వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్‌) కింద ఆమోదించబడిన ఇంక్యుబేటర్ల ద్వారా 656 స్టార్టప్‌లకు మద్దతు.

Posted On: 23 DEC 2022 3:41PM by PIB Hyderabad
  • స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్‌) 1 ఏప్రిల్ 2021 నుండి రూ. 945 కోట్ల కార్పస్‌తో అమలు చేయబడింది.
  • కాన్సెప్ట్, ప్రోటోటైప్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ ట్రయల్స్, మార్కెట్ ఎంట్రీ మరియు వాణిజ్యీకరణకు స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం.


స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్‌) 2021-22 నుండి 4 సంవత్సరాల కాలానికి ఆమోదించబడింది. కాన్సెప్ట్, ప్రోటోటైప్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ ట్రయల్స్, మార్కెట్ ఎంట్రీ మరియు వాణిజ్యీకరణకు స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. ఇది రూ.945 కోట్లతో కార్పస్‌తో 1 ఏప్రిల్ 2021 నుండి అమలులోకి వస్తుంది.

ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్‌ కింద ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ పథకం అమలు మరియు పర్యవేక్షణకు బాధ్యత వహించే నిపుణుల సలహా కమిటీ (ఈఏసి)ని ఏర్పాటు చేసింది. ఈఏసీ మూల్యాంకనం చేయడంతో పాటు పథకం కింద నిధుల కోసం ఇంక్యుబేటర్లను ఎంపిక చేస్తుంది. ఈ ఇంక్యుబేటర్లు స్కీమ్ మార్గదర్శకాలలో పేర్కొన్న నిర్దిష్ట పారామితుల ఆధారంగా స్టార్టప్‌లను ఎంపిక చేస్తాయి. ప్రస్తుతం 126 ఇంక్యుబేటర్‌లు ఆమోదించబడ్డాయి. ఈ ఇంక్యుబేటర్‌లు 30 నవంబర్ 2022 నాటికి స్కీమ్ కింద 656 స్టార్టప్‌లను ఎంపిక చేశాయి. ఆమోదించబడిన ఇంక్యుబేటర్లు మరియు ఎంచుకున్న స్టార్టప్‌లు సంవత్సరం వారీగా పంపిణీ అనుబంధం-Iలో ఉంచబడింది.

వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ ఈరోజు పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.

అనుబంధం-I

ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్‌( 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమలులోకి వచ్చిన పథకం) కింద 30 నవంబర్ 2022 నాటికి ఆమోదించబడిన ఇంక్యుబేటర్లు మరియు ఆమోదం పొందిన స్టార్టప్‌ల జాబితా క్రింది విధంగా ఉంది:

 

ఆర్థిక సంవత్సరం

ఆమోదించబడిన ఇంక్యుబేటర్ల సంఖ్య

పోర్టల్‌లో ఎంచుకున్న స్టార్టప్‌ల సంఖ్య

2021

80

304

2022
(
నవంబర్30,2022 నాటికి )

46

352

మొత్తము

126

656                                                  

 

***

 


(Release ID: 1886104) Visitor Counter : 178


Read this release in: English , Urdu