రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారులపై ఫీజు ప్లాజాల అన్ని లైన్లను ఫాస్టాగ్ లైన్లుగా ప్రభుత్వం ప్రకటించింది; ఫీజు ప్లాజా ఎలక్ట్రానిక్ సిస్టం ద్వారా వసూలు చేయబడుతుంది.

Posted On: 22 DEC 2022 1:10PM by PIB Hyderabad

నేషనల్ హైవేస్ ఫీజు (రేట్ల నిర్ధారణ మరియు సేకరణ) నిబంధనలు, 2008 ప్రకారం జాతీయ రహదారులపై ఫీజు ప్లాజాలను ఏర్పాటుచేయడం జరుగుతుంది. నిబంధనల ప్రకారం  ఒక  జాతీయ రహదారి  విభాగం మరియు అదే దిశలో ఒక ప్లాజాకు 60 కిలోమీటర్ల దూరంలో మరో ప్లాజాను ఏర్పాటు చేయకూడదు. ఒక  జాతీయ రహదారి  విభాగం మరియు అదే దిశలో ఒక ప్లాజాకు 60 కిలోమీటర్ల దూరంలో మరో ప్లాజాను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని సంబంధిత అధీకృత అధికారి భావించినప్పుడు దీనికి గల కారణాలను  రాతపూర్వకంగా నమోదు చేసి 60కిలోమీటర్ల దూరంలో మరొక ఫీజు ప్లాజా ను ఏర్పాటు చేయడానికి రాయితీదారునికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.  శాశ్వత వంతెన, బైపాస్ లేదా సొరంగం వినియోగం కోసం ఫీజు వసూలు చేయడానికి మాత్రమే  ఫీజు ప్లాజా మరొక ఫీజు ప్లాజా నుండి60 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయవచ్చు. ఫీజు ప్లాజా ఏర్పాటు కోసం 60 కిలోమీటర్ల దూరం ప్రమాణం నేషనల్ హైవేస్ ఫీజు (రేట్లు మరియు సేకరణ) నిబంధనలు, 2008 తర్వాత అమలులోకి వచ్చింది.  మునుపటి జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు, 1997 లో ఇలాంటి ప్రమాణాలు లేవు.

జాతీయ రహదారి 66 పై హేమజాడి, సూరత్కల్ వద్ద 10.86 కిలోమీటర్ల పరిధిలో రెండు ఫీజు ప్లాజాలు ఉన్నాయి. సురత్కల్ ఫీజు ప్లాజా దాని ప్రభావ పొడవును హేమ్జాడి ఫీజు ప్లాజాతో విలీనం చేయడం ద్వారా మూసివేయబడింది.60 కిలోమీటర్ల దూరం ప్రమాణాల కారణంగా కర్ణాటక రాష్ట్రంలో మరే ఇతర ఫీజు ప్లాజా మూసి వేయబడలేదు. అరవై కిలోమీటర్ల పరిధిలో పనిచేసే ఫీజు ప్లాజాలు జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ణయం మరియు సేకరణ) నిబంధనలు, 2008 మరియు వర్తించే జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు, 1997 ప్రకారం ఏర్పాటు చేయబడతాయి.

2021 ఫిబ్రవరి 15/16 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చేలా జాతీయ రహదారులపై ఫీజు ప్లాజా అన్ని లైన్లను ఫీజు ప్లాజా ఫాస్టాగ్ లైన్ గా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం, జాతీయ రహదారులపై ఫీజు ప్లాజాల వద్ద  ఎక్కువ భాగం ఎలక్ట్రానిక్ ఫీజు కలెక్షన్ వ్యవస్థ ద్వారా ఫీజులు వసూలు చేయడం జరుగుతోంది. దాదాపు 97% ఫీజులు  ఎలక్ట్రానిక్ ఫీజు రూపంలో వసూలు అవుతున్నాయి. ఫీజు ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ ఫీజు సేకరణ ద్వారా జరుగుతున్న యూజర్ ఫీజు వివరాలు ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసిఎల్) వెబ్సైట్ ద్వారా పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్నాయి. 

 

ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు

***


(Release ID: 1885989) Visitor Counter : 86
Read this release in: English , Urdu , Tamil