బొగ్గు మంత్రిత్వ శాఖ
రాంచీలో సిసిఎల్ పనితీరును సమీక్షించి, నూతన సౌకర్యాలను ప్రారంభించిన బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా
Posted On:
11 JAN 2023 7:31PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా, అదనపు కార్యదర్శి శ్రీ ఎం నాగరాజు, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) చైర్మన్ శ్రీ ప్రమోద్ అగర్వాల్ రాంచీలోని ప్రాజెక్ట్ భవన్‌ను బుధవారం సందర్శించి ఝార్ఖండ్ ప్రధాన కార్యదర్శి శ్రీ సుఖదేవ్ సింగ్ సింగ్‌తో ముచ్చటించారు. రాష్ట్రంలోని బొగ్గు మైనింగ్ కంపెనీలకు సంబంధించిన వివిధ సమస్యలను, అంశాలను వారు చర్చించారు. బిసిసిఎల్ సిఎండి, ఇసిఎల్ సిఎంపిడిఐ, సీనియర్ అధికారులతో కలిసి సిసిఎల్ సిఎండి శ్రీ పి.ఎం. ప్రసాద్ కీలక సమావేశానికి హాజరయ్యారు.
ఉదయం బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఝార్ఖండ్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి క్రీడాకారులతో సంభాషించారు. ఝారఖండ్ స్పోర్ట్స్ అకాడమీ అన్నది సిసిఎల్ చేపట్టిన సిఎస్ఆర్ వెంచర్. ఇది ఝార్ఖండ్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. అకాడెమీలోని క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీలలో పతకాలను గెలుచుకున్నారు. అక్కడి మౌలిక సదుపాయాలను సమీక్షించి, వారి సామర్ధ్యాలను ఉత్తమంగా ప్రదర్శించేందుకు క్రీడాకారులకు శ్రీ మీనా ప్రేరణను ఇచ్చారు.
పునరుద్ధరించిన ఆడిటోరియంను, సిసిఎల్‌లోని గాంధీ నగర్ ఆసుపత్రిలో ఆన్‌లైన్ ఆసుపత్రి నిర్వహణ వ్యవస్థను బొగ్గు శాఖ కార్యదర్శి ప్రారంభించారు. పారదర్శకతను పెంచేందుకు యాంత్రికీకరణ దిశగా సిసిఎల్ చేస్తున్న కృషి ఆన్‌లైన్ ఆసుపత్రి నిర్వహణ వ్యవస్థ. సిసిఎల్ తొలి ఇ-వాహనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. పర్యావరణ అనుకూల చొరవలను పెంచడంలో భాగంగా సిసిఎల్ 16 ఇ-వాహనాలను కిరాయికి తీసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భాగస్వాములందరికీ ఉత్తమమైన వైద్య సదుపాయాలను అందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలని శ్రీ మీనా అన్నారు.
కోవిడ్ మహమ్మారి కాలంలో సిఐఎల్ ఆసుపత్రులు అసాధారణ పాత్రను పోషించాయనిపేర్కొంటూ, భవిష్యత్తులో కూడా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అదే అంకిత భావంతో పని చేస్తారనే విశ్వాసాన్ని సిఐఎల్ చైర్మన్ శ్రీ ప్రమోద్ అగర్వాల్ వ్యక్తం చేశారు.
***
(Release ID: 1890576)
Visitor Counter : 150