శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
రేపు మొహాలీలోని ఎన్‌ఏబిఐ సందర్శించనున్న డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
04 JAN 2023 7:11PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ; ఎంఒఎస్, పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు మొహాలిలోని ఎన్‌ఏబిఐలో 'నేషనల్ జీనోమ్ ఎడిటింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎన్‌జిఈటీసీ)' మరియు 'ఆహారం మరియు పోషకాహార భద్రతపై అంతర్జాతీయ సదస్సు-2023 (ఐఫ్యాన్స్-2023)ని ప్రారంభించనున్నారు.
ఎన్‌జిఈటిసీ అనేది ఒక అత్యాధునిక సదుపాయం ఉన్న సంస్థ. ఇది సిఆర్‌ఐఎస్‌పిఆర్-సిఎఎస్ మధ్యవర్తిత్వ జన్యు సవరణతో సహా వివిధ జన్యు సవరణ పద్ధతులను స్వీకరించడానికి ప్రాంతీయ అవసరాలను తీర్చడానికి జాతీయ వేదికగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత వాతావరణ దృష్టాంతంలో మంచి పోషకాహారం మరియు మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణమైన పంటలను మెరుగుపరచడం ఒక ముఖ్యమైన సవాలు. జీనోమ్ ఎడిటింగ్ అనేది పంటలలో కావలసిన లక్షణాలను అందించడానికి భారతీయ పరిశోధనలు స్వీకరించగల మంచి సాంకేతికత. అరటి, వరి, గోధుమ, టమోటా, మొక్కజొన్న మరియు మిల్లెట్‌లతో సహా విస్తారమైన పంటలకు జన్యు సవరణ సాధనాలను ఎన్‌ఎబిఐ అందిస్తుంది.
ఆహార మరియు పోషకాహార భద్రతపై అంతర్జాతీయ సదస్సు (ఐఫ్యాన్స్-2023)ని నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఎబిఐ), సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయోప్రాసెసింగ్ (సిఐఏబి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐపిబి) మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు బయోటెక్నాలజీ (ఐసిజీఈబి)లు మొహాలిలోని ఎన్‌ఏబిఐలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
వ్యవసాయం, ఆహారం మరియు పోషకాహార బయోటెక్నాలజీ మరియు జీనోమ్ ఎడిటింగ్ రంగాలలో అంతర్జాతీయ నిపుణులు మరియు యువ పరిశోధకులను ఒకచోట చేర్చాలని ఈ సమావేశం భావిస్తుంది. ఆహారం మరియు పోషకాహార భద్రత అనేది ప్రపంచ డిమాండ్ అనే వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుని యువ విద్యార్థులు మరియు పరిశోధకులను ప్రేరేపించడానికి సదస్సు యొక్క థీమ్‌ను రూపొందించారు. సిఆర్‌ఐఎస్‌పిఆర్-సిఏఎస్9ని ఉపయోగించి జన్యు సవరణ వంటి అధునాతన బయోటెక్నాలజీ సాధనం ఈ లక్ష్యాలను స్థిరమైన పద్ధతిలో సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 500 మందికి పైగా ఈ సదస్సు కోసం నమోదు చేసుకున్నారు. వీరితో పాటు ఈ నాలుగు రోజుల్లో 80 మంది వక్తలు (40 అంతర్జాతీయ మరియు 40 జాతీయ) తమ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పంచుకుంటారు.
*****
(रिलीज़ आईडी: 1888704)
आगंतुक पटल : 194