పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరిశ్రమల్లో పిఎన్‌జీ/క్లీనర్ ఇంధనాల వాడకంపై దృష్టి సారించిన సిఏక్యూఎం. మొత్తం ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో బొగ్గు స్టాండ్‌ల వాడకంపై పూర్తి నిషేధం అమలు


కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) మరియు హర్యానా, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌సిఆర్‌లో పనిచేస్తున్న సిఎల్‌ఎల్ సరఫరాదారులు బొగ్గును వినియోగించడం లేదని నిర్ధారించుకోవాలని సూచన

ఆమోదించబడిన ఇంధనాలను మాత్రమే ఉపయోగించేలా చూసేందుకు సిఏక్యూఎం ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో ఆకస్మిక తనిఖీలు

21 పారిశ్రామిక యూనిట్లు అత్యంత కాలుష్యం కలిగించే ఆమోదం లేని ఇంధనాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన సిఏక్యూఎం వాటిని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

01.01.2023 నుండి 02 యూనిట్లలో మాత్రమే సిఏక్యూఎం చట్టబద్ధమైన ఆదేశాలకు విరుద్ధంగా కాలుష్యకారక ఇంధనాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించబడింది.

Posted On: 19 JAN 2023 3:33PM by PIB Hyderabad

బొగ్గు, ఫర్నేస్ ఆయిల్ మొదలైన అత్యంత కలుషితమైన శిలాజ ఇంధనాల నుండి వెలువడే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి తన సమిష్టి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఎన్‌సీఆర్‌తో పాటు పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సిఏక్యూఎం) కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్‌) మరియు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు (యూపీ) జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో పనిచేస్తున్న సిఐఎల్‌కు చెందిన వివిధ సరఫరాదారులు/ స్టాకిస్ట్‌లు/ ఏజెంట్‌లకు వివిధ బొగ్గు కంపెనీలు బొగ్గు సరఫరా/కేటాయింపులు చేయలేదని నిర్ధారించుకోవాలని వాటి సారాంశం. అంతేకాకుండా థర్మల్ పవర్ ప్లాంట్లు (థర్మల్ పవర్ ప్లాంట్స్) మినహా మొత్తం ఎన్‌సిఆర్‌లో ఏ రకమైన వినియోగం/ నిల్వ చేయడం/ అమ్మకం/ ట్రేడింగ్ కోసం ఎన్‌సిఆర్‌లో బొగ్గు సరఫరాను నిలిపివేయాలని స్టాకిస్టులు, వ్యాపారులు మరియు బొగ్గు డీలర్‌లతో సహా సంస్థలు/యూనిట్‌లు/పరిశ్రమలకు కమిషన్ సూచించింది. కమిషన్ యొక్క చట్టబద్ధమైన ఆదేశాల ప్రకారం 01 జనవరి, 2023 నుంచి మొత్తం ఎన్‌సిఆర్‌ ప్రాంతంలోని అన్ని రంగాలలో (పారిశ్రామిక, వాణిజ్య మరియు ఇతర అనువర్తనాలతో సహా) వివిధ కార్యకలాపాల కోసం బొగ్గు మరియు ఇతర ఆమోదం లేని ఇంధనాల వినియోగం పూర్తిగా నిషేధం.

తేదీ 02.06.2022 మరియు తేదీ 23.06.2022 నాటి 64వ ఆదేశం ప్రకారం ఎన్‌సీఆర్‌లో పారిశ్రామిక/ గృహ/ ఇతరత్రా దరఖాస్తుల కోసం అనుమతించదగిన ఇంధనాలకు సంబంధించి కమిషన్ చట్టబద్ధమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం, బొగ్గు వాడకం ఇప్పుడు పూర్తిగా నిషేధించబడింది (టిపిపిలలో తప్ప) మరియు కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం సాధారణ ఇంధన జాబితా ప్రకారం ఎన్‌సిఆర్ పరిధిలో ఇది అనుమతించదగిన ఇంధనంగా పరిగణించబడదు.

కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా, హర్యానా, యు.పి. మరియు రాజస్థాన్‌లోని ఎన్‌సీఆర్ ప్రాంతాలలో ఆమోదించబడిన ఇంధనాలను ఉపయోగించని 84 పారిశ్రామిక యూనిట్లు  ఇప్పటివరకు మూసివేయడం జరిగింది. 01.10.2022నుండి గత 3 నెలల కాలంలో బొగ్గు, ఫర్నేస్ ఆయిల్ మొదలైన అత్యంత కాలుష్యం కలిగించే ఆమోదం లేని ఇంధనాలను ఉపయోగించిన  21 పారిశ్రామిక యూనిట్లు మాత్రమే కనుగొనబడ్డాయి. మరియు ఆ యూనిట్లు సిఏక్యూఎం  ఆదేశాలకు అనుగుణంగా మూసివేయబడ్డాయి. 01.01.2023 తర్వాత సమ్మతి మరింత మెరుగుపడింది మరియు తనిఖీ సమయంలో కేవలం 02 యూనిట్లు మాత్రమే ఇంత భారీగా కలుషిత ఇంధనాలను ఉపయోగిస్తున్నట్లు కనుగొనబడ్డాయి. తద్వారా కమిషన్ యొక్క చట్టబద్ధమైన ఆదేశాలు సంతృప్తికరంగా ఉన్నాయని సూచిస్తున్నాయి.

కమిషన్‌లోని ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్‌సీఆర్‌లో ఆమోదించబడిన ఇంధనాలను మాత్రమే ఉపయోగించడాన్ని ఖచ్చితంగా పాటించేలా తనిఖీల నిర్వహణ కొనసాగుతోంది.


 

*****


(Release ID: 1892288) Visitor Counter : 178


Read this release in: English , Urdu , Hindi