పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
కాప్ 27 మరియు వాతావరణ న్యాయానికి భరోసా
Posted On:
15 DEC 2022 2:58PM by PIB Hyderabad
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (UNFCCC), క్యోటో ప్రోటోకాల్ మరియు పారిస్ ఒప్పందంలలో భారతదేశం ఒక పక్షం. పారిస్ ఒప్పందం ప్రకారం, ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక అభివృద్ధి పూర్వ స్థాయిల కంటే 2° సి తక్కువగా ఉంచడం మరియు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5° సి కి పరిమితం చేసే ప్రయత్నాలను కొనసాగించడం అనే దీర్ఘకాలిక ఉష్ణోగ్రత లక్ష్యం అంగీకరించబడింది. పారిస్ ఒప్పందాన్ని ఆమోదించే దేశాల ద్వారా. ఈ సంవత్సరం విడుదలైన యూ ఎన్ ఎఫ్ సీ సీ (UNFCCC) సెక్రటేరియట్ యొక్క జాతీయంగా నిర్ణయించబడిన సహకారాల (NDCలు) సంశ్లేషణ నివేదిక ప్రకారం, అన్ని దేశాలు ప్రస్తుత కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తే, ఇప్పటికీ దీర్ఘకాలిక ఉష్ణోగ్రత లక్ష్యం 2° సి కంటే ఎక్కువగానే ఉంటుంది. పారిస్ ఒప్పందం ఉష్ణోగ్రత లక్ష్యాల సాధన అనేది యూ ఎన్ ఎఫ్ సీ సీ (UNFCCC) యొక్క ఆర్టికల్ 3.1 మరియు పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 4.4 ప్రకారం, మరియు 2020కి ముందు వారి ఉపశమన బాధ్యతలు మరియు నిబద్దత లో వారి లోటును అధిగమించడం, తగ్గించడంలో వాతావరణ ఆర్థిక సహకారం, టెక్నాలజీ బదిలీ మరియు సామర్థ్య శిక్షణ ఏర్పాటు వంటి కీలక అంశాలు ముందంజలో ఉన్న అభివృద్ధి చెందిన దేశాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుత ఉష్ణోగ్రత పెరుగుదలకు భారతదేశం తరపున మనకు కనీస బాధ్యత ఉన్నప్పటికీ, సంబంధిత సామర్థ్యాలలో న్యాయ సమానత్వం మరియు సూత్రం ఆధారంగా సాధారణమైన బాధ్యతలతో పాటు భిన్నమైన బాధ్యతలు మరియు మెరుగైన పర్యావరణ ఆశయం కోసం ప్రతి ప్రయత్నం చేపట్టబడుతుంది. వీటిలో భారతదేశం యొక్క వర్తమాన ఎన్ డీ సీ లు మరియు మరియు 2070 నాటికి నికర-సున్నా హామీ ప్రకటన కనుగుణంగా విస్తృత శ్రేణి కార్యక్రమాలు, ప్రణాళికలు మరియు పథకాలతో దేశీయ వాతావరణ చర్యలో అద్భుతమైన ప్రయత్నాలు ఉన్నాయి.
ఇటీవల ముగిసిన యూ ఎన్ ఎఫ్ సీ సీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP 27) యొక్క 27వ సెషన్‌ను 'అమలు కాప్'గా పేర్కొన్నారు. కాప్ 27 ప్రధాన ఫలితాలు నష్టాలు, నష్టం నిధిని ఏర్పాటు చేయడం మరియు తగ్గించడం కోసం కార్యక్రమాలు, వ్యవసాయంలో పరివర్తన మరియు వాతావరణ చర్యలపై నిర్ణయం తీసుకోవడం తో పాటు ఇతర విషయాలను చర్చించింది.
భారతదేశం న్యాయం ధర్మం ఆధారం గా ప్రధాన స్రవంతి జాతీయ పరిస్థితులు మరియు వ్యవసాయంలో అనుసరణకు సంబంధించిన జాగరూకత , నికర సున్నా మరియు ఉద్గార తగ్గింపు లక్ష్యాలపై ఏదైనా నిర్దిష్ట ఫలితాలను అనుసరించేటప్పుడు న్యాయబద్ద ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచ కార్బన్ బడ్జెట్‌లోని న్యాయమైన వాటా కు మద్దతు ఇవ్వడం నష్టానికి నిధుల ఏర్పాట్లపై దృష్టి పెట్టడం వంటివి ఉన్నాయి. 'షర్మ్ ఎల్-షేక్ అమలు ప్రణాళిక' పేరుతో తీసుకున్న నిర్ణయంలో స్థిరమైన ఉత్పత్తి మరియు వినియోగం యొక్క స్థిరమైన నమూనాలతో పాటు స్థిరమైన జీవనశైలికి పరివర్తన యొక్క ఆవశ్యకతను చేర్చడానికి భారతదేశం యొక్క ప్రయత్నాలతోనే సాధ్యమయ్యింది. కాప్ 27 లో భారతదేశం యొక్క చర్చలు న్యాయ సూత్రబద్ద పునాది అధారంగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ శాస్త్రంపై ఆధారపడి అభివృద్ధి చెందిన దేశాల దృష్టిని వారి నెరవేర్చని ప్రమాణాలు పైకి ఆకర్షించడానికి ప్రయత్నం చేశాయి. ప్రపంచ జనాభాలో 80% కంటే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న జీ 77+చైనా న్యాయమైన మరియు సమానమైన ఫలితాలను అందించడానికి ఏకమైంది. కాప్ 26 మరియు కాప్ 27లో, వాతావరణ ఆర్థిక సహకారం లో అభివృద్ధి దేశాలు తమ హామీలు నెరవేర్చడంలో విఫలమైనందుకు అత్యంత విచారం మరియు ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేసిన నిర్ణయాలకు భారతదేశం సహకరించింది
జీ 77+చైనా సభ్యులు, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారతదేశం మరియు చైనా (బేసిక్) సంకీర్ణం మరియు భావ సారూప్య దేశాల కూటమి యొక్క సహకార ప్రయత్నం నష్టం, న్యాయం, ఆర్థిక సహకారం, అనుసరణ మరియు ఇతర సమస్యలపై సానుకూల ఫలితాలకు దారితీసింది. మూడు సంకీర్ణాల్లోనూ భారత్ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల చారిత్రక బాధ్యత యొక్క ప్రాముఖ్యత, న్యాయ సూత్ర ప్రాముఖ్యత, ఉమ్మడి కానీ విభిన్నమైన బాధ్యతలు మరియు సంబంధిత సామర్థ్యాలు, న్యాయమైన అభివృద్ధి చెందుతున్న దేశాల వారి హక్కులను నిర్ధారించడం ద్వారా సమానత్వం, వాతావరణ న్యాయం యొక్క సూత్రాల కార్యాచరణను భారతదేశం ప్రపంచ కార్బన్ బడ్జెట్‌లో సమానమైన వాటా ఈ సంకీర్ణ దేశాల ముందుకు నిలకడగా తెచ్చింది. భారతదేశం యొక్క ప్రయత్నాల ఫలితంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు సంయుక్త వినతులు, మంత్రివర్గంతో సహా వివిధ స్థాయిలలో ఇతర ఉమ్మడి ప్రకటనలు మరియు తీర్మానాలు రూపంలో ఈ సమస్యలను వివిధ మార్గాల్లో యూ ఎన్ ఎఫ్ సీ సీ కి ముందుకు తెచ్చాయి.
పర్యావరణం, అటవీ మరియూ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1883967)
Visitor Counter : 293