రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

"యూత్ ఎక్స్ఛేంజ్" కార్యక్రమంలో భాగంగా 19 స్నేహ పూర్వక దేశాలకు చెందిన క్యాడెట్లు ఎన్.సి.సి. గణతంత్ర దినోత్సవ శిబిరం 2023 లో పాల్గొంటున్నారు


ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ఎన్.సి.సి. శిబిరంలో 700 మంది బాలికలతో సహా 2,150 మందికి పైగా క్యాడెట్లు పాల్గొంటున్నారు

Posted On: 06 JAN 2023 5:13PM by PIB Hyderabad

ఢిల్లీ కంటోన్మెంట్ లోని కరియప్ప పరేడ్ మైదానంలో 2023 జనవరి, 2వ తేదీన ప్రారంభమైన 74వ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి) గణతంత్ర దినోత్సవ శిబిరం (ఆర్.డి.సి) 2023 లో యువజన మార్పిడి కార్యక్రమంలో భాగంగా 19 స్నేహ పూర్వక దేశాలకు చెందిన క్యాడెట్లు, అధికారులు పాల్గొంటున్నారు.  ఒక నెలపాటు జరిగే ఈ శిబిరంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 710 మంది బాలికలతో సహా మొత్తం 2,155 మంది క్యాడెట్లు పాల్గొంటున్నారు. 2023 జనవరి, 6వ తేదీన న్యూ ఢిల్లీ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్.సి.సి. డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌ పాల్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు.

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఎన్.సి.సి. డైరెక్టర్ జనరల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, అమెరికా, యు.కె., అర్జెంటీనా, బ్రెజిల్, మంగోలియా, రష్యా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, నేపాల్, వియత్నాం, మాల్దీవులు, మొజాంబిక్, మారిషస్, సీషెల్స్, సూడాన్, న్యూజిలాండ్, ఫిజీ లతో సహా 19 స్నేహపూర్వక దేశాలకు చెందిన క్యాడెట్లు, అధికారులు ఆర్.డి.సి.-2023 లో పాల్గొంటున్నారని తెలియజేశారు.  గణతంత్ర దినోత్సవ శిబిరంలో విదేశీ క్యాడెట్లు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం ఇదే మొదటి సారి. 

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొంటున్న మొత్తం 2,155 మంది క్యాడెట్లలో, 114 మంది జమ్మూ-కశ్మీర్, లడఖ్ ప్రాంతాలనుంచీ, 120 మంది క్యాడెట్లు ఈశాన్య ప్రాంతం (ఎన్.ఈ.ఆర్) నుండి వచ్చారు.   దేశం నలుమూలల నుండి వచ్చిన క్యాడెట్లతో, ఈ శిబిరం ఒక ‘మినీ భారతదేశానికి’ ప్రతిబింబంగా ఉంది. 

శిబిరానికి హాజరైన క్యాడెట్లు సాంస్కృతిక పోటీలు, జాతీయ సమగ్రత అవగాహన కార్యక్రమాలు, వివిధ సంస్థాగత శిక్షణా పోటీలు వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారని, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌ పాల్ సింగ్  తెలిపారు.  2023 జనవరి, 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో రెండు ఎన్.సి.సి. మార్చింగ్ కాంటింజెంట్లు పాల్గొంటాయి.  ఈ అసంఖ్యాకమైన, డిమాండ్‌ తో కూడిన కార్యకలాపాలు 2023 జనవరి, 28వ తేదీ సాయంత్రం జరిగే ప్రధానమంత్రి ర్యాలీ తో ముగుస్తాయని, ఆయన చెప్పారు. 

(చిత్రం2023 జనవరి, 6 తేదీన న్యూ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎన్.సి.సిడైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌ పాల్ సింగ్)

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ రాజధానిలో జరిగే ముఖ్యమైన సంఘటనలు, బీటింగ్-ది-రిట్రీట్‌ తో పాటు మన దేశ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించడం, క్యాడెట్ల వ్యక్తిగత లక్షణాలను మెరుగుపర్చడానికి, వారి వ్యక్తిత్వ విలువను బలోపేతం చేయడం, గణతంత్ర దినోత్సవ శిబిరం లక్ష్యమని ఎన్‌.సి.సి. డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. 

గత ఏడాదిలో గ్రూప్‌ లు, డైరెక్టరేట్ల స్థాయిలో అనేక రౌండ్ల కఠినమైన స్క్రీనింగ్ తర్వాత ఆర్.డి.సి. క్యాడెట్లను ఎంపిక చేయడం జరిగింది.   ప్రతి క్యాడెట్ ఆర్.డి.సి.-23కి చేరుకోవడానికి ముందు నాలుగు నుండి ఐదు స్క్రీనింగ్‌లకు గురయ్యారు.

2022 సంవత్సరంలో ఎన్.సి.సి. ప్రధాన విజయాలను లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్ కొనియాడారు.   పునీత్ సాగర్ అభియాన్, సహే దోన్ కో షట్ నమన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం, హర్ ఘర్ తిరంగా, యూనిటీ ఫ్లేమ్ రన్ మొదలైన వివిధ కార్యక్రమాలలో క్యాడెట్లు అందించిన సహకారాన్ని ఆయన అభినందించారు.

ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నీటి వనరులను శుద్ధి చేసే ఈ ఉదాత్త కార్యక్రమంలో స్థానిక ప్రజలను చైతన్యం చేయడం ద్వారా పునీత్ సాగర్ అభియాన్‌ ను భారతదేశం అంతటా ప్రాచుర్యం పొందేందుకు యువ క్యాడెట్ల ప్రయత్నాలను ఎన్.సి.సి. డైరెక్టర్ జనరల్ అభినందించారు.   ఇప్పటి వరకు సుమారు 13.5 లక్షల మంది ఎన్‌.సి.సి. క్యాడెట్లు అభియాన్‌ లో పాల్గొన్నారు, దాదాపు 208 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి, వాటిలో 167 టన్నులు పునర్వినియోగం చేశారు. 

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 2022 జులై, 31వ తేదీ నుంచి 2022 ఆగష్టు, 16వ తేదీ వరకు ఎన్.సి.సి. నిర్వహించిన ప్రత్యేక ఏక్-భారత్-శ్రేష్ఠ-భారత్-స్వాతంత్య్ర దినోత్సవ శిబిరం (ఈ.బి.ఎస్.బి-ఐ.డి.సి) గురించి కూడా లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌ పాల్ సింగ్ ప్రస్తావించారు. దేశంలోని ప్రతి జిల్లాకు చెందిన క్యాడెట్లు ఎర్రకోటలో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడం ద్వారా జాతీయ సమగ్రతను ప్రోత్సహించడం, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారా 'భిన్నత్వంలో ఏకత్వాన్ని' బలోపేతం చేయడం దీని లక్ష్యం.

వివిధ క్రీడల్లో ఎన్‌.సి.సి. క్యాడెట్లు ప్రదర్శించిన అసాధారణ ప్రదర్శనను ఎన్‌.సి.సి. డైరెక్టర్ జనరల్ కూడా ప్రశంసించారు.  జవహర్‌లాల్ నెహ్రూ హాకీ టోర్నమెంట్‌లో ఎన్‌.సి.సి. జూనియర్ బాలికల హాకీ జట్టు వరుసగా రెండవ సంవత్సరం విజేతగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

*****



(Release ID: 1889489) Visitor Counter : 143


Read this release in: English , Urdu , Hindi , Marathi