వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
' ఈ-ఎన్.డబ్ల్యుఆర్లకు ప్రతిగా డిజిటల్ ఫైనాన్సింగ్ మరియు ముందుకు వెళ్లే మార్గం'పై సమావేశం
- వ్యాపారాన్ని నిర్వహణ సులభతరం చేయడం గురించి చర్చ
Posted On:
16 JAN 2023 5:44PM by PIB Hyderabad
'ఈ-నెగోషియబుల్ వేర్‌హౌస్ రసీదులకు (ఈ-ఎన్.డబ్ల్యుఆర్లకు) బదులుగా డిజిటల్ ఫైనాన్సింగ్ మరియు ముందుకు వెళ్లే మార్గం'పై అనే అంశంపై ముంబయిలోని నాబార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సమావేశం జరిగింది. డబ్ల్యుడీఆర్ఏ వద్ద రిజిస్టర్ చేయబడిన గిడ్డంగుల ద్వారా జారీ చేయబడిన ఈ-ఎన్.డబ్ల్యుఆర్ ప్రతిగా పంటకోత అనంతర ప్రతిజ్ఞ ఫైనాన్స్‌ను పెంచేందుకు బ్యాంకర్లతో పరస్పర చర్యలు చేపట్టడం మరియు వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు కావాల్సిన యంత్రాంగాన్ని మెరుగుపరిచి అభివృద్ధి చేయడం ఉద్దేశ్యంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది పంట అనంతర ప్రతిజ్ఞ ఫైనాన్సింగ్ స్థాయిని.. ప్రస్తుత స్థాయిల నుండి మరింత పెంచడానికి సహాయపడుతుంది. డబ్ల్యుడీఆర్ఏ ఏర్పాటు చేసిన ఈ-ఎన్.డబ్ల్యుఆర్ విధానం అమలుపై ఈ సమావేశానికి హాజరైన బ్యాంకర్లు సంతృప్తిని వ్యక్తం చేశారు, ఎందుకంటే ఇది వేర్‌హౌస్ రసీదులకు ప్రతిగా వారు అందించిన రుణాలకు గణనీయమైన భద్రత మరియు సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ-ఎన్.డబ్ల్యుఆర్ రుణం సంవత్సరాలుగా స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా రుణాల మొత్తం ఇప్పటికే రూ.1500 కోట్లు దాటింది. ఈ సదస్సులో పాల్గొన్న బ్యాంకర్లు వారి ఇప్పటికే జారీ చేసిన పంట అనంతర రుణాలను సూచిస్తూ.. ఈ తరహా రుణాల వితరణను మరింతగా పెంచేందుకు అంగీకరించారు.
డిజిటల్ ఫైనాన్సింగ్ విధానంతో ఎన్నో లాభాలు..
ఈ-ఎన్‌డబ్ల్యుఆర్‌లకు ప్రతిగా డిజిటల్ ఫైనాన్సింగ్ విధానం వలన అవాంతరాలు లేని రుణాలను అందించడానికి బ్యాంకులకు ఎంతగానో సహాయపడుతుందని గుర్తించబడింది. ఇది లిక్విడిటీని పెంచడానికి మరియు రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది గుర్తించారు. బ్యాంకులు కూడా తమ రుణాల పోర్ట్‌ఫోలియోను అదనపు రిస్క్‌లు లేకుండానే విస్తరించే వీలు కలుగుతుంది. పోర్టల్ ద్వారా డబ్ల్యుడీఆర్ఏ యొక్క రిపోజిటరీలతో బ్యాంకుల కోర్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్‌ను ఏకీకృతం చేసే ప్రాజెక్ట్ గురించి కూడా సమావేశంలో చర్చించారు. ఈ గేట్‌వే ద్వారా డిపాజిటర్‌ను ఈ-ఎన్‌డబ్ల్యుఆర్‌లతో శీఘ్ర విధానంలో రుణాలు తీసుకొనేందుకు వీలు కలుగుతుంది. డబ్ల్యుడీఆర్ఏ గిడ్డంగుల రంగంలోని సంస్థల నియంత్రకం కావడం వల్ల, దేశంలో శాస్త్రీయ గిడ్డంగులను ప్రోత్సహించడానికి, ఈ వ్యవస్థను మెరుగుపరచడానికి సంస్థ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. డబ్ల్యుడీఆర్ఏ అనేది అన్ని రకాల వస్తువుల కోసం చర్చించదగిన గిడ్డంగి రసీదు వ్యవస్థను ఏర్పాటు చేసి అమలు చేసే ఏజెన్సీ. ఆ దిశగా, డిపాజిటర్లు, గిడ్డంగులు మరియు ఆర్థిక సంస్థలతో ఇతర సహా భాగస్వాములలో విశ్వసనీయతను మెరుగుపరచడానికి డబ్ల్యుడీఆర్ఏ చర్యలు తీసుకుంటోంది. డబ్ల్యుడీఆర్ఏ, వేర్‌హౌసింగ్ సెక్టార్ యొక్క రెగ్యులేటర్‌గా మరియు దేశంలో నెగోషియబుల్ వేర్‌హౌస్ రసీదు (ఎన్‌డబ్ల్యుఆర్‌లను) స్థాపించే ఏజెన్సీగా ఉంది. ఎలక్ట్రానిక్ ఎన్‌డబ్ల్యుఆర్‌లకు ప్రతిగా చేసిన రుణాల భద్రతను నిర్ధారించడానికి బ్యాంకర్లకు అన్ని రకాల మద్దతును అందిస్తామని రెగ్యులేటరీ ఈ సమావేశానికి హాజరైన బ్యాంకర్లకు హామీ ఇచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులపై పంటకోత అనంతర రుణాలను పెంచడం, వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంచడం అనే ఉమ్మడి లక్ష్యంగా సాగిన ఈ సదస్సు లక్ష్యాలను సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ అంగీకరించారు. డబ్ల్యుడీఆర్ఏ అధికారులు అన్ని బ్యాంకులను పేపర్ వేర్‌హౌస్ రసీదులను ఉపయోగించకుండా, ఎలక్ట్రానిక్ ఎన్‌డబ్ల్యుఆర్‌ల ద్వారా గిడ్డంగి రసీదు ఫైనాన్సింగ్ యొక్క డిజిటల్ మోడ్‌కు మారాలని కోరారు. ఆర్థిక రంగంలో డిజిటలైజేషన్‌ను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కూడా ఇది దోహదపడుతుంది. ఈ సమావేశానికి డబ్ల్యూడీఆర్‌ఏ చైర్మన్ శ్రీ టి.కె. మనోజ్ కుమార్, నాబార్డు చైర్మన్ శ్రీ. షాజి కుమార్ కేవీ, డబ్ల్యూడీఆర్‌ఏ సభ్యుడు ముఖేష్ జైన్, వివిధ బ్యాంకుల ప్రాధాన్యతా రంగ రుణ సంస్థల అధినేతలతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఎంఎస్ఎంఈ విభాగాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
*****
(Release ID: 1891759)
Visitor Counter : 126