శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారం కనుగొనేందుకు ఏర్పాటైన నిర్మాణ్ యాక్సిలేటర్ మొదటి బృందానికి ఎంపిక అయిన 15 అంకుర సంస్థలు
Posted On:
23 DEC 2022 12:07PM by PIB Hyderabad
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ సమస్యలకు సత్వర పరిష్కారం కనుగొనేందుకు తొలిసారిగా ఏర్పాటైన నిర్మాణ్ యాక్సిలేటర్ మొదటి బృందానికి 15 అంకుర సంస్థలు ఎంపిక అయ్యాయి.
ఐఐటీ కాన్పూర్ స్టార్ట్-అప్స్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (SIIC) నిర్మాణ్ యాక్సిలేటర్ కార్యక్రమం ప్రారంభించింది. కార్యక్రమం అమలుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తుంది.నిధి పథకం ద్వారా శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నిర్మాణ్ యాక్సిలేటర్ కార్యక్రమానికి సహకారం అందించి స్వదేశీ ఆవిష్కరణల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. ఐటీ కాన్పూర్ స్టార్ట్-అప్స్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ గతంలో అమలుచేసిన ది వెంటిలేటర్ ప్రాజెక్టు మరియు మిషన్ భారత్ O2 విజయవంతం అయ్యాయి. జాతీయ స్థాయిలో అమలు జరిగిన ఈ రెండు కార్యక్రమాల్లో అమలు చేసిన ఉత్తమ విధానాలు ఆధారంగా నిర్మాణ్ యాక్సిలేటర్ రూపొందింది.
నిర్మాణ్ యాక్సిలేటర్ బృందంలో పని చేయడానికి అంకుర సంస్థలను గుర్తించే ప్రక్రియ 2022 జులై నెలలో ప్రారంభమైంది. కఠినమైన స్క్రీనింగ్ ద్వారా అంకుర సంస్థలు ఎంపిక చేయబడ్డాయి.లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా అంకుర సంస్థలకు వర్క్‌షాప్‌లతో సహా శిక్షణ ఇవ్వబడింది.
అంకుర సంస్థలకు తొలిసారిగా నిర్వహించిన 3-రోజుల రెసిడెన్షియల్ వర్క్‌షాప్ లో నిధుల సమీకరణ, ఆరోగ్య టెక్ మరియు అగ్రిటెక్ స్టార్టప్‌లకు అందుబాటులో ఉన్న అవకాశాలు , ప్రారంభ దశ అంకుర సంస్థలకు ఏంజెల్ మరియు విసి నిధులు, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్,ఐఎస్ఓ , ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ నుంచి పొందాల్సి ఉన్న అనుమతులపై అవగాహన కల్పించారు. బృందాల ఏర్పాటుకు సంబంధించి GrowX, YourNest వంటి విసిలు, DS గ్రూప్ వంటి కార్పొరేట్‌లు మరియు TDB, GeM వంటి ప్రభుత్వ ఏజెన్సీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో అంకుర సంస్థల వ్యవస్థాపకులతో తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు. నిర్మాణ్ యాక్సిలేటర్ బృందం సభ్యులుగా ఎంపిక అయిన అంకుర సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ సంస్థలు, ఏంజెల్ ఇన్వెస్టర్లు మరియు విసి వర్గాలు మరియు ప్రముఖ పరిశ్రమల ప్రముఖులతో చర్చించి వివిధ అంశాలపై అవగాహన పొందారు.
జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు కార్యక్రమం ఉపయోగపడుతుందని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఎన్ఈబి అధిపతి డాక్టర్ అనితా గుప్తా అన్నారు. జాతీయ అంశాలపై దృష్టి సారించడానికి అంకుర సంస్థలకు అవకాశం కలుగుతుందని అన్నారు. దీనిద్వా రా దేశంలో ఆవిష్కరణల రంగం మరింత బలపడుతుందని అన్నారు.
ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ మాట్లాడుతూ, “నిర్మాన్ యాక్సిలరేటర్ ప్రోగ్రాం ప్రోటోటైప్ నుంచి మార్కెట్ వరకు క్లిష్టమైన ప్రాంతాల్లో అత్యాధునిక, సాంకేతికతతో నడిచే ఆవిష్కరణలను అభివృద్ధి చేసే అంకుర సంస్థలు కృషిని వేగవంతం చేస్తుంది.” అని అన్నారు.
భారతీయ హార్డ్‌వేర్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను స్వదేశీ వినూత్న పరిష్కారాల ద్వారా పరిష్కరించడానికి బృందం కృషి చేస్తుంది. యాక్సిలరేటర్ కార్యక్రమం సమర్థవంతమైన పర్యవేక్షణ అందించి మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా అంకుర సంస్థల సమగ్ర అభివృద్ధికి సహకారం అందిస్తుంది. నెల రోజుల శిక్షణ కాలం పూర్తవడంతో అంకుర సంస్థలు స్వదేశీ ఆవిష్కరణల దిశగా తమ కృషి ప్రారంభిస్తాయి. .
సుస్థిర ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలకు భారతదేశం స్వదేశీ పరిష్కార మార్గాల ద్వారా సహకారం అందిస్తుంది.
క్ర.సం |
అంకుర సంస్థ |
1.
|
ఎల్సీబీ ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
2.
|
సప్త కృషి సైంటిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్
|
3.
|
బోమ్‌లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్
|
4.
|
పాలీ సైక్లింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
5.
|
సురోభి అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
|
6.
|
ప్రైమరీ హెల్త్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్
|
7.
|
లేనేక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
|
8.
|
అనా క్రాప్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
9.
|
వాండర్ కాంటినెంటల్ ఫ్లైయర్ ప్రైవేట్ లిమిటెడ్
|
10.
|
క్లైమెక్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్
|
11.
|
ప్రో ప్లాంట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
12.
|
మీక్రాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
|
13.
|
ఎక్స్‌ఫినిటో బయోడిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
14.
|
లైఫ్ అండ్ లింబ్ ప్రైవేట్ లిమిటెడ్
|
15.
|
నాడిపల్స్ ప్రోగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
(Release ID: 1886041)
Visitor Counter : 173