నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కర్బన ఉద్గారాల నివారణ కోసం గ్రీన్ షిప్పింగ్

నాడు పోస్టు చేయడమైనది: 16 DEC 2022 3:37PM by PIB Hyderabad

 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్‌  (NCoEGPS)ని నెలకొల్పాలని  ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించింది. రేవులు, నౌక రంగంలో గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి  దోహదపడే సాంకేతిక అంశాలు,ప్రత్యామ్నాయ ఇంధనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుంది.  గ్రీన్ హౌస్ వాయువుల విడుదల అంశంలో   రేవులు, నౌక రంగాలకు కేంద్రం లక్ష్యాలు నిర్ణయిస్తుంది. గ్రీన్ షిప్పింగ్ రంగానికి అవసరమైన చట్టపరమైన వ్యవస్థను కేంద్రం అభివృద్ధి చేస్తుంది.  గ్రీన్ షిప్పింగ్‌పై పరిశోధన మరియు సహకారం అందించి ఉత్తమమైన విధానాన్ని రూపొందించడంలో కేంద్రం సహకారం అందిస్తుంది. దేశంలో అన్ని రేవులు, షిప్పింగ్ సంస్థలు, తీరప్రాంతం కలిగిన రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, సమస్య పరిష్కారానికి అమలు చేయాల్సిన చర్యలపై పరిశోధన చేపట్టి మార్గదర్శకాలు అందిస్తుంది.
  నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్‌ ఈ కింది అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది:
i. విధానం, నియంత్రణ మరియు పరిశోధన
ii. మానవ వనరుల అభివృద్ధి
iii. నెట్‌వర్క్ వ్యవస్థ - కీలక భాగస్వాములు మరియు వ్యూహాత్మక సహకారం
iv. పరిశోధన - పని, ఫలితాలు, ప్రాజెక్ట్‌లు మరియు వనరుల ప్రాంతం
v. నిర్వహణ - గత కార్యక్రమాలు ,భవిష్యత్తు కార్యక్రమాలు, ప్రచారం
గ్రీన్ పోర్టులు, షిప్పింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా   నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్‌ నెలకొల్పింది. దీనికి సంబంధించి 2022 నవంబర్ 18న కేంద్ర  ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ , దీనదయాళ్ పోర్ట్ అథారిటీ, కాండ్లా, పారాదీప్ పోర్ట్ అథారిటీ, పారదీప్; వి.ఓ.  చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, తూత్తుకుడి; కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, కొచ్చి  ది ఎనర్జీ అండ్  రిసోర్స్ ఇన్స్టిట్యూట్ (TERI) ల మధ్య అవగాహన కుదిరింది.
  నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్‌ వివరాలు:
• భారతదేశంలోని షిప్పింగ్ రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం, మరియు సర్క్యులర్ ఎకానమీ (CE)ని ప్రోత్సహించడానికి గ్రీన్ షిప్పింగ్ కోసం నియంత్రణ వ్యవస్థ, తాజా సాంకేతిక అంశాలు, సాంకేతిక అంశాల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక  అభివృద్ధి చేయడానికి అవసరమైన విధానం, నియంత్రణ వ్యవస్థను   నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్‌ రూపొందిస్తుంది.
• నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్‌ భాగస్వామ్య సంస్థగా 'ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్' (TERI) వ్యవహరిస్తుంది.
నార్వే ప్రభుత్వం నిధులు సమకూర్చిన నిధులతో ఏర్పాటైన ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ గ్రీన్ వాయేజ్ 2050 లో ప్రధాన దేశంగా భారతదేశం ఎంపికయ్యింది. నౌకల నుంచి విడుదల అయ్యే  గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్ని తగ్గించడానికి సంస్థ సూచనలు, సలహాలు అందిస్తుంది. గ్రీన్ షిప్పింగ్ ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా భారతదేశంలో అమలు చేయాలని ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ గ్రీన్ వాయేజ్ 2050 నిర్ణయించింది. ప్రాజెక్టులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పర్యవేక్షిస్తుంది.గ్రీన్ వాయేజ్ 2050 కింద అమలు చేయడానికి 5 ప్రాజెక్టులను ప్రభుత్వం గుర్తించింది. దీనిలో భాగంగా ప్రయాణీకుల ఫెర్రీల సేకరణ కోసం  అస్సాం ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ (AIWTDS)  ఎంపిక చేయబడింది. ఫెర్రీల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి సంబంధించిన అంశాలను ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్   గ్రీన్ వాయేజ్,  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిపుణుల బృందం అభివృద్ధి చేసింది. ఫెర్రీలు ఉపయోగించే ప్రత్యామ్నాయ ఇంధనం, అస్సాంలో ఇంధనం లభ్యత మరియు సరఫరాతో పాటు  భారతదేశంలో ప్రత్యామ్నాయ  ఇంధన వినియోగం కోసం గల అవకాశాలు పరిశీలించడానికి ప్రపంచ బ్యాంకు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ,  అస్సాం ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రతినిధులు సభ్యులుగా ఓకే వర్కింగ్ బృందం ఏర్పాటయింది.  
నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్‌ కార్యకలాపాలను ది ఎనర్జీ అండ్  రిసోర్స్ ఇన్స్టిట్యూట్ పర్యవేక్షించి అమలు చేస్తుంది. షిప్పింగ్, నౌకల రంగానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని సంస్థ అందజేస్తుంది. శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్గాలు సూచిస్తుంది. దీంతో పాటు విద్య, పరిశోధన, సాంకేత అంశాల మార్పిడి ఫై కూడా సంస్థ సహకారం అందిస్తుంది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించే  సంస్థ ఈ క్రింది అంశాలపై దృష్టి సారించి పనిచేస్తుంది.
           i.  ఇంధన వినియోగం  - ఇంధన వినియోగ పరికరాలు, వ్యర్థాల నిర్వహణ, పునర్ వినియోగం
          ii.   ఉద్గార నిర్వహణ- ప్రత్యామ్నాయ, స్వచ్ఛమైన శక్తి/ఇంధనం, ఉద్గార నియంత్రణ , పర్యవేక్షణ.
         iii.   స్థిరమైన సముద్ర కార్యకలాపాలు - నవల సాంకేతికతలు మరియు విధానాలు
ఇతర చర్యలు:

 i.   శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి మరియు నౌకల నిర్వహణ కోసం  పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సాహించడం. దీనికోసం  స్థిరమైన జీవ ఇంధనాలు మరియు దాని మిశ్రమాలను భారతీయ నౌకలు ఇంధనాలుగా ఉపయోగించడానికి అనుమతించింది.

 ii. ఉద్గారాల తగ్గింపు లక్ష్యంతో సముద్ర రంగం కోసం డిజిటలైజేషన్ ప్రయత్నాల్లో భాగంగా, భారతీయ తీరంలో పనిచేసే నౌకల కోసం సముద్ర పర్యావరణ నిర్వహణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించబడింది.  నౌకలు ఇంధన చమురు వినియోగం, బ్యాలస్ట్ వాటర్ ఎక్స్ఛేంజ్ మరియు ఓడలో ఉత్పత్తయ్యే సముద్ర వ్యర్థాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లు మొదలైన వాటితో సహా అన్ని కాలుష్య సంబంధిత సమాచారాన్ని సరళమైన, పేపర్‌లెస్ ఆన్‌లైన్ రిపోర్టింగ్‌ను సౌకర్యాన్ని డిజిటల్ పోర్టల్ కలిగి ఉంటుంది.

 iii.నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక  మారిటైమ్ ఇండియా విజన్ 2030 పత్రాన్ని ప్రచురించింది.
ఈ సమాచారాన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు  లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

***


(రిలీజ్ ఐడి: 1884280) సందర్శకుల సూచీ సంఖ్య : : 145
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu