ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమంపై సమాచారం


దేశంలోని 687 ఎఆర్‌టి కేంద్రాలు, 1261 లింక్‌ ఎఆర్‌టి కేంద్రాల ద్వారా సుమారు 15.23 లక్షల మంది హెచ్‌ ఐ వి పేషెంట్లకు ఎఆర్‌వి మందులు పంపిణీ చేయడం జరుగుతోంది.

హెచ్‌ ఐవి , ఎయిడ్స్‌ పై దేశవ్యాప్తంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు మల్టీమీడియా ప్రచారాన్ని చేపట్టిన ఎన్‌ ఎ సి ఒ.

Posted On: 13 DEC 2022 5:40PM by PIB Hyderabad

 హెచ్‌ ఐ వి సోకిన వారికి జీవితాంతం ,భారత ప్రభుత్వం యాంటీ రిట్రోవైరల్‌ (ఎఆర్‌వి) మందులను , జాతీయ  ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమం కింద అందజేస్తోంది. ప్రస్తుతం హెచ్‌.ఐ.వి సోకిన సుమారు, 15.23 లక్షల మందికి 687 ఎఆర్‌టి కేంద్రాల ద్వారా , 1261 లింక్‌ కేంద్రాల ద్వారా , బాధితుల ఆదాయ స్తోమతతో సంబంధం లేకుండా అందరికీ ఎఆర్‌వి మందులను పంపిణీ చేయడం జరుగుతోంది. అలాగే ఉచిత కౌన్సిలింగ్‌, డయాగ్నస్టిక్‌, బేస్‌లైన్‌ లేబరెటరీ పరిశీలనలతో సహా సిడి4 కౌంట్‌ టెస్టింగ్‌, వైరల్‌ లోడ్‌ టెస్టింగ్‌ తదితరాలను ఉచితంగా చేపడతారు.

హెచ్‌ఐవి చుట్టూ ఉన్న అపోహలను తొలగించేందుకు ఎన్‌ఎసిఒ మల్టీమీడియా ప్రచారాన్ని చేపడుతుంది. ఇందుకు  మాస్‌ మీడియా సహాయం తీసుకుంటోంది. హోర్డింగ్‌లు, బస్‌పానెళ్లు, సమాచార కియోస్క్‌లు, కళారూపాల ద్వారా ప్రచారం, ఎగ్జిబిషన్‌ వ్యాన్‌లు, వంటి వాటిద్వారా దీనిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌.ఐ.వి ఎయిడ్స్‌ పై అవగాహనతో పాటు ఇది సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై  ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ముఖాముఖి సంభాషణలు, అవగాహనకల్పించడం, స్వయం సహాయకబృందాల సభ్యులకు , అంగన్‌వాడి వర్కర్లు, ఆశా కార్యకర్తలు, పంచాయతిరాజ్‌సంస్థలు, ఇతర కీలకస్టేక్‌ హొల్డర్లద్వారా హెచ్‌ఐవి పై అవగాహన కల్పించడంతోపాటు, ఇందుకు గల చికిత్సా సదుపాయాలు, ఇతర అంశాల గురించి వారికి తెలియజేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్‌ డే ను డిసెంబర్‌ 1న జరుపుకోవడం జరిగింది. ఈక్వలైజ్‌ థీమ్‌తో దీనిని పెద్ద ఎత్తున ఈ ఏడాది నిర్వహించుకోవడం జరిగింది.

.50 వేలకు పైగా పాఠశాలల్లో కౌమార విద్యాకార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 8,9,11 తరగతి విద్యార్థులందరికీ    జీవన నైపుణ్యాల ఆధారిత కో కరికులర్‌ కార్యక్రమాల ద్వారా దీనిని అమలు చేస్తున్నారు.రాష్ట్రాలన్నింటిలో హెచ్‌ఐవి ,ఎయిడ్స్‌కు సంబంధించిన అంశాన్ని పాఠశాల విద్యలో చేర్చడం జరిగింది.
కాలేజిలలో రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్‌.ఐ.వి నియంత్రణకు సంబంధించి విద్యార్థులలో విద్యార్థులచేత అవగాహన కల్పించడం జరుగుతోంది. హెచ్‌.ఐ.వి ఎయిడ్స్‌కు సంబంధించి విద్యార్థులలో గల అపోహలు తొలగించి వారికి దీనిపై అవగాహన కల్పించడం జరుగుతోంది.కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈవిషయాలు తెలిపారు.

***



(Release ID: 1883559) Visitor Counter : 135


Read this release in: English , Urdu