నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఓడ‌రేవుల శాస్త్రీయ అధ్య‌య‌నం

నాడు పోస్టు చేయడమైనది: 16 DEC 2022 3:40PM by PIB Hyderabad

 నౌకాశ్ర‌యాలు, ఓడ‌రేవుల అభివృద్ధిలో అడ్డుక‌ట్ట‌లు, రేవు క‌ట్ట‌లు, క‌ట్ట‌ల పున‌రుద్ధ‌ర‌ణ త‌దిత‌ర నిర్మాణాల‌తో పాటుగా నైక‌ల‌గ‌మ‌న లోతుల‌ను నిర్వ‌హించేందుకు పూడిక‌లు తీయ‌డం వంటివి ఉండ‌వ‌చ్చు. ఈ ప్రాజెక్టులు నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌ర్తించే ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వులు & ప‌ర్యావ‌ర‌ణ మార్పు మంత్రిత్వ శాఖ (ఎంఒఇఎఫ్‌&సిసి) లేదా రాష్ట్ర కోస్తాతీర జోన్ నిర్వ‌హ‌ణ ప్రాథికార సంస్థ (సిజెడ్ ఎంఎ) ర్యావ‌ర‌ణ‌/  తీర ప్రాంత క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ జోన్ (సిఆర్‌జెడ్‌) అనుమ‌తులు పొందవ‌ల‌సి ఉంటుంది. ఎంఒఇఎఫ్‌&సిసి, సిజెడ్ఎంఎ నిర్దేశాల ప్ర‌కారం ప్రాజెక్టుల అభివృద్ధిలో భాగంగా ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌భావ అంచ‌నా (ఇఐఎ), ప‌ర్యావ‌ర‌ణ నిర్వ‌హ‌ణ ప్ర‌ణాళిక (ఇఎంపి)ల అధ్య‌య‌నాలు చేప‌ట్ట‌వ‌ల‌సి ఉంటుంది. ప్రాజెక్టుల కోసం చేసిన అధ్య‌య‌నాల ఆధారంగా, ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించ‌డానికి అవ‌స‌ర‌మైన ఉప‌శ‌మ‌న చ‌ర్య‌ల‌ను చేప‌డ‌తారు. 
అన్ని ప్ర‌ధాన ఓడ‌రేవులు ఓడ‌రేవులు, షిప్పింగ్‌& జ‌ల‌మార్గాల మంత్రిత్వ శాఖ పాల‌నా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. 
ఓడ‌రేవుల మౌలిక స‌దుపాయాల నిర్మాణం అన్న‌ది వివిధ శాస్త్రీయ అధ్య‌య‌నాలు - ట్రాంక్విలిటీ స్ట‌డీస్ (స్థిర‌త అధ్య‌య‌నాలు), స్ట‌డీ ఆఫ్ సిల్టేష‌న్ (ఓండ్రుమ‌ట్టి క‌ద‌లిక  పై అధ్య‌య‌నాలు), స్ట‌డీ ఆన్ కోస్ట‌ల్ ఎరోజ‌న్ (తీర‌ప్రాంత కోత పై అధ్య‌య‌నం), లిట్ట‌రొల్ డ్రిఫ్ట్ (చెత్త క‌దులుతున్న గ‌తి), గ‌ణిత న‌మూనా అధ్య‌య‌నాలు, ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌భావ అధ్య‌య‌నం త‌దిత‌ర అధ్య‌య‌నాలు చేసిన త‌ర్వాత‌, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన అనుమ‌తులు పొందిన త‌ర్వాత అంటే ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు & తీర‌క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ జోన్ అనుమ‌తులు పొందిన త‌ర్వాత జ‌రుగుతాయి.  
రేవుల స్థిర‌మైన అభివృద్ధిని ఖ‌రారు చేసేందుకు మారిటైం ఇండియా విజ‌న్ (ఎంఐవి) 2030ను విడుద‌ల చేశారు. ఇది స్థిర‌మైన ప‌ద్ధ‌తుల‌న‌ను అవ‌లంబించ‌డం ద్వారా ప‌ర్యావ‌ర‌ణ‌ను ప‌రిర‌క్షణ‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఉంటూ రేవుల‌ను అభివృద్ధి చేయ‌డాన్ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ప్ర‌ధాన పోర్టుల‌కు పూడిక తీత మార్గ‌ద‌ర్శ‌నాల‌ను మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసింది. ఇది పూడిక తీత ప్రాజెక్టుల‌ను వాంఛ‌నీయ విధంగా వ‌న‌రుల‌ను వినియోగిస్తూ, దేశంలోని రేవుల స్థిర‌మైన అభివృద్ధికి పూడిక తీసిన సామాగ్రిని పున‌రుప‌యోగించ‌డాన్ని అమ‌లు చేయ‌డానికి హామీ ఇస్తుంది. 
ఈ స‌మాచారాన్ని కేంద్ర ఓడ‌రేవులు, షిప్పింగ్‌, జ‌ల‌మార్గాల మంత్రి శ్రీ‌స‌ర్బానంద సోనోవాల్ లోక్‌స‌భ‌కు స‌మ‌ర్పించిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో ఇచ్చారు. 


***


(రిలీజ్ ఐడి: 1884278) సందర్శకుల సూచీ సంఖ్య : : 150
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu