పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
5-జి అటవీ సంస్కరణ
Posted On:
15 DEC 2022 2:58PM by PIB Hyderabad
అడవుల పరిరక్షణ, పెంపు, జీవనోపాధి కోసం అటవీ మంత్రిత్వశాఖ అనేక సంస్కరణలు/చొరవలు తీసుకుంది. అవి ఇలా ఉన్నాయి:
కలప ఆధారిత పరిశ్రమలు ( ఏర్పాటు, నియంత్రణ) మార్గదర్శకాలు, 2016 ను, 2017 సెప్టెంబర్ 11 నాటి సవరణలను మంత్రిత్వశాఖ విడుదల చేసింది. దీని ద్వారా కలప ఆధారిత పరిశ్రమల నియంత్రణ ప్రక్రియను వికేంద్రీకరించటం తద్వారా దేశంలో ఈ రంగాన్ని అభివృద్ధి చేయటం సాధ్యమవుతుంది.
ఆటవీయేతర ప్రాంతాలలో వెదురు సాగును ప్రోత్సహించటం ద్వారా అడవుల వెలుపల పచ్చదనం పెంచటంతోబాటు రైతుల ఆదాయమార్గం పెంచటం లక్ష్యంగా మంత్రిత్వశాఖ భారత అటవీ చట్టం, 1927 ను సవరించింది. చెట్లు అనే నిర్వచనం నుంచి వెదురును మినహాయించటం ద్వారా ఆర్థిక ఆవసరాలకోసం దాని రవాణాకు పర్మిట్ అవసరం లేకుండా చేసింది.
కలప, వెదురు, ఇతర అటవీ ఉత్పత్తులు నిరాటంకంగా రవాణా అయ్యేలా మంత్రిత్వశాఖ జాతీయ రవాణా పాస్ విధానాన్ని పైలట్ ప్రాతిపదికన ఆన్ లైన్ పద్ధతిలో పాస్ లు జారీ చేయటం మొదలుపెట్టింది. ఈ విధానం వలన కలప రవాణాను పర్యవేక్షించటంతోబాటు కలప కదలికలను నమోదు చేయవచ్చు. అటవీ ఉత్పత్తులతోబాటు ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో నూమచి, డిపోలనుంచి వెళ్ళే కలప, వెదురు అంతర్ రాష్ట్ర పర్మిట్ల జారీకి వీలవుతుంది.
వెబ్ ఆధారిత జి ఐ ఎస్ వ్యవస్థను కూడా మంత్రిత్వశాఖ రూపొందించింది. పరివేష్ పేరుతో ఒక పోర్టల్ తయారు చేసి అటవీ, పర్యావరణ యాజమాన్య వ్యవస్థను సింగిల్ విండో పద్ధతిలో పర్యవేక్షించే ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణి, తీరప్రాంత సంబంధిత విషయాలలో అనుమతులు కావాల్సిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవటానికి ఇది పనికొస్తుంది. సంబంధిత భాగస్వాములందరికీ ఇది అందుబాటులో ఉంటుంది.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ రోజు రాజ్య సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలోని సమాచారమిది.
***
(Release ID: 1883960)
Visitor Counter : 162