గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జిల్లా మినరల్ ఫౌండేషన్ కింద వివిధ రాష్ట్రాల ద్వారా సేకరించిన నిధుల వివరాలు

Posted On: 19 DEC 2022 3:31PM by PIB Hyderabad

ఎం.ఎం.డి.ఆర్. చట్టంలోని సెక్షన్ 20-ఏ కింద ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన (పి.ఎం.కె.కె.కె.వై) అమలు కోసం జిల్లా మినరల్ ఫౌండేషన్‌ (డి.ఎం.ఎఫ్) ల ద్వారా మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులు / కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం, 2015 సెప్టెంబర్, 16వ తేదీన ఆదేశాలు జారీ చేసి, మార్గదర్శకాలను పంపిణీ చేసింది.   దీంతో పాటు, రాష్ట్రంలోని జిల్లా మినరల్ ఫౌండేషన్ ల ఏర్పాటును, పనిని నియంత్రించేందుకు వీలుగా విధి విధానాలు రూపొందించడానికి ఎం.ఎం.డి.ఆర్. చట్టంలోని 9-బి సెక్షన్ మరియు 15(4) సెక్షన్, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తుంది. 

 

 

మార్గదర్శకాల ప్రకారం, పి.ఎం.కె.కె.కె.వై. పథకం కిందకు వచ్చే ప్రభావిత ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించడం కోసం డి.ఎం.ఎఫ్. లకు సూచనలు జారీ చేయడం జరిగింది.  కనీసం 60 శాతం నిధులను అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు, 40 శాతం వరకు నిధులను ఇతర ప్రాధాన్యతా కార్యకలాపాలకు ఖర్చు చేయాలి.  సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన డి.ఎం.ఎఫ్. నిబంధనల ప్రకారం, ఈ నిధులను  ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించడానికి డి.ఎం.ఎఫ్. నిధుల వార్షిక ఆడిట్‌ నిర్వహించాలని కూడా మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.  అదేవిధంగా, పి.ఎం.కె.కె.కె.వై. మార్గదర్శకాల ప్రకారం, ప్రతి ఏటా, ఆర్థిక సంవత్సరం ముగిసే తేదీ నుంచి మూడు నెలలలోపు, సంబంధిత ఆర్థిక సంవత్సరంలో తన కార్యకలాపాలపై డి.ఎం.ఎఫ్. వార్షిక నివేదికను సిద్ధం చేసి, రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి.

 

 

2022-23 ఆర్థిక సంవత్సరం వరకు డి.ఎం.ఎఫ్. కింద సేకరించిన మొత్తం వివరాలు

 

 

సేకరించిన మొత్తం కోట్ల రూపాయలలో... 

 

 

క్రమ సంఖ్య 

రాష్ట్రాలు 

2019 మార్చి వరకు 

2019-20

ఆర్ధిక 

సంవత్సరం 

2020-21

ఆర్ధిక 

సంవత్సరం

2021-22

ఆర్ధిక 

సంవత్సరం

2022-23

ఆర్ధిక 

సంవత్సరం

1

ఆంధ్రప్రదేశ్ 

697.85

254.98

263.86

278.55

12.17

2

చత్తీస్ గఢ్ 

3913.22

1374.55

1456.18

2199.52

1058.09

3

గోవా 

187.44

4.30

27.49

6.70

0.00

4

గుజరాత్ 

535.45

164.99

192.01

230.57

114.80

5

ఝార్ఖండ్ 

4002.16

1492.51

1038.38

1768.32

2381.63

6

కర్ణాటక 

1435.80

492.36

556.80

825.15

321.22

7

మహారాష్ట్ర 

1251.83

606.38

517.46

648.64

763.12

8

మధ్యప్రదేశ్ 

2243.07

795.69

821.22

1009.86

591.76

9

ఒడిశా 

6905.49

3079.28

2528.59

5393.97

2487.78

10

రాజస్థాన్ 

2685.63

1050.42

1055.75

1320.00

1115.14

11

తమిళనాడు 

448.21

195.05

153.42

174.27

111.15

12

తెలంగాణ 

2422.89

389.07

209.84

314.45

46.95

13

అస్సాం 

66.44

16.35

6.03

5.67

9.19

14

బీహార్ 

50.88

24.23

16.27

9.10

7.55

15

హిమాచల్ ప్రదేశ్ 

111.07

38.11

40.97

45.83

26.49

16

జమ్మూ-కశ్మీర్ 

25.31

6.52

2.81

8.96

4.49

17

కేరళ 

14.16

9.45

10.83

4.94

5.72

18

మేఘాలయ 

33.80

16.55

16.20

6.40

3.41

19

ఉత్తరాఖండ్ 

45.79

42.09

68.92

84.38

57.05

20

ఉత్తర ప్రదేశ్ 

427.34

256.35

225.30

247.27

98.87

21

పశ్చిమ బెంగాల్ 

26.16

22.00

18.61

21.42

26.53

22

పంజాబ్ 

0.00

0.00

31.76

101.53

17.66

23

హర్యానా 

0.00

0.00

0.00

42.51

0.00

 

మొత్తం 

27529.99

10331.22

9258.71

14748.00

9260.79

 

 

బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, ఈ రోజు రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

 

 

*****



(Release ID: 1885006) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Tamil