జల శక్తి మంత్రిత్వ శాఖ
కెన్-బెట్వా లింక్ ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ మూడవ సమావేశం
Posted On:
18 JAN 2023 7:32PM by PIB Hyderabad
జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధీనంలోని డిఒడబ్ల్యుఆర్, ఆర్‌డి&జిఆర్ కార్యదర్శి అధ్యక్షతన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం నాడు కెన్-బెట్వా లింక్ ప్రాజెక్ట్ (ఎస్‌సి-కెబిఎల్‌పి) స్టీరింగ్ కమిటీ మూడవ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులే కాక, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, నీతీ ఆయోగ్ అధికారులు కూడా హాజరయ్యారు.
కెన్-బెట్వా లింక్ ప్రాజెక్టు అన్నది బుందేల్‌ఖండ్ ప్రాంత నీటి భద్రతకు, సామాజిక- ఆర్ధిక అభివృద్ధికి కీలకమని తన ప్రారంభోపన్యాసంలో డిఒడబ్ల్యుఆర్, ఆర్‌డి& జిఆర్, ఎంఒజెఎస్ కార్యదర్శి నొక్కి చెప్పారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రాజెక్టును నిర్ణీత కాలంలో అమలు చేయడం, ప్రాజెక్టు ఆర్& ఆర్‌ను, దాని వల్ల ప్రభావితమయ్యే ప్రజలను, ప్రాంతాన్ని, ముఖ్యంగా పన్నా టైగర్ రిజర్వ్‌లో అక్కడి పర్యావరణంపై ఆధారపడి ఉన్న జాతులను పరిరక్షించడం మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
మధ్‌యప్రదేశ్‌లోని నౌరాదేహి వన్యప్రాణుల అభయారణ్యం, రాణిపూర్ దుర్గావతి అభయారణ్యాన్ని, యుపిలోని రాణిపూర్ అభయారణ్యాన్ని ఈ ప్రాజెక్టు కిందకు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
మధ్యప్రదేశ్‌లోని పన్నా, ఛత్తర్‌పూర్ జిల్లాలోని 5480 హెక్టార్ల అటవీయేతర భూమిని పరిహార అడవుల పెంపకం కోసం పిటిఆర్‌కు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినట్టు కమిటీకి తెలియచేయడం జరిగింది.
ఆర్&ఆర్ ప్రణాళికను పారదర్శకంగా, నిర్ణీత కాలంలో అమలయ్యేలా పర్యవేక్షించేందుకు ఆర్&ఆర్ కమిటీని సంప్రదించాలన్న ప్రతిపాదనను సమావేశంలో ఖరారు చేశారు.
ప్రాజెక్టు ల్యాండ్‌స్కేప్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (ఎల్ఎంపి - నిర్వహణ ప్రణాళిక), పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఇఎంపి)ని అమలు చేసేందుకు గ్రేటర్ పన్నా ల్యాండ్‌స్కేప్ కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
సమావేశంలో, రెండవ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తదుపరి చర్యలను, 2023-24కు కార్యప్రణాళికను, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీతో చర్చలు, భూసేకరణ, ఆర్&ఆర్ వల్ల ప్రభావితమైన గ్రామాలు, కెన్-బెట్వా లింక్ ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాల ఏర్పాటు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గ్రేటర్ పన్నా కోసం తయారు చేసిన ఇంటిగ్రేటెడ్ ల్యాండ్‌స్కేప్ మేనేజ్‌మెంట్ ప్లాన్, కెబిఎల్‌పిఎ ఆర్ధిక అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుని తిరిగి చెల్లించడం తదితర అజెండా అంశాలపై చర్చలు నిర్వహించారు.
మధ్యప్రదేశ్‌లోని పన్నా, ఛత్తర్‌పూర్ జిల్లాలోని 5480 హెక్టార్ల అటవీయేతర భూమిని పరిహార అడవుల పెంపకం కోసం పిటిఆర్‌కు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినట్టు కమిటీకి తెలియచేశారు.
మధ్యప్రదేశ్‌లోని రెండు అభయారణ్యాలు - నౌరాదేహి అభయారణ్యం, రాణి దుర్గావతి అభయారణ్యం, యుపిలోని రాణిపూర్ అభయారణ్యాన్ని ప్రాజెక్టు టైగర్ కిందకు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. పిటిఆర్ వాహక సామర్ధ్యాన్ని పెంచడంలో ఇది ముఖ్యమైన అడుగు. ఆర్&ఆర్ ప్రణాళిక పారదర్శకంగా, నిర్ణీత కాలంలో అమలు అయ్యేలా పర్యవేక్షించేందుకు ఆర్&ఆర్ కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సమావేశంలో ఖరారు చేశారు. ప్రాజెక్టు ల్యాండ్ స్కేప్ మేనేజ్‌మెంట్ ప్లాన్(ఎల్ఎంపి), పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఇఎంపి) అమలు కోసం గ్రేటర్ పన్నా ల్యాండ్‌స్కేప్ కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఇమేజ్ -
జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధీనంలోని డిఒడబ్ల్యుఆర్, ఆర్‌డి&జిఆర్ కార్యదర్శి అధ్యక్షతన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం నాడు కెన్-బెట్వా లింక్ ప్రాజెక్ట్ (ఎస్‌సి-కెబిఎల్‌పి) స్టీరింగ్ కమిటీ మూడవ సమావేశం
కెన్ -బెట్వా లింక్ ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ మూడవ సమావేశానికి హాజరైన మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులే కాక, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, నీతీ ఆయోగ్ అధికారులు
***
(Release ID: 1892081)
Visitor Counter : 201