రక్షణ మంత్రిత్వ శాఖ
కోల్‌కొత లోని ఎం/ ఎస్ టిటాగఢ్ వాగన్స్ లిమిటెడ్ వద్ద నాలుగవ ఓడకు కీల్ వేయడం - డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్
Posted On:
17 JAN 2023 5:09PM by PIB Hyderabad
నాలుగవ డైవింగ్ (సముద్ర లోతుల్లోకి మునగడం) సపోర్ట్ క్రాఫ్ట్ (డిఎస్‌సి), డిఎస్‌సి ఎ 23 (వై-328) ప్రాజెక్టుకు కీల్ (ఓడ కింద వెన్ను దూలం)ను వేసే ప్రాజెక్టును కోలకొతలోని /ఎ స్ టిటాగఢ్ వాగన్స్ లిమిటెడ్‌లో 17 జనవరి 23న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేర్ అడ్మిరల్ సందీప్ మెహతా, ఎసిడబ్ల్యుపి&ఎ అధ్యక్షత వహించారు. ఓడరేవుకు దగ్గరగా ఉన్న నౌకలకు డైవింగ్‌లో తోడ్పాటును, నీటిలోపలి మరమత్తులు, నిర్వహణ, పునరుద్ధరణ కోసం 2023 అంతానికి భారతీయ నావికా దళంలోకి ఓడలను చేర్చుకోనున్నారు. అంతేకాకుండా, ప్రధాన, అనుషంగిక పరికరాలను దేశీయ ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తుండడంతో, ఈ ఓడలు మేకిన్ ఇండియాకు గర్వకారణమై పతాకధారులు కావడమే కాక, రక్షణ మంత్రిత్వ శాఖ చొరవ అయిన మేక్ ఫర్ ది వరల్డ్‌కు ప్రతినిధిగా నిలుస్తాయి.
***
(Release ID: 1891876)
Visitor Counter : 159