నౌకారవాణా మంత్రిత్వ శాఖ

సాగరమాల కింద ఇప్పటిదాకా మంజూరైన 151 ప్రాజెక్టులకు ఆర్థిక సహాయంగా దాదాపు రూ.1891 కోట్లు విడుదల

Posted On: 20 DEC 2022 3:42PM by PIB Hyderabad

భారతదేశంలోని ప్రధాన రేవుల సంఖ్య 12 కాగా, అప్రధాన రేవుల సంఖ్య 217. అప్రధాన రేవులలో 68 సరకుల రవాణా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇక అన్ని ప్రధాన రేవులు కార్యకలాపాలు సాగిస్తుండగా, అప్రధాన రేవులన్నీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పాలన నియంత్రణలో ఉన్నాయి. అలాగే రాష్ట్రాల్లోని ప్రైవేట్ రేవులను అక్కడి సముద్ర సంబంధ సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. సంబంధిత రాష్ట్రాల నుంచి అందిన సమాచారం ప్రకారం- ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నడుస్తున్న అప్రధాన రేవుల జాబితాను అనుబంధం-1లో చూడవచ్చు.

సాగరమాల పథకం కింద ఈ కార్యక్రమ లక్ష్యంతో ముడిపడిన ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాన/అప్రధాన రేవులు/రాష్ట్ర సముద్ర సంబంధ సంస్థలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఓడరేవులు-షిప్పింగ్-జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయం అందజేసింది. కాగా, సాగరమాల పథకం కింద మంత్రిత్వ శాఖ ఇప్పటిదాకా మంజూరు చేసిన 151 ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.1891 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద నష్టభయం భర్తీ నిధులు ఇవ్వడం లేదు. ఈ మేరకు సాగరమాల పథకం కింద కేరళ రాష్ట్రానికి మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేసిన ప్రాజెక్టుల జాబితాను అనుబంధం-2లో చూడవచ్చు.

అనుబంధం-1

వ.సంఖ్య

రాష్ట్రంలో ప్రైవేటు నిర్వహణలోగల రేవు

రేవును నడిపే కంపెనీ పేరు

రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్‌

1.

కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌

మెస్సర్స్‌ కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌

2.

గంగవరం పోర్ట్‌

మెస్సర్స్‌ గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌

3.

కృష్ణపట్నం పోర్ట్‌

మెస్సర్స్‌ అదాని కృష్ణపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌

రాష్ట్రం: గుజరాత్‌

1.

పిపావ్‌ పోర్ట్‌

మెస్సర్స్‌ గుజరాత్‌ పోర్ట్‌ పిపావ్‌ లిమిటెడ్‌

2.

ముద్రా పోర్ట్‌

మెస్సర్స్‌ అదాని పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌

3.

దహేజ్‌ పోర్ట్‌

మెస్సర్స్‌ గుజరాత్‌ కెమికల్‌ పోర్ట్‌ లిమిటెడ్‌

మెస్సర్స్‌ పెట్రోనెల్‌ ఎల్‌.ఎన్‌.జి. లిమిటెడ్‌

మెస్సర్స్‌ అదాని పెట్రోనెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

 

4.

హజారియా పోర్ట్‌

మెస్సర్స్‌ హజారియా పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

మెస్సర్స్‌ అదాని హజారియా పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

 

రాష్ట్రం: ఒడిషా

1.

గోపాల్‌పూర్‌ పోర్ట్‌

మెస్సర్స్‌ గోపాల్‌ పోర్ట్స్‌ లిమిటెడ్‌

2.

ధమారా పోర్ట్‌

మెస్సర్స్‌ ధమారా పోర్ట్ కంపెనీ లిమిటెడ్‌

రాష్ట్రం: తమిళనాడు

1

కాటుపల్లి పోర్ట్‌

మెరైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

2

ఎన్నూర్‌ మైనర్‌ పోర్ట్‌

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌

3

కడలూర్‌ పోర్ట్‌లోని మెరైన్‌ టెర్మినల్‌

కెమ్‌ప్లాస్ట్‌ కడలూర్‌ వినైల్స్‌ లిమిటెడ్‌

4

తిరుక్కడైయూర్‌ పోర్ట్‌

పీపీఎన్‌ పవర్‌ జెనరేటింగ్‌ కంపెనీ లిమిటెడ్‌

5

నాగపట్టినం పోర్టులో ఆయిల్‌ జెట్టీ

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌

6

కూడన్‌కుళం

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌

రాష్ట్రం: మహారాష్ట్ర

1.

దహను

అదాని ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌

2.

ఉల్వా-బేలాపూర్‌

అంబుజా సిమెంట్స్‌ లిమిటెడ్‌

3.

ధరమ్‌తార్‌ (పోర్ట్‌ పరిధి)

జేఎస్‌డబ్ల్యూ ధరమ్‌తార్‌ పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

4.

ధరమ్‌తార్‌

పీఎన్‌పీ మారిటైమ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

5.

కరంజా

కరంజా టెర్మినల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

6.

రెవదండా

జేఎస్‌డబ్ల్యూ సలావ్‌ స్టీల్‌ లిమిటెడ్‌

7.

రెవదండా

ఇండో ఎనర్జీ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌

8.

దిఘి-రాజ్‌పురి

దిఘి పోర్ట్‌ లిమిటెడ్‌

9.

బాణ్‌కోట్‌

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

10.

జైగాడ్‌ (సాండీ లవగన్‌)

ఆంగ్రీ పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

11.

జైగాడ్‌ (ధమన్‌కోల్‌ బే)

జేఎస్‌డబ్ల్యూ జైగఢ్‌ లిమిటెడ్‌

12.

రత్నగిరి (పవాస్‌ బే)

ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌

13.

ధబోల్‌

కొంకణ్‌ ఎల్‌ఎన్‌జి లిమిటెడ్‌

14.

రత్నగిరి (భగవతి బందర్‌)

అల్ట్రా టెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌

15.

రెడి

రెడి పోర్ట్‌ లిమిటెడ్‌

అనుబంధం-2

రాష్ట్రం: కేరళ

వ.

సం.

ప్రాజెక్టు పేరు

అమలు సంస్థ

ప్రాజెక్టు విలువ (రూ.కోట్లలో)

మంజూరైన నిధులు (కోట్లలో)

విడుదలైన నిధులు (రూ.కోట్లలో)

1

కోస్తా జిల్లాల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ఫేజ్‌-2.. కేరళ

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ (డీడీయూ-జీకేవై)

4.80

4.80

1.60

2

రసాయనాల నిర్వహణ కోసం కొచ్చిన్‌ రేవులో దక్షిణ బొగ్గు బెర్త్‌ పునర్నిర్మాణం

కొచ్చిన్‌ పోర్ట్‌ ట్రస్ట్‌

19.19

8.85

7.97

3

‘సీవోపీటీ’ వద్ద కోస్టల్‌ లిక్విడ్‌ టెర్మినల్‌-సీవోటీ, ఎన్‌బీటీ నవీకరణ-సామర్థ్యం పెంపు

కొచ్చిన్‌ పోర్ట్‌ ట్రస్ట్‌

20.00

14.96

14.45

4

కొళ్లంలో బహుళ ప్రయోజన తీరప్రాంత బెర్త్‌ నిర్మాణం

కేరళ మారిటైమ్‌ బోర్డ్‌

19.00

7.24

6.52

5

కేరళలోని కన్నూర్‌ జిల్లా తాలైలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం

హార్బర్‌ ఇంజనీరింగ్‌ విభాగం, కేరళ

35.00

6.90

6.90

6

కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా చెత్తువాలో మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం

హార్బర్‌ ఇంజనీరింగ్‌ విభాగం, కేరళ

30.00

4.68

4.68

7

కొచ్చిన్‌ రేవులో ఫిషరీస్‌ హార్బర్‌

కొచ్చిన్‌ పోర్ట్‌ ట్రస్ట్‌

101.02

50.00

25.00

8

కొచ్చిన్‌ రేవులో ప్రోపిలిన్‌, ఇతర సరకు రవాణా నిర్వహణ కోసం 'రో-రో’ సౌకర్యాల అభివృద్ధి

కొచ్చిన్‌ పోర్ట్‌ ట్రస్ట్‌

10.56

10.56

5.28

9

‘సీవోపీటీ’వద్ద ఆన్‌షోర్‌ పవర్‌ సప్లై డెవలప్‌ మెంట్‌

కొచ్చిన్‌ పోర్ట్‌ ట్రస్ట్‌

22.344

22.344

0.00

             

 

కేంద్ర ఓడరేవులు-షిప్పింగ్-జలమార్గాల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం తెలిపారు.

 

*****



(Release ID: 1885308) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Marathi