సహకార మంత్రిత్వ శాఖ
మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (ఎం.ఎస్.సి.ఎస్) చట్టం, 2002 కింద జాతీయ స్థాయి మల్టీ-స్టేట్ కో ఆపరేటివ్ ఎగుమతి సొసైటీ ఏర్పాటును ఆమోదించిన - కేంద్ర మంత్రివర్గం
మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (ఎం.ఎస్.సి.ఎస్) చట్టం, 2002 కింద నమోదు చేసుకోవాల్సి ఉంది
పి.ఏ.సి.ఎస్. నుంచి ఏ.పి.ఈ.ఎక్స్ : ప్రాథమిక సంఘాలు, జిల్లా, రాష్ట్ర. జాతీయ స్థాయి సమాఖ్యలతో పాటు బహుళ రాష్ట్ర సహకార సంఘాలతో సహా ప్రాథమిక నుండి జాతీయ స్థాయి సహకార సంఘాలు దాని సభ్యులు కావచ్చు
ఈ సహకార సంఘాలన్నింటిలో వాటి నిబంధనల ప్రకారం ఎన్నుకున్న ప్రతినిధులు ఆయా బోర్డుల్లో సభ్యులుగా ఉంటారు.
సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల మద్దతుతో దేశవ్యాప్తంగా వివిధ సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి అయిన మిగులు వస్తువులు / సేవలను ఎగుమతి చేయడానికి ఇది ఒక ఆధార సంస్థ గా పని చేస్తుంది.
సహకార సంస్థల సమ్మిళిత వృద్ధి నమూనా ద్వారా “సహకార్-సే-సమృద్ధి” లక్ష్యాన్ని సాధించడంలో ఇది సహాయం చేస్తుంది.
Posted On:
11 JAN 2023 3:37PM by PIB Hyderabad
గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం, మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (ఎం.సి.సి.ఎస్) చట్టం, 2002 కింద జాతీయ స్థాయి మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ ఎక్స్పోర్ట్ సొసైటీని ఏర్పాటు చేసి, ప్రోత్సహించడానికి ఆమోదించింది. సంబంధిత మంత్రిత్వ శాఖల మద్దతుతో ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర వాణిజ్య శాఖ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖల ఎగుమతి సంబంధిత విధానాలు, పథకాలు, ఏజెన్సీల ద్వారా సహకార సంస్థలు, సంబంధిత సంస్థలు ఉత్పత్తి చేసే అన్ని వస్తువులు, సేవల ఎగుమతులను చేపట్టేందుకు 'మొత్తం ప్రభుత్వ విధానం' ను అనుసరించడం ద్వారా ఈ సొసైటీ ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఎగుమతులను నిర్వహించడానికి, ప్రోత్సహించడానికి ఒక అనుసంధాన సంస్థ గా పని చేయడం ద్వారా ప్రతిపాదిత సొసైటీ సహకార రంగం నుంచి ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ సహకార సంస్థల ఎగుమతి సామర్థ్యాన్ని వెల్లడించడంలో ఇది సహాయపడుతుంది. భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖల ఎగుమతులకు సంబంధించిన వివిధ పథకాలు, విధానాల ప్రయోజనాలను 'మొత్తం ప్రభుత్వ విధానం' ద్వారా కేంద్రీకృత పద్ధతిలో పొందడంలో సహకార సంస్థలకు కూడా ఈ ప్రతిపాదిత సొసైటీ సహాయం చేస్తుంది. మెరుగైన ధరలను సాధించడం ద్వారా సభ్యులు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే సహకార సంఘాల సమ్మిళిత వృద్ధి నమూనా ద్వారా, అదేవిధంగా, వారి వస్తువులు, సేవల ఎగుమతి తో పాటు, సొసైటీ ద్వారా ఉత్పత్తి అయిన మిగులు నుంచి పంపిణీ చేసిన డివిడెండ్ ద్వారా, “సహకార్-సే-సమృద్ధి” లక్ష్యాన్ని సాధించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ప్రతిపాదిత సొసైటీ ద్వారా చేసి అధిక ఎగుమతులు వివిధ స్థాయిలలో సహకార సంస్థల ద్వారా వస్తువులు, సేవల ఉత్పత్తిని పెంచుతాయి, తద్వారా సహకార రంగంలో మరింత ఉపాధికి దారి తీస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వస్తువులను ప్రాసెస్ చేసి, సేవలను మెరుగుపరచడం ద్వారా కూడా అదనపు ఉపాధి లభిస్తుంది. సహకార రంగంలో ఉత్పత్తుల ఎగుమతి పెరిగితే, “మేక్ ఇన్ ఇండియా” లక్ష్యం నెరవేరుతుంది. తద్వారా అది ఆత్మ-నిర్భర్-భారత్” కు దారి తీస్తుంది.
*****
(Release ID: 1890549)
Visitor Counter : 163