కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభం

Posted On: 23 DEC 2022 1:25PM by PIB Hyderabad

భారత ప్రభుత్వపు ఆత్మ-నిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా దేశంలో 4జీ వ్యవస్థను అమలు చేయాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ సర్కారు ఆదేశించింది. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీఓసీకోసం బీఎస్ఎన్ఎల్ 1 జనవరి, 2021 ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐని విడుదల చేసిందికొన్ని పెండింగ్‌ పాయింట్లతో పీఓసీ పూర్తయిందిబీఎస్ఎన్ఎల్ 31-03-2022 4జీ అమలులోకి తెచ్చేందుకు గాను అవసరమైన 6000 సైట్ కోసం కొనుగోలు ఆర్డర్ను మరియు 25-07-2022 6,000 సైట్ కొనుగోలు ఆర్డర్ను జారీ చేసింది తర్వాతబీఎస్ఎన్ఎల్ తన లక్ష 4జీ సైట్ల అవసరాల కోసం 2022 అక్టోబర్లో టెండర్ను విడుదల చేసింది. 23.10.2019 భారత ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ మరియు ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను ఆమోదించిందిస్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్), సావరిన్ గ్యారెంటీ బాండ్లను పెంచడం ద్వారా రుణ పునర్నిర్మాణంమూలధన ఇన్ఫ్యూషన్ ద్వారా 4జీ సేవల కోసం స్పెక్ట్రమ్ యొక్క మూలధన కేటాయింపుకోర్ మరియు నాన్-కోర్ ఆస్తుల నగదీకరణ, ఖర్చుల తగ్గింపును ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బీఎస్ఎన్ఎల్ మరియు ఎంటీఎన్ఎల్ విలీనానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటి ఫలితంగా, 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి బీఎస్ఎన్ఎల్ సంస్థ ఇ.బి.ఐ.టి.డి.ఎ. (వడ్డీకి ముందు ఆదాయం, పన్నులు, తరుగుదల మరియు రుణ విమోచన) సానుకూలంగా మారింది. 27.07.2022న బీఎస్ఎన్ఎల్ సంస్థను ఆకర్షణీయమైన ప్రభుత్వ రంగ సంస్థగా మార్చడానికి  ప్రభుత్వం ఈ సంస్థ  కోసం రూ. 1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. పునరుద్ధరణ చర్యలు బీఎస్ఎన్ఎల్ సేవలను అప్‌గ్రేడ్ చేయడం, స్పెక్ట్రమ్‌ను కేటాయించడం, దాని బ్యాలెన్స్ షీట్‌ భారాన్ని తగ్గించడం మరియు బీఎస్ఎన్ఎల్ సంసథతో భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్) ని విలీనం చేయడం ద్వారా దాని ఫైబర్ నెట్‌వర్క్‌ను పెంచడం కోసం తాజాగా మూలధనాన్ని వినియోగంపై  దృష్టి పెడుతుంది. ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ ఈ సమాచారాన్ని అందించారు.

***



(Release ID: 1886289) Visitor Counter : 93


Read this release in: Tamil , English , Urdu , Marathi