,
ఇవన్నీ అంతర్జాతీయ వేదికలో భారత్ స్థాయి ఎదుగుదలకు తార్కాణాలు: జితేంద్ర సింగ్


వర్తులాకార ఆర్థిక వ్యవస్థను
దైనందిన జీవితంలో భాగం చేసుకోవడానికి
చెత్తనుంచి సంపద పేరిట కార్యకలాపాలను పెంచడానికి కృషి చేయాలి: ప్రొఫెసర్ సూద్..

ప్రపంచ ప్రభావితంగా దేశంలో బయోటెక్ స్టార్టప్‌ల ప్రాత్సాహానికి బయోటెక్నాలజీ శాఖ గట్టి కృషి
: డాక్టర్ రాజేష్ గోఖలే

Posted On: 06 JAN 2023 5:33PM by PIB Hyderabad

       మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో  ఏర్పాటు చేసిన ఇండియా అంతర్జాతీయ వైజ్ఞానిక ఉత్సవం, ఐ.ఐ.ఎస్.ఎఫ్-2022ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు సంయుక్తంగా ప్రారంభించారు. "సైన్స్ టెక్నాలజీ-ఆవిష్కరణతో అమృత కాలంవైపు పరుగులు" అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నారు ప్రారంభించారు.

 

   https://ci5.googleusercontent.com/proxy/8vMNq3MQwi1pmxQmvPlcszn7uGDi6naQj9f5LJgsV3HACMZqE06Xyhhh47c3VePJ43ZrAUHuznWbQo3a4Nlo0MrnsioVDLIiGDEBgfG-VrAsY-aNbyHO8r9w_Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001M9CP.jpg

   మధ్యప్రదేశ్ రాష్ట్ర సైన్స్-టెక్నాలజీ శాఖ మంత్రి ఓం ప్రకాష్ సఖ్లేచా, కేంద్ర వైజ్ఞానిక వ్యవహారాల ముఖ్య సలహాదారు ప్రొఫెసర్. అజయ్ సూద్, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్. రాజేష్ గోఖలే, కేంద్ర వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధన శాఖ (డి.ఎస్.ఐ.ఆర్.) కార్యదర్శి డాక్టర్ ఎన్. కలైసెల్వి, విజ్ఞాన భారతి ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధీర్ బదురియా, బయో టెక్నాలజీ శాఖ సీనియర్ శాస్త్రవేత్త, డాక్టర్ సంజయ్ మిశ్రా, మధ్యప్రదేశ్ సైన్స్-టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి నికుంజ్ శ్రీవాత్సవ, కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన  ఇతర సీనియర్ అధికారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

   మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక్క ఏడాది కాలంలో కేవలం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోనే 2,600 స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటయ్యాయని, ఇది ఇండోర్ నగరానికే పరిమితం కాదని, రెండవ తరహా, 3వ తరహా నగరాల్లో కూడా విజయవంతమైన స్టార్టప్‌ సంస్థలు ఏర్పాటయ్యాయని అన్నారు. ఆవిష్కరణల పట్ల మధ్యప్రదేశ్‌లోని విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపన్యాసం ఇచ్చారు. భారతదేశం క్వాంటమ్ టెక్నాలజీలో ముందుకు దూకడానికి భారతదేశం సంసిద్ధమవుతోందని,  ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో తీవ్ర సమస్యలకు ఇది ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొని, భావికాలపు వైజ్ఞానిక శాస్త్ర రూపురేఖలను నిర్వచించగలదని ఆయన చెప్పారు.

https://ci6.googleusercontent.com/proxy/EutcGcjAbY72bro4D4_deuAFMgToeNKKj8Ic4UgCuaLYs5IlhnC4hf5BqVReNcdobm8pmWGJspW_vo9nsb-O0ES-q0GkWvMy5hhIpKKIHjVSl3FW2xvIvnxRUg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00202HT.jpg

   2023లో భారతదేశం 20 దేశాల కూటమికి (జి-20కి) ఆధ్యక్ష బాధ్యతలను భారతదేశం స్వీకరించిన తరుణంలోనే  భోపాల్ నగరంలో ఐ.ఐ.ఎస్.ఎఫ్. జరుగుతోందని, బహుముఖ అభివృద్ధి కోణాలను మాత్రమే కాకుండా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన దేశపు సాఫ్ట్‌వేర్ సంస్థల శక్తిని కూడా ఇది సూచిస్తోందని జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకే 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని ఆయన చెప్పారు. 2023లోనే షాంఘై సహకార సంఘం (ఎస్.సి.ఒ.) సమావేశానికి కూడా భారతదేశం అధ్యక్షత వహిస్తుందని కేంద్రమంత్రి తెలియజేశారు. ఇవన్నీ అంతర్జాతీయ వేదికపై భారతదేశం ఎదుగుదల స్థాయిని సూచిస్తున్నాయని అన్నారు.

   అంతరిక్ష రంగలో ప్రైవేటు రంగం భాగస్వామ్యానికి అవకాశమిస్తూ 2020లో నిర్ణయం తీసుకోవడం, డ్రోన్ టెక్నాలజీని మరింత సరళతరం చేయడం, జియోస్పేషియల్ మార్గదర్శకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, ఇటీవలి కాలపు రూ. 20,000 కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ పథకం వంటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశక నిర్ణయాలతో భారత్ వేగవంతమైన అభివృద్ధికి కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అమృత కాలంలో దేశం ముందుకు పరుగులు పెట్టడానికి ఇది దోహదపడుతుందని అన్నారు. "టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానంలో ఆవిష్కరణలు" 2047వ సంవత్సరపు దేశ ఆర్థిక వ్యవస్థకు పథ నిర్దేశకంగా ఉండబోతున్నాయని, స్వాతంత్ర్యం వచ్చి  వంద సంవత్సరాలు ముగుస్తున్న తరుణంలో ఇది జరగబోతోందని కేంద్రమంత్రి అన్నారు.

   జూన్ 2020లో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అవకాశం కల్పించిన తర్వాత, రెండేళ్లలో దాదాపు 120 డీప్ టెక్ స్పేస్ స్టార్టప్‌లు భారతదేశంలోకి వచ్చాయని జితేంద్ర సింగ్ చెప్పారు. కేవలం అంతరిక్షంలోకి రాకెట్‌లను పంపడమే కాకుండా ఉపగ్రహాల నిర్మాణం, శకలాల తొలగింపు నిర్వహణ తదితర రోజువారీ జీవన రంగాల్లో రంగాలలో కూడా స్పేస్ స్టార్టప్ సంస్థలు పాలు పంచుకుంటున్నాయని అన్నారు.

  నేడు విజ్ఞాన శాస్త్రం ప్రతి ఇంట్లోకి ప్రవేశించిందని, ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ లేదా యువతకు సంబంధించినది మాత్రమే కాకుండా భారతదేశ భవిష్యత్తుతో పూర్తి స్థాయిలో ముడిపడి ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్ట్‌తో సహా సైన్స్ –టెక్నాలజీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో మహిళా శాస్త్రవేత్తలు ముందంజలో సాగుతూ ఉన్నారని, ఇది మనకు ఎంతో గర్వకారణమని  కేంద్రమంత్రి పేర్కొన్నారు.

 

https://ci6.googleusercontent.com/proxy/3fAEHkWMuXCnz0CT2X-hbGFpeoeXlltrh5hgsV7Rl-iDMEKOI9PWcsbZYZ0IL7g_wF2dT7llGEkq6rqjx1XUVZ8sBoK7Hpcc7SzNzcGyaDgZKMHgBHTpypNARQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003NB8V.jpg

   మధ్యప్రదేశ్ సైన్స్,టెక్నాలజీ శాఖ మంత్రి ఓం ప్రకాశ్ సఖ్లేచా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, భోపాల్‌లో జరిగే నాలుగు రోజుల సైన్స్ ఫెస్టివల్‌లో 15 ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. స్టూడెంట్ సైన్స్ విలేజ్‌లో 2,500 మంది విద్యార్థులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను, ఆవిష్కరణలను బహిర్గతం చేస్తారని తెలిపారు. మెగా స్టార్టప్‌ కంపెనీల ప్రదర్శనతో పాటు బయోటెక్నాలజీతో సహా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతపై 1,500 మంది యువ శాస్త్రవేత్తలు మేధోమథనం చేస్తారని సఖ్లేచా చెప్పారు. అమృత్ కాల్‌లో ఆవిష్కరణలు భారతదేశాన్ని నూతన రూపుతో ఆవిష్కరిస్తాయని, స్టార్టప్ కంపెనీలను, పరిశ్రమలను మరింతగా పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయం అందిస్తున్నాయని అన్నారు.  

  భారత ప్రభుత్వ వైజ్ఞానిక వ్యవహారాల ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ అజయ్ సూద్ మాట్లాడుతూ, సైన్స్ అనేది ఒక స్థిరమైన సబ్జెక్ట్ కాదని, ప్రతి రోజు కొత్త అభివృద్ధితో పెంపొందుతోందని అన్నారు. ప్రతి పురోగతిలోనూ సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలు ఉంటాయని ఆయన చెప్పారు.

  ఆవిష్కరణల అభృద్ధి సూచిలో అతి తక్కువ కాలంలోనే భారత్ 86వ ర్యాంకు నుంచి 41వ ర్యాంక్‌కు ఎదిగిందని ప్రొఫెసర్ సూద్ తెలిపారు. సెమీ కండక్టర్ మిషన్ ప్రారంభంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు సాగబోతోందని ఆయన అన్నారు. వర్తుల ఆర్థిక వ్యవస్థను  దైనందిన జీవితంలో భాగంగా చెసుకునేందుకు  మరింత కృషి చేయాలని, చెత్తనుంచి సంపద సృష్టించే  కార్యక్రమాలను పెంచేందుకు కృషి చేయాలని ఆయన చెప్పారు.

  కేంద్ర బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే మాట్లాడుతూ భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని సవాళ్లను సార్వత్రిక వైజ్ఞానిక పరిశోధనలతో  మాత్రమే ఎదుర్కోగలమని, కోవిడ్ వైరస్ మహమ్మారి  వ్యాప్తి సమయంలో ఇది తెలిసిపోయిందని అన్నారు. ప్రపంచవ్యాప్త పరిణామాల నేపథ్యంలో భారతదేశంలో బయోటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి కేంద్ర బయోటెక్నాలజీ శాఖ గట్టిగా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

  విజ్ఞాన్ భారతి ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధీర్ బదురియా మాట్లాడుతూ యోగా, ఆయుర్వేదం లేదా వాస్తు, ఖగోళ శాస్త్రం వంటి విషయాల్లో భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచం గుర్తించిందని అన్నారు. దేశ ప్రయోజనాలు, మానవాళి శ్రేయస్సు కోసం ఆధునిక శాస్త్రీయ దృక్పథాన్ని, ఆలోచనలను ప్రోత్సహించడానికి దేశంలోని సైన్స్ మంత్రిత్వశాఖలతో, వివిధ విశ్వవిద్యాలయాల, కళాశాలల వైజ్ఞానిక శాస్త్ర విభాగాలతో విజ్ఞాన్ భారతి కలసికట్టుగా కృషి చేస్తోందని ఆయన అన్నారు.

  భారతదేశం ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడం, చవుక పద్ధతిలో అంగారక యాత్రను నిర్వహించడం వంటి పరిణామాలను ప్రపంచం ఎంతో సంభ్రమాశ్చర్యాలతో గమనిస్తోందని డాక్టర్ బదురియా అన్నారు. ప్రపంచంలో అగ్రస్థానాన్ని భారతదేశం ఆక్రమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

  భోపాల్‌ ఐ.ఐ.ఎస్.ఎఫ్.లో పలువురు ప్రధాన వక్తలు, నిపుణులు పాల్గొంటున్నారు. భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సి.ఎం.డి.) డాక్టర్ కృష్ణ ఎల్లా, జెనీవాలోని యూరోపియన్ అణు పరిశోధనా సంస్థ సి.ఇ.ఆర్.ఎన్. ప్రతినిధి డాక్టర్ అర్చన శర్మ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సి.ఎం.డి. ఆనంద్ దేశ్‌పాండే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నటిజం డైరెక్టర్ ప్రొఫెసర్. ఎ.పి. డిమ్రీ, ఫిజికల్ రీసెర్చ్ లేబరేటరీ డైరెక్టర్ డాక్టర్ అనిల్ భరద్వాజ్, మొహాళీకి చెందిన ఐ.ఎన్.ఎస్.టి. డైరెక్టర్ అమితవపాత్ర, ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (ఐ.ఎ.సి.ఎస్.) డైరెక్టర్ ప్రొఫెసర్ తపస్ చక్రవర్తి వంటి నిపుణులు ఈ ఉత్సవంలో పాలుపంచుకుంటున్నారు.

   ఫేస్ టు ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఆఫ్ సైన్స్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో  సైన్స్-టెక్నాలజీ నిపుణులతో విద్యార్థులు/పరిశోధక విద్యార్థులు చర్చాగోష్టిలో పాల్గొనబోతున్నారు.  విద్యార్థులు తమ జీవితంలో వైజ్ఞానిక రిశోధనలను కొనసాగించడానికి ఇలాంటి కార్యక్రమలు  ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.

 “సైన్స్-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా ఆత్మనిర్భర భారత్‌ను మరింత శక్తివంతం చేయడం” అనే శీర్షికతో నిర్వహించే చర్చా గోష్టికి భారత్ బయోటెక్ సి.ఎం.డి. డాక్టర్ కృష్ణ ఎల్లా నాయకత్వం వహిస్తారు. “డేటా సైన్స్‌లో సాంకేతిక పురోగతి-డిజిటల్ ట్రాన్ఫర్మేషన్‌లో భారతదేశ నాయకత్వం” అనే అంశంపై నిర్వహించే కార్యక్రమానికి పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు, సి.ఎం.డి. అయిన ఆనంద్ దేశ్‌పాండే అధ్యక్షత వహిస్తారు.

   "విశ్వంలోని రహస్యాల శోధనలో  శాస్త్రవేత్తల కృషి" అనే అంశంపై జెనీవా సి.ఇ.ఆర్.ఎన్. ప్రతినిధి  డాక్టర్ అర్చన శర్మ ప్రధాన ప్రసంగం చేస్తారు. "అంతరిక్షంలో సాంకేతిక పురోగతితో అమృత్ కాల్ వైపు పరుగులు" అనే అంశంతో నిర్వహించే సెషన్‌కు ఇస్రో ఛైర్మన్ అధ్యక్షత వహిస్తారు.

   వైజ్ఞానిక పరిశోధనా పరిధులు, మహమ్మారి వైరస్ సవాళ్లు, టీకాల రూపకల్పన ప్రభావాలు, పరిశోధనలు, నీటి వనరులు, నీటి వనరుల పరిరక్షణ, రీసైక్లింగ్, శుద్దీకరణ, జీవవైవిధ్యం, పర్యావరణం-వాతావరణ మార్పులు, స్వావలంబనతో కూడిన భారతదేశం కోసం ఆహార భద్రత,  ఇంధన భద్రత వంటి ఇతివృత్తాలను యువ శాస్త్రవేత్తల సదస్సుకోసం ఎంపిక చేశారు.

  ఈ ఉత్సవంలో నవయుగపు సాంకేతిక పరిజ్ఞానాల ప్రదర్శనను జనవరి 22నుంచి 24వ తేదీ వరకూ నిర్వహిస్తారు. కృత్రిమ మేధో పరిజ్ఞానం (ఎ.ఐ.), మెషిన్ లెర్నింగ్, సైబర్ భద్రత, బ్లాక్ చైన్, డిజిటల్ కరెన్సీ ఇండస్ట్రీ, 4.0, 5జి/6జి, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ చిప్, డ్రోన్ టెక్నాలజీస్, హరిత ఇంధనాలు, అంతరిక్ష పరిశోధన సాంకేతిక పరిజ్ఞానాలు, సెన్సార్ టెక్నాలజీ, సిస్టమ్స్-సింథటిక్ బయాలజీ తదితర అత్యాధునిక సాంకేతికతలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రదర్శనకు రూపకల్పన చేశారు.

 ఎన్.ఎ.టి.ఎస్. ఎగ్జిబిషన్/ఇన్నోవేషన్ షోకేస్ [100] పేరిట మరో కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. వివిధ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన అంశాల్లో విద్యార్థులు తాము రూపొందించిన ఇంజనీరింగ్ నమూనాలను, ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు. 

 

***** 



(Release ID: 1892801) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Hindi , Tamil