వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైతుల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి


రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి : దేశంలోని కోట్లాది మంది రైతులకు 'ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన' ద్వారా భద్రత

ప్రధాన మంత్రి పంటల బీమా పథకం కింద రైతులకు సరైన మొత్తంలో పరిహారం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: కైలాష్ చౌదరి

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న మొత్తాల క్లెయింలకు సంబంధించి త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం

Posted On: 08 JAN 2023 6:19PM by PIB Hyderabad

రైతుల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి దేశంలోని రైతులందరికీ హామీ ఇచ్చారు.

రాజస్థాన్ లోని బార్మర్ లో ఈరోజు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి

శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని కోట్లాది మంది రైతులకు భద్రత

కల్పించడం కోసం ‘’ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’’ పని చేస్తోందని

శ్రీ చౌదరి తెలిపారు. రాజస్థాన్ లో ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయడానికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు. బార్మర్ లో ఖరీఫ్ 2021 కోసం రైతులు తక్కువ మొత్తంలో క్లెయింలు పొందడంపై అడిగిన ప్రశ్నలకు చౌదరి సమాధానమిస్తూ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణాత్మక నివేదిక కోరామని, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తన సొంత స్థాయిలో పరిశీలిస్తోందని, త్వరలోనే రైతుల క్లెయింలను సక్రమంగా చెల్లిస్తామని చెప్పారు.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద బార్మర్ లోని రైతులు స్వల్ప మొత్తంలో క్లెయింలను పొందడం పై

శ్రీ చౌదరి మాట్లాడుతూ, రైతులకు క్లెయింల పంపిణీ దరఖాస్తుల వారీగా జరుగుతుందని, అందువల్ల చిన్న విస్తీర్ణం కారణంగా తక్కువ క్లెయింలు అందుకున్న పరిస్థితి ఉండవచ్చునని అన్నారు. ఈ విషయంలో, కొంత డేటా పరీక్షించగా చాలా పొలాలు ఉన్న ఒకే రైతుకు అతని చిన్న పొలంలో క్లెయిం మొత్తం

తక్కువగానూ,  పెద్ద పొలంలో క్లెయిం మొత్తం ఎక్కువగానూ ఉన్నట్టు కనుగొన్నట్లు చెప్పారు.

తక్కువ బీమా క్లెయింలు రైతులలో అసంతృప్తికి దారితీస్తాయని అంగీకరించిన శ్రీ చౌదరి, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలతో సంప్రదింపులు అవసరమని, ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి అవసరమైన చర్య తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.

జనవరి 6, 2023 న, కేంద్ర ప్రభుత్వం అన్ని బీమా కంపెనీలకు లేఖ రాసిందని, రైతులెవ్వరి దరఖాస్తుల క్లెయింలను విడివిడిగా తీసుకోకూడదని, ఏకీకృత పద్ధతిలో లెక్కించాలని, తద్వారా రైతు తాను మొత్తం ఎంత పొందుతాడో సులభంగా అర్థం చేసుకోవచ్చని శ్రీ చౌదరి తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా నివారణ విత్తనాలను అమలు చేయాలని బీమా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 25 పట్వార్‌లలో మాత్రమే అమలు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇది కాకుండా, పట్వార్ లోని పంట కోత నుండి పొందిన దిగుబడి డేటా ఆధారంగా బీమా కంపెనీ క్లెయింను లెక్కించాల్సి ఉంటుంది. ఈ విషయంలో కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ "రాష్ట్ర స్థాయి సాంకేతిక సలహా సంఘాన్ని" ముందుజాగ్రత్తగా నాట్లు వేయాలనే నిబంధనను అమలు చేయాలని అభ్యర్థించింది. రాష్ట్ర కమిటీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో కేంద్ర ప్రభుత్వం తన సాంకేతిక విశ్లేషణను తన ఢిల్లీకి చెందిన సంస్థ మహలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్కాస్టింగ్ సెంటర్ (ఎం ఎన్ సి ఎఫ్ సి) తో చేయించి విశ్లేషణ నివేదికను తగిన చర్య కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఆ నివేదికలో ఎక్కడా నివారణ నాట్లు వేసినట్లు ధృవీకరించబడలేదు. ఎంఎన్ సీఎఫ్ సీ నుంచి వచ్చిన విశ్లేషణ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సలహా కమిటీ దిగుబడి డేటా ఆధారంగా రైతుల క్లెయింలను త్వరలో విడుదల చేయాలని బీమా కంపెనీని ఆదేశించింది.

క్లెయిం ప్రక్రియ పూర్తి వరస క్రమాన్ని శ్రీ చౌదరి వివరించారు. ఈ విషయంలో బీమా కంపెనీ మరోసారి కేంద్ర ప్రభుత్వ జాతీయ స్థాయి సాంకేతిక సలహా కమిటీ ముందు అప్పీల్ ను ప్రతిపాదించిందని, ఇది చెల్లదని కేంద్ర ప్రభుత్వం వెంటనే తిరస్కరించిందని చెప్పారు. అదే సమయంలో పథకం మార్గదర్శకాల ప్రకారం ఒక కాలపరిమితి తర్వాత నివారణ నాట్లు వేయాలనే నిబంధనను అమలు చేయలేమని,  దిగుబడి డేటా ఆధారంగా తక్షణ క్లెయిం ఇవ్వాలని కంపెనీని ఆదేశించిందని చెప్పారు. కంపెనీ మళ్ళీ ప్రతిపాదనను కేంద్ర అప్పీలేట్ అధికారికి పంపింది, కాని దానిని మళ్ళీ తిరస్కరించిన అప్పీలేట్ అధికారి రైతులకు సరైన క్లెయింలు ఇవ్వాలని కంపెనీని ఆదేశించారు.

ఖరీఫ్ 2021 క్లెయిమ్ గురించి వివరణ ఇస్తూ, బీమా కంపెనీ అప్పీల్ ను తిరస్కరించిన తరువాత, కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన మేరకు క్లెయింకు సంబంధించి కొన్ని గణాంకాలను ఇచ్చిందని, ఈ గణాంకాలు బీమా క్లెయిం సరైన స్థితిని స్పష్టం చేశాయని , కానీ ఆ ప్రకారం కాకుండా క్లెయింల పంపిణీ ప్రారంభమైన ఈ సమయంలో, కొంతమంది రైతులకు చాలా తక్కువ మొత్తంలో క్లెయింలు జారీ చేయబడినట్లు కనుగొన్నట్టు చెప్పారు.

దీనికి సంబంధించి సత్వర చర్య తీసుకున్న కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన క్లెయింల వివరాల కోసం కంపెనీని కోరింది, దీనిలో చాలా మంది రైతుల బీమా సొమ్ము పొలం విస్తీర్ణం చాలా తక్కువ కారణంగా, కొన్ని భీమా దరఖాస్తులకు సంబంధించి క్లెయింలు తక్కువగా చేయబడినట్లు కనుగొనబడింది. ఈ విషయంలో, ఒక రైతు ఈ పథకం కింద నమోదు చేసుకున్నప్పుడు, అతని వివిధ పొలాలకు ప్రత్యేక దరఖాస్తు జనరేట్ అవుతుంది. ప్రతి దరఖాస్తుకు సంబంధించి పాలసీ ప్రీమియం ,బీమా మొత్తం పంట , బీమా చేసిన ప్రాంతం ఆధారంగా ఉంటుంది.

మహారాష్ట్ర ను ఉదాహరణగా పేర్కొంటూ, కనీస క్లెయిం మొత్తానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించిందని, క్లెయిం మొత్తం రూ .1000 కంటే తక్కువగా ఉంటే, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, రైతుకు కనీసం రూ .1000 చెల్లిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. రాజస్థాన్ తో సహా ఇతర రాష్ట్రాల్లో ఈ నిబంధన లేదని, కాబట్టి ఈ విషయంలో అన్ని రాష్ట్రాలతో చర్చించిన తరువాత రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో విధాన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తన స్థాయిలో పరిశీలిస్తోందని, రైతులకు తగిన క్లెయిం మొత్తాన్ని చెల్లిస్తామని రాజస్థాన్ రైతులందరికీ శ్రీ కైలాష్ చౌదరి మరోసారి హామీ ఇచ్చారు.

 

<><><><><>


(Release ID: 1889663) Visitor Counter : 259