రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

భద్రాచలం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ , రామప్ప టెంపుల్స్ లో తీర్థయాత్రా మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్రపతి శంకుస్థాపన

Posted On: 28 DEC 2022 7:47PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (డిసెంబర్ 28, 2022) భద్రాచలంలో

ప్రషాద్ పథకం కింద భద్రాచలం గ్రూప్ దేవాలయాలలో తీర్థయాత్ర సౌకర్యాల అభివృద్ధికి పునాదిరాయి వేశారు. అనంతరం భద్రాచలంలో వనవాసి కల్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జంజతి పూజారీ సమ్మేళనాన్ని, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను రాష్ట్రపతి వర్చువల్ గా ప్రారంభించారు.

 

తెలంగాణలోని ప్రసిద్ధ దేవాలయాలను లక్షలాది మంది యాత్రికులు సందర్శిస్తుంటారని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశీయ, విదేశీ పర్యాటకులలో తీర్థ 

యాత్రికులే పెద్ద సంఖ్యలో ఉన్నారని ఆమె చెప్పారు. ఈ విధంగా, తీర్థయాత్ర పర్యాటకం దేశీయ పర్యాటకాన్ని పెంచడంలో భారీ వాటాను కలిగి ఉంది. పర్యాటకం జీవనోపాధి అవకాశాలను, ప్రజల ఆదాయాన్ని పెంచుతుంది.స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. ప్రషాద్ పథకం కింద పుణ్యక్షేత్రాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక రంగానికి ఊతమిచ్చినందుకు పర్యాటక మంత్రిత్వ శాఖను ఆమె అభినందించారు.

 

గిరిజన ప్రజలు, ముఖ్యంగా కోయ వర్గానికి చెందిన వారు సమ్మక్క సారలమ్మకు ప్రార్థనలు చేయడానికి తరలివస్తారని

అంటూ, ఇటువంటి పండుగలు, సమావేశాలు సామాజిక సామరస్యాన్ని బలపరుస్తాయని రాష్ట్రపతి అన్నారు. ఈ కార్యక్రమాలతో మన సంప్రదాయాలను తరతరాలకు పెంచుకుంటూనే

ఉన్నామని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను సజీవంగా ఉంచడం అత్యవసరమని ఆమె అన్నారు.

ఇది మన వారసత్వాన్ని పరిరక్షించడానికి కూడా సహాయపడుతుంది. ఈ సమ్మేళనాన్ని నిర్వహించినందుకు తెలంగాణ వనవాసి కళ్యాణ్ పరిషత్ ను ఆమె అభినందించారు. అటవీ నివాసితుల సమగ్ర అభివృద్ధికి పరిషత్ చేస్తున్న నిరంతరం కృషి పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

 

మన సమాజం , దేశం సమగ్ర అభివృద్ధికి అన్ని పురోగతి కోణాల్లో మహిళల చురుకైన భాగస్వామ్యం చాలా అవసరం అని రాష్ట్రపతి అన్నారు. మహిళలను ఆర్థిక సాధికారత దిశగా ముందుకు తీసుకెళ్లడానికి వనవాసి కల్యాణ్ పరిషత్ అభివృద్ధి కేంద్రాలను నడపడం సంతృప్తి కలిగించే విషయమని ఆమె అన్నారు.

గ్రామీణాభివృద్ధిపై అవగాహన పెంచడానికి పరిషత్ గిరిజన ప్రాంతాల్లో శిబిరాలను కూడా నిర్వహిస్తోంది. ఇటువంటి సంక్షేమ ,అభివృద్ధి

కార్యక్రమాలు చేపడుతున్న పరిషత్ ను ఆమె అభినందించారు.

 

అనంతరం రాష్ట్రపతి వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి, అక్కడ పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, కామేశ్వరాలయ ఆలయ పునరుద్ధరణకు శంకుస్థాపన చేశారు.

 

***.


(Release ID: 1887148) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Marathi