కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతదేశంలో స్టార్టప్ లు అందించే వినూత్న 5 జి వినియోగ కేసులను క్షేత్రస్థాయిలో మోహరించిన మొట్టమొదటి జిల్లాగా నిలచిన విదిషా


సామాజిక-ఆర్థిక వర్టికల్స్లో డిజిటల్ మార్పు ను వేగవంతం చేయడానికి స్టార్టప్లు, ఎస్ ఎం ఇ ల ప్రమోషనల్ పైలట్ల 5జి వినియోగ కేసు కింద సహకారాన్ని సులభతరం చేయనున్న డాట్ (డి ఒ టి)

Posted On: 13 JAN 2023 12:56PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్ లోని ఆకాంక్షిత జిల్లా విదిషా దేశంలోనే స్టార్టప్ లు అందించే వినూత్న 5 జి వినియోగ కేసులను క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్న మొట్టమొదటి జిల్లాగా అవతరించింది. అదనపు కార్యదర్శి (టెలికాం), అడ్మినిస్ట్రేటర్ యుఎస్ఓఎఫ్ మార్గదర్శకత్వంలో జిల్లా యంత్రాంగం , సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్), టెలికమ్యూనికేషన్స్ (డిఓటి) ఉమ్మడి చొరవగా స్టార్టప్ లు అందించే వినూత్న 5 జి వినియోగ కేసులను ఈ జిల్లా లో క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్నారు.

 

శ్రీ వి.ఎల్.కాంతారావు, అదనపు కార్యదర్శి (టెలికాం) ,యుఎస్ఒఎఫ్ అడ్మినిస్ట్రేటర్, విదిష జిల్లా పరిపాలన

 

సామాజిక-ఆర్థిక వర్టికల్స్ లో డిజిటల్ మార్పు ను వేగవంతం చేయడానికి, టెలికాం స్టార్టప్స్ అండ్ ఎం ఎస్ ఎం ఇ మిషన్ (టిఎస్ యుఎమ్), 5 జి వర్టికల్ ఎంగేజ్ మెంట్ పార్టనర్ షిప్ ప్రోగ్రామ్ (విఇపిపి) కింద టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్ మెంట్ (డిఓటి) డిజిటల్ కమ్యూనికేషన్ టెక్ - స్టార్టప్ లు ,ఎస్ ఎమ్ ఇల సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, స్మార్ట్ సిటీలు, ఆకాంక్షిత జిల్లాలు, వెర్టికల్ పరిశ్రమలు  వంటి సంభావ్య యూజర్ కమ్యూనిటీలకు సులభతరం చేస్తోంది.

అభివృద్ధి చెందుతున్న డిజిటల్ కమ్యూనికేషన్ టెక్నాలజీలలో అగ్రగామిగా ఉన్న సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్), మధ్యప్రదేశ్ లోని విదిషా (ఆకాంక్షాత్మక జిల్లా) లో స్టార్టప్ లు ఎస్ ఎమ్ ఇల 5 జి / 4 జి / ఐఓటి వినూత్న పరిష్కారాలను అమలు చేయడానికి "5 జి వినియోగ కేస్ ప్రమోషనల్ పైలట్"ను ప్రారంభించింది.

 

స్టార్టప్ తో ఒప్పందం కుదుర్చుకున్న శ్రీ

ఉమాశంకర్ భార్గవ్, కలెక్టర్, విదిష

 

5 జి వాడకం కేసు ప్రమోషనల్ పైలట్: 12 జనవరి 2023 న అదనపు కార్యదర్శి (టి) విదిషా జిల్లాలో పర్యటించినప్పుడు, సి-డాట్ సహకారంతో స్టార్టప్ లు ఈ క్రింది 5 జి / ఐఓటి వినియోగ కేసులను ప్రదర్శించాయి:

 

సూపర్ స్యూటికల్స్- కీలకాంశాలను లెక్కించ డానికి, దాదాపుగా తక్షణమే పరీక్షలు నిర్వహించడానికి 5జి /4జి ఎనేబుల్ చేయబడ్డ స్మార్ట్ హెల్త్ కియోస్క్,

 

అంబుపాడ్: ప్రాథమిక జీవిత భద్రతా సపోర్ట్, రిమోట్ డాక్టర్ సపోర్ట్ తో కీలకాలను లెక్కించగల 5G/4G ఎనేబుల్ చేయబడ్డ ఆటో

 

లాగిఎఐ: స్మార్ట్ ఫోన్ ఉపయోగించి కంటిశుక్లం వ్యాధిని వేగంగా, సమర్థవంతంగా స్క్రీన్ చేసే కేటరాక్ట్ ఐ స్క్రీనింగ్ అప్లికేషన్

 

ఈజిఫై : సమర్థవంతమైన రోగ నిర్ధారణ కోసం ఊపిరితిత్తులు ,మెదడు స్కాన్ (సి టి/ఎక్స్ రే మొదలైనవి) కు

ఎ ఆర్/వి ఆర్-3డి విజువలైజేషన్ అప్లికేషన్

 

టెక్ ఎక్స్ ఆర్: సృజనాత్మక బోధనా పద్ధతులతో విద్యార్థులకు మెరుగైన లెర్నింగ్, టీచింగ్ కోసం ఎ ఆర్/వి ఆర్-3డి AR/VR- 3D కిట్.

 

బికెసి అగ్రిగేటర్లు: ఫసల్ సలాహ్ యాప్ - రైతులకు నిర్ణయం తీసుకోవడానికి వ్యక్తిగతంగా పంట సలహా, మండీలు / వ్యాపారులతో అనుసంధానం కావడం, పంటలకు రాష్ట్ర సబ్సిడీలు / భీమా

 

ద్వార- సురభి: రాష్ట్ర శాఖ , బీమా కంపెనీలు ఉపయోగించే పశువుల ప్రత్యేక బయోమెట్రిక్ గుర్తింపు ,పాడి రైతులు ఉపయోగించే పశువుల ఆరోగ్య స్థితి అంచనా

 

సి-డాట్ (డిఓటి ఆర్ అండ్ డి విభాగం): టెలి కన్సల్టేషన్ ,ఇ-లెర్నింగ్ సొల్యూషన్ సూట్ ను ఎనేబుల్ చేసే,  అన్ని ఆరోగ్య సూట్ ల ఏకీకృత వన్ స్టాప్ ప్లాట్ ఫామ్.

 

5G వినియోగ కేస్ ప్రమోషనల్ పైలట్ కింద, పైన పేర్కొన్న వినియోగ కేసులను కమ్యూనిటీ , జిల్లా ఆరోగ్య కేంద్రాలు మోడల్ స్కూల్స్, అగ్రి అండ్ డెయిరీ ఫార్మర్స్, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లలో ఒక సంవత్సరం పాటు మోహరిస్తారు. అవసరాన్ని బట్టి తదుపరి విస్తరించవచ్చు. విదిశ యూజర్ కమ్యూనిటీలకు నిరంతరాయ సేవలను అందించడానికి ఈ డిజిటల్ పరిష్కారాలు భారత్ నెట్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా కూడా పవర్ చేయబడతాయి. 2023 జనవరి 12వ తేదీన డిజిటల్ సొల్యూషన్స్ విజయవంతమైన డెమోల తరువాత, విదిషా జిల్లా కలెక్టరేట్ లో ఈ క్రింది ప్రముఖుల సమక్షంలో సి-డాట్ , ఏడు స్టార్టప్ లతో కొనుగోలు,సర్వీస్ ఆర్డర్లు ఒప్పందాల పై సంతకాలు జరిగాయి. చేయబడ్డాయి.

 

I. కమ్యూనికేషన్స్ అండ్ సి-డాట్ మంత్రిత్వ శాఖ (స్టార్టప్స్ ఎంగేజ్మెంట్):

 

శ్రీ వి.ఎల్.కాంతారావు, అదనపు కార్యదర్శి (టెలికాం) ,

యు ఎస్ ఒ ఎఫ్ అడ్మినిస్ట్రేటర్

శ్రీ రవీందర్ అంబర్దార్, హెడ్ (మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ అఫైర్స్), సి-డాట్

ఎ. అలెక్స్ వికాస్, మిషన్ కో-ఆర్డినేటర్ (టిఎస్ యుఎమ్) అండ్ డిఒటి ప్రధాన కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్

 

II. విదిషా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ (5జి వినియోగ కేసుల అనుసరణ):

 

శ్రీ ఉమాశంకర్ భార్గవ్, కలెక్టర్, విదిశ, ఎంపి

శ్రీ యోగేష్ తుకారాం భార్సత్, సి ఇ ఒ, జిల్లా పంచాయితీ, విధిషా, ఎంపి

శ్రీ నికేత్ శర్మ, ముఖ్యమంత్రి కార్యాలయం

వ్యవసాయ, విద్య, ఆరోగ్యం, శానిటేషన్ తదితర శాఖల అధికారులు.

 

III. బిఎస్ ఎన్ ఎల్ అండ్ బిబిఎన్ ఎల్ (తక్కువ ఖర్చు, అంతరాయం లేని బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ):

 

శ్రీ సత్యానంద్ రాజహన్స్ ,సిజిఎంటి బిఎస్ఎన్ఎల్ ,ఎంపి,

శ్రీ సిఎల్ ఎస్ యాదవ్ స్టేట్ హెడ్ అండ్ సిజిఎం బిబిఎన్ఎల్ ,ఎంపి

శ్రీ ఎన్ కె లోధా జిఎమ్ బి ఎ భారత్ నెట్,

శ్రీ మనోజ్ కుమార్ సీనియర్ జి ఎం,

ట్రాన్స్ మిషన్,

శ్రీ పంకజ్ గుప్తా బి.ఎ హెడ్ సాగర్,

శ్రీ అనిల్ అహిర్వార్ జిఎం భారత్ నెట్ ఇండోర్

శ్రీ మయాంక్ త్రిపాఠి జిఎం భారత్ నెట్ భోపాల్

శ్రీ సత్యానంద్ రాజహన్స్, సిజిఎంటి

 

IV. యూజ్ కేస్ స్టార్టప్స్ ప్రతినిధులు (సృజనాత్మక డిజిటల్ పరిష్కారాలు)

 

వినూత్న డిజిటల్ వినియోగ కేసులు కలిగిన ఆసక్తిగల స్టార్టప్ లు , ఎస్ ఎం ఇ లు సి- డాట్ ద్వారా 5జి వినియోగ కేస్ ప్రమోషనల్ పైలట్లలో భాగం కావడానికి support@tcoe.in , alex.vikas17[at]gov[dot] లను సంప్రదించవచ్చు.

 

***(Release ID: 1891034) Visitor Counter : 186


Read this release in: English , Urdu , Hindi , Tamil