వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఎన్ పి జి ) 41వ సెషన్


ఎన్ పీజీ మూడు ప్రాజెక్టులను మదింపు చేసిన ఎన్ పి జి: చివరి మైలు కనెక్టివిటీని అందించడానికి, సరైన మల్టీమోడల్ లాజిస్టిక్స్ వాటాను సాధించడానికి సూచనలతో మూడు ప్రాజెక్టుల అమలుకు సిఫారసు

Posted On: 18 JAN 2023 7:45PM by PIB Hyderabad

నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్ పీజీ) తన 41వ సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించింది. డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్రత్యేక కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టెలికాం శాఖ, ఎంఓఈఎఫ్ అండ్ సీసీ, రైల్వే, ఎంఓపీఎస్ డబ్ల్యూ, ఎంఓపీఎస్ డబ్ల్యూ, ఎంఓసీఏ, ఎం/ఓ పవర్, నీతి ఆయోగ్, ఎంఓఆర్ టీహెచ్, ఎంవోపీఎన్ జీ సహా కీలక సభ్య మంత్రిత్వ శాఖలు/విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

నాగపూర్ - విజయవాడ కారిడార్ లో భాగంగా 4 లేన్ యాక్సెస్డ్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే , గుజరాత్ లోని బరేజాది నందేజ్ నుంచి సనంద్, ఒడిశాలోని బార్బిల్, బర్సువాన్, నయాగ్రాలను కలిపే కొత్త రైలు కనెక్టివిటీ ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. మంచిర్యాల నుంచి విజయవాడకు 306 కిలోమీటర్ల మేర 4 లేన్ ల యాక్సెస్డ్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవేను అనుసంధానం చేయనున్నట్లు

ఎంఓఆర్ టీహెచ్ ఉన్నతాధికారులు తెలిపారు. మెగా ఫుడ్ పార్కులు, ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, సెజ్ లు, టెక్స్ టైల్ క్లస్టర్లు, మూడు రాష్ట్రాల్లోని 27కు పైగా సోషల్ నోడ్ లకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. హైవే ప్రతిపాదిత అలైన్ మెంట్ సగటు వేగాన్ని గంటకు 40 కిలోమీటర్ల నుండి 80 కిలోమీటర్లకు పెంచుతుందని, ప్రయాణ సమయాన్ని 17 గంటల నుండి 8 గంటలకు తగ్గిస్తుందని, పూర్తయిన తర్వాత 11.9 కోట్ల ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అంచనా.

 

బరేజాది నాందేజ్ నుండి సనంద్ రైల్వే ప్రాజెక్టు చర్చల సందర్భంగా, అహ్మదాబాద్ స్టేషన్ పశ్చిమ రైల్వే కారిడార్ లో విరామ్ గాం -సబర్మతి-అహ్మదాబాద్-గెరత్పూర్ సెక్షన్ల మధ్య సరుకు రవాణా కోసం అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటిగా ఉందని ఎన్ పి జీ గుర్తించింది. అందువల్ల మొత్తం నిర్వహణ సామర్థ్యాన్ని సాధించడానికి, 4 వ లైన్ అనుసంధానం నిర్మాణం అవసరమని భావించారు. ఈ 4వ లైన్ లో బరేజాది నందేజ్ నుంచి సనంద్ వరకు రెండు కొత్త స్టేషన్లు ఉంటాయని, అహ్మదాబాద్ సెక్షన్ ను దాటుతూ అన్ని సరుకు రవాణా రైళ్లను ఈ మార్గంలోకి మళ్లిస్తామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ప్రతిపాదిత అలైన్ మెంట్ లోని ఎకనామిక్ నోడ్ లకు కనెక్టివిటీ దేశంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే సిమెంట్ ,రసాయనాల సరుకు రవాణాను పెంచడానికి సహాయ పడుతుంది.

 

ప్రతిపాదిత బార్బిల్-బర్సువాన్-నయాగఢ్ రైల్వే లైన్ 181 కిలోమీటర్ల దూరం వరకు ఈ ప్రాంతంలోని ప్రధాన ఇనుప గనులను కలుపుతుందని, తూర్పు భారతదేశంలో ఉక్కు ప్రణాళికలలో వాణిజ్యాన్ని పెంచుతుందని రైల్వే సీనియర్ అధికారులు ఈ సమావేశంలో తెలిపారు. ప్రతిపాదిత అలైన్ మెంట్ లో సుందర్ గఢ్, కియోంఝర్ వంటి ప్రధాన మైనింగ్ ప్రదేశాల సమీపంలో 15 కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. టాటా, ధమ్రా, బొకారో వంటి ప్రధాన రైలు  నెట్ వర్క్, విశాఖపట్నం ,పారాదీప్ వంటి తూర్పు ఓడరేవులకు కనెక్టివిటీతో, ఈ ప్రాజెక్టు మొదటి ఐదు సంవత్సరాలలో సుమారు 37% ట్రాఫిక్ పెరుగుతుందని అంచనా.

 

ఈ మూడు ప్రాజెక్టులను ఎన్ పి జి మదింపు చేసింది. లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించడానికి,  సరైన మల్టీమోడల్ లాజిస్టిక్స్ వాటాను సాధించడానికి కొన్ని సూచనలతో వాటి అమలుకు సిఫార్సు చేసింది. ఇందులో ఇంటర్ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ సౌకర్యాల కల్పన, రైల్వేలు, రహదారులకు సంబంధించిన ఇతర టెర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి.

 

******



(Release ID: 1892077) Visitor Counter : 152


Read this release in: English , Urdu , Hindi