ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తేలికపాటి హెచ్ఎంఐఎస్ ని ప్రారంభించనున్న జాతీయ ఆరోగ్య సంస్థ


హెచ్ఎంఐఎస్ బీటా-పరీక్షలో పాల్గోవాలని ఆరోగ్య సంరక్షణ అందిస్తున్న సంస్థలను ఆహ్వానించిన జాతీయ ఆరోగ్య సంస్థ

Posted On: 29 DEC 2022 6:17PM by PIB Hyderabad

 తేలికైన, దృఢమైన మరియు  ఎబిడిఎం -కంప్లైంట్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్)  బీటా వెర్షన్‌ను జాతీయ ఆరోగ్య సంస్థ  (NHA) విడుదల చేస్తోంది. ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్న వారు ముఖ్యంగా  ప్రైవేట్ క్లినిక్‌లు, పరిమిత ఆరోగ్య సేవలు అందిస్తున్న సంస్థలకు హెచ్ఎంఐఎస్ డిజిటల్ పరిష్కార వేదికగా పనిచేస్తుంది.  


భారతదేశంలో డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి జాతీయ ఆరోగ్య సంస్థ తన ప్రధాన కార్యక్రమంగా  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ( ఎబిడిఎం)ని అమలు చేస్తోంది. లక్ష్య సాధన దిశలో భాగంగా కో విన్ మాడ్యూల్ లో అమలు జరుగుతున్న పటిష్ట విధానాల ఆధారంగా హెచ్ఎంఐఎస్ పరిష్కార వ్యవస్థను అభివృద్ధి చేయాలని జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఇది చిన్న క్లినిక్‌ల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేస్తుంది. దేశంలో ఆరోగ్య సేవలు అందిస్తున్న సంస్థల వివరాలు త్వరగా తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. 


హెచ్ఎంఐఎస్   బీటా వెర్షన్ క్రింది సౌకర్యాలు అందిస్తుంది:

1. ఎబిడిఎం కంప్లైంట్  - వైద్యులు తమ రోగుల  ABHA (ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా)ను రూపొందించడానికి మరియు పొందేందుకు అనుమతిస్తుంది.
2. సౌకర్యాల నిర్వహణ   - వైద్యులు వారి క్యాలెండర్, అపాయింట్‌మెంట్‌లు మరియు రోగి వివరాలను ఏకగవాక్ష విధానం ద్వారా  నిర్వహించడానికి అనుమతిస్తుంది
3, డిజిటల్ సేవలు  - నమోదిత రోగుల కోసం మునుపటి ఆరోగ్య రికార్డులు మరియు ప్రిస్క్రిప్షన్‌లను వీక్షించడానికి మరియు వీడియో సంప్రదింపులు తీసుకోవడానికి వైద్యులను అనుమతిస్తుంది
4. ఈ -ప్రిస్క్రిప్షన్ సేవలు  – ప్రిస్క్రిప్షన్ లేఅవుట్‌ను సవరించడానికి/అనుకూలీకరించడానికి ఎంపికలతో అనేక రకాల ప్రమాణాలు  ఉపయోగించి డిజిటల్ ప్రామాణిక ప్రిస్క్రిప్షన్‌లను రూపొందించి , అందించడానికి  హెచ్ఎంఐఎస్ వీలు కల్పిస్తుంది.    
ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్న సంస్థలు, వ్యక్తులు నూతన పరిష్కార వేదికను ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. సౌకర్యాన్ని ఉపయోగించి దీనికి సంబంధించి తమ    విలువైన అభిప్రాయాలు  అందించవచ్చు. అభిప్రాయాలు అందించడం ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్న వారు దేశంలో పటిష్ట డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించవచ్చు. ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్న వారి నుంచి అందిన అభిప్రాయాలు, సలహాలు సూచనలు ఆధారంగా పటిష్ట ఎబిడిఎం ఆధారంగా పనిచేసే  సాఫ్ట్‌వేర్‌ మరింత పటిష్టంగా పనిచేయడానికి ఉపయోగిస్తారు. హెచ్ఎంఐఎస్ ని  https://docmitrabeta.abdm.gov.in/ లో చూడవచ్చు.  హెచ్ఎంఐఎస్  వినియోగదారు మాన్యువల్ కూడా అదే లింక్‌లో అందుబాటులో ఉంది.


దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్న వారు హెచ్ఎంఐఎస్ ని అమలు చేసేలా చూడడానికి, వారి నుంచి అభిప్రాయాలు సేకరించడానికి జాతీయ ఆరోగ్య సంస్థ 2023 జనవరి 4న   వర్చువల్ విధానంలో బీటా-టెస్టింగ్ వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది. తమ విలువైన సూచనలు అందించడానికి మరియు భారతదేశ డిజిటల్‌లో భాగం కావడానికి వర్క్‌షాప్‌లో పాల్గోవాలని జాతీయ ఆరోగ్య సంస్థ కోరింది.   ఆసక్తిగల ఆరోగ్య సంరక్షణ నిపుణులు వర్క్‌షాప్ కోసం  https://abdm.nha.gov.in/docmitra లో నమోదు చేసుకోవచ్చు. 

 

***


(Release ID: 1887412) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi