ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో డీఎఫ్ఎస్ సమీక్షా సమావేశం

Posted On: 19 JAN 2023 5:48PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి డాక్టర్ వివేక్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పి.ఎస్.బి) అధినేతలతో సమావేశమయ్యారు. ఈ రోజు పొడుగున సాగిన ఈ సమీక్షా సమావేశానికి డాక్టర్ వివేక్ జోషి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పి.ఎం.జె.డి.వై), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి.ఎం.జె.జె.బి.వై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పి.ఎం.ఎస్.బి.వై), అటల్ పెన్షన్ యోజన (ఎ.పి.వై) సహా వివిధ సామాజిక భద్రత (జన్ సురక్ష) పథకాల పురోగతిని గురించి సమీక్షించారు. ప్రధాన మంత్రి ముద్ర మరియు ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి), మరియు అగ్రి క్రెడిట్ మొదలైన పథకాల పురోగతిని గురించి కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. ఆర్థిక చేరికలను ప్రోత్సహించే సామాజిక భద్రతా పథకాల పురోగతిని సమీక్షించడంతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఆయా పథకాల కింద వారికి కేటాయించిన లక్ష్యాలను సాధించాలని పీఎస్బీలను ప్రోత్సహించారు. సూక్ష్మ బీమా పథకాలు, యు.పి.ఐ  లైట్‌తో సహా డిజిటల్ ఆర్థిక లావాదేవీలతో సహా వివిధ ఆర్థిక చేరిక పథకాల గురించి అవగాహన పెంచడానికి గాను బ్యాంకులు ఆర్థిక అక్షరాస్యత శిబిరాలను నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో చర్చించారు.  గత 7-8 సంవత్సరాల కాలంలో బ్యాంకింగ్ సేవల సౌలభ్యత  బలోపేతం కావడం ఈ సమావేశంలోప్రశంసించబడింది. బ్యాంకింగ్ సేవలకు తగిన యాక్సెస్‌ను అందించినందున, ఖాతాదారులతో తమ అనుభవాన్ని మరింత సుసంపన్నం చేయడానికి బ్యాంకులు అన్ని విధాలా కృషి చేయాలని శ్రీ జోషీ కోరారు,  ఖాతాదారులతో స్థిరమైన బ్యాంకింగ్ సంబంధాన్ని ఆహ్లాదకరంగా మార్చే చర్యలు చేపట్టాలని కూడా ఈ సమావేశంలో చర్చించడమైంది. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) ఇప్పటికే అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లను  వినియోగదారు సేవా రేటింగ్‌ను వేగవంతం చేయాలని అభ్యర్థించింది. వినియోగదారుల అంచనాలను అంచనా వేయడానికి మరియు కస్టమర్‌లోని ప్రతి విభాగానికి అందించే సేవల ప్రమాణాలను బ్యాంకులు పెంచడానికి వీలు ఇది కల్పిస్తుంది. దివాలా ప్రక్రియకు సంబంధించి అడ్మిషన్రిజల్యూషన్నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీఆమోదం మరియు లిక్విడేషన్కు సంబంధించిన ప్రక్రియలలో జాప్యాన్ని తగ్గించడానికి సంబంధించి దివాలా మరియు దివాలా కోడ్ (ఐబీసీ)లో ప్రతిపాదించిన సవరణలు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐఅధికారులు సమక్షంలో చర్చించబడ్డాయిదేశంలోని రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్ (కె.సి.సిసౌకర్యాన్ని అందించే లక్ష్యంతో పీఎం కిసాన్ డేటాబేస్ సహాయం తీసుకోవాలని పిఎస్బిలను అభ్యర్థించడం జరిగింది. సమావేశంలో భాగంగా అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) పథకం పురోగతిని కూడా సమీక్షించారు. వ్యవసాయ రుణాలకు సంబంధించిన సమీక్షలో వ్యవసాయ శాఖ & రైతు సంక్షేమ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కేసీసీ పొందడంలో డిజిటలైజేషన్ ప్రక్రియ వినయోగానికి సంబంధించిన పురోగతిని కూడా పారదర్శకతను మెరుగుపరచే విషయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. కేసీసీ రుణాల మొత్తం ప్రయాణాన్ని సమయానుకూలంగా డిజిటలైజ్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పి.ఎస్.బిలకు సూచించారుకేసీసీ-మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ (మిస్యొక్క డిజిటలైజేషన్ అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి తమ క్లెయిమ్ కోసం పోర్టల్ను ఉపయోగించడం ప్రారంభించాలని బ్యాంకులకు ఈ సందర్భంగా తెలియజేశారు.

****



(Release ID: 1892456) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Hindi