ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామాల్లో డిజిటల్ సౌకర్యం

Posted On: 14 DEC 2022 5:04PM by PIB Hyderabad
డిజిటల్ సేవలు, డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం , డిజిటల్ వ్యవస్థలో అంతరాలు  తగ్గించడం, డిజిటల్ చేరిక మరియు డిజిటల్ సాధికారత కల్పించడం  ద్వారా దేశ ప్రజల  జీవన స్థితిగతులను అభివృద్ధి చేయడం,పరిపాలన మరియు ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా డిజిటల్ ఇండియా కార్యక్రమం అమలు జరుగుతోంది. లక్ష్య సాధన కోసం ప్రభుత్వ సేవలు అందించేందుకు  డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది.  దేశంలో అందుబాటులో ఉన్న  కొన్ని కీలక ప్లాట్‌ఫారమ్‌లతో పాటు వాటి వెబ్ లింక్‌లు క్రింది విధంగా ఉన్నాయి:

        i.      ఆధార్ ప్లాట్‌ఫారమ్: https://uidai.gov.in/

       ii.      యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI): https://www.bhimupi.org.in/

      iii.      న్యూ-ఏజ్ గవర్నెన్స్ (UMANG) కోసం ఏకీకృత మొబైల్ అప్లికేషన్: https://web.umang.gov.in/ landing/

·      (iv) డిజిటల్ సేవా ప్లాట్‌ఫారమ్: https://digitalseva.csc.gov. లో/

       v.      డిజిలాకర్: https://www.digilocker.gov.in/

·      (vi) మై స్కీం : https://www.myscheme.gov.in/

టెలికాం సేవలు అందిస్తున్న సంస్థలు (TSPలు) మరియు టెలికమ్యూనికేషన్ శాఖ (DoT)  ఫీల్డ్ యూనిట్ల నుంచి  అందిన  సమాచారం  ప్రకారం 2020 డిసెంబర్  నాటికి  2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 5,97,618 జనావాస గ్రామాల్లో 25,067 గ్రామాలకు . మొబైల్ సౌకర్యం లేదు. గుర్తించిన  25,067  గ్రామాలలో దాదాపు 11,000 గ్రామాలను  యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ పథకం లో చేర్చడం జరిగింది. మిగిలిన  గ్రామాలకు  దశలవారీగా ప్రభుత్వం ,  టెలికాం సేవలు అందిస్తున్న సంస్థలు   మొబైల్ సౌకర్యం కల్పిస్తాయి. 

ఆప్టిక్ ఫైబర్ సౌకర్యం కల్పించేందుకు టెలికమ్యూనికేషన్ శాఖ భారత్ నెట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అన్ని గ్రామాలకు దశల వారీగా ఈ ప్రాజెక్టు కింద బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 

 బీహార్,ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ లతో సహా దేశంలో అన్ని గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ బ్రాడ్ బ్యాండ్/ ఆప్టికల్ ఫైబర్ సౌకర్యం అందిస్తోంది.  20. 11. 2022 నాటికి బీహార్,ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఫైబర్ సౌకర్యం కల్పించిన గ్రామాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

 

 

క్ర.స 

రాష్ట్రం

ప్రణాళిక సిద్ధం అయిన గ్రామ పంచాయతీలు 

సిద్దమైన ఆప్టిక్ ఫైబర్ కేబుల్  (కి మీ)

ఆప్టిక్ ఫైబర్ కేబుల్ సర్వీస్ పొందడానికి  సర్వీస్-సిద్ధమైన జీపీలు 

ఉపగ్రహంలో సర్వీస్-సిద్ధమైన జీపీలు

 సర్వీస్-సిద్ధమైన  మొత్తం జీపీలు(ఆప్టిక్ ఫైబర్  + ఉపగ్రహం)

 

1

బీహార్

8,404

27,413

8,300

16

8,316

2

జార్ఖండ్

4,399

16,745

4,333

2

4,335

3

ఉత్తర ప్రదేశ్

59,365

1,03,950

39,785

33

39,818

            మూలం: టెలికమ్యూనికేషన్ శాఖ

 

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో ఈ వివరాలు అందించారు. 

***


(Release ID: 1883639)
Read this release in: English , Urdu