ఆర్థిక మంత్రిత్వ శాఖ
చెన్నైలో మెట్రో రెయిల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు $350 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకాలు చేసిన ఎడిబి, భారత్
Posted On:
03 JAN 2023 7:55PM by PIB Hyderabad
నగరంలో ప్రస్తుతమున్న ప్రజా రవాణా వ్యవస్థతో చెన్నైలో మెట్రోరైల్ వ్యవస్థ అనుసంధానాన్ని మెరుగు పరిచేందుకు, కొత్త లైన్లను నిర్మించేందుకు $ 350 మిలియన్ రుణ ఒప్పందంపై ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి), భారత ప్రభుత్వం మంగళవారం నాడు సంతకాలు చేశారు.
చెన్నై మెట్రోరైల్ పెట్టుబడి ప్రాజెక్టు కోసం తొలి విడత రుణ ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్ధిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా, ఎడిబి తరుఫున ఎడిబి ఇండియా రెసిడెంట్ మిషన్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ నిలాయా మితాష్ సంతకాలు చేశారు. చెన్నైలో మూడు కొత్త మెట్రో లైన్లను అభివృద్ధి చేసేందుకు మల్టీ ట్రాంచ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ (ఎంఎఫ్ ఎఫ్ -బహుళ విడతల ఆర్ధిక సౌకర్యం) లో భాగంగా 8 డిసెంబర్ 2022న తొలి విడత $780 మిలియన్ రుణ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.
చెన్నైలో కేంద్ర ప్రాంతాల నుంచి నగరంలోని దక్షిణ, పశ్చిమంలో ఉన్న ప్రధాన గమ్యస్థానాలకు అనుసంధానాన్ని విస్తరించి, వేలాదిమంది రోజువారీ ప్రయాణీకులకు ప్రయోజనం చేకూర్చడానికి ఇప్పటికే ఉన్న బస్సు, ఫీడర్ సేవలతో మెట్రో వ్యవస్థను అనుసంధానం చేయడానికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని, రుణ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత మాట్లాడుతూ శ్రీ మిశ్రా పేర్కొన్నారు.
చెన్నైలో మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు, ట్రాన్సిట్ - ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ (టిఒడి- రవాణా ఆధారిత అభివృద్ధి ) ద్వారా కలుపుకుపోయే సమగ్ర పట్టణ పునరుద్ధరణ చర్యలు, పట్టణ చలనశీలత మెరుగుదల మధ్య మెరుగైన ఏకీకరణను సులభతరం చేస్తుందని, మితాష్ అన్నారు. ఇటువంటి ఏకీకరణ ఉద్యోగాలు, సామాజిక ఆర్ధిక సేవలకు, పట్టణాల అడ్డదిడ్డమైన వ్యాప్తిని అరికట్టి, మోటరైజ్డ్ వాహనాలపై ఆధారపడడాన్ని తగ్గించి, నగరంలో జీవనాన్ని నివాసయోగ్యం చేస్తుంది.
ఈ పెట్టుబడి ప్రాజెక్టు మూడు నూతన లైన్లు 3,4, 5ల అభివృద్ధికి తోడ్పడుతుంది. లైన్ 3 కోసం షోలింగానల్లూరు నుంచిస్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు -2 మధ్య ప్రాజెక్టు 10.1 కిలోమీటర్ల ఎత్తైన సెక్షన్‌ను 9 మెట్రో స్టేషన్లు, సిస్టమ్ కాంపొనెంట్లను నిర్మిస్తుంది. లైన్ 4 కోసం లైట్ హౌజ్- మీనాక్షీ కాలేజ్ మధ్య 9 స్టేషన్లు సహా 10 కిమీల అండర్‌గ్రౌండ్ సెక్షన్ ను నిర్మించేందుకు ప్రాజెక్టు సహాయపడుతుంది. లైన్ 5 కోసం చెన్నై మఫసిల్ బస్ టెర్మినస్ నుంచి ఒక్క్యాం తొరైపాక్కం మధ్య 31 కిలో మీటర్ల ఎలక్ట్రికల్, మెకానికల్, విద్యుత్, టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు వంటి సిస్టం కాంపొనెంట్లకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.
స్టేషన్లను విపత్తు, వాతావరణ పరిస్థితులను బలంగా తట్టుకునే లక్షణాలను కలిగి ఉండటమే కాక వృద్ధులు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల అవసరాలకు స్పందించేలా తీర్చిదిద్దనున్నారు.
ప్రయాణీకుల అనుభవాలను మెరుగుపరిచేందుకు మెట్రో రైల్ కారిడార్‌ల వెంట బహుళ నమూనా పరస్పర మార్పిడులు డ్రాప్ ఆఫ్, పికప్ ఏరియాలు, షెల్టర్డ్ వెయిటింగ్ ఏరియాస్, సైకిల్ సౌకర్యాలు, ప్రయాణీకుల సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయనున్నారు. అదనంగా, $ 1 మిలియన్ల ఎడిబి సాంకేతిక సహాయం (టిఎ) మంజూరు అన్నది చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ మెట్రో వ్యవస్థ బహుళ నమూనా సమగ్రత కోసం ప్రణాళికలు రూపొందించుకునేందుకు, నిర్వహణకు తోడ్పడుతుంది.
***
(Release ID: 1888689)
Visitor Counter : 138