ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక సమాచార వినియోగదారు (ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజర్ - FIU) గా ఖాతా అగ్రిగేటర్ (AA) ప్లాట్‌ఫారమ్‌లో 94 ఆర్థిక సంస్థలు చేరాయి


ఆర్థిక సమాచార దాత (ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ - FIP)గా 26 ఆర్థిక సంస్థలు

Posted On: 12 DEC 2022 6:12PM by PIB Hyderabad

ఈ రోజు వరకు, 94 ఆర్థిక సంస్థలు ఆర్థిక సమాచార వినియోగదారు (FIU)గా ఖాతా అగ్రిగేటర్ (AA) ప్లాట్‌ఫారమ్‌లో చేరాయి , వీటిలో 73 ఆర్ బీ ఐ  నియంత్రణలో ఉన్నాయి, 10 సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉన్నాయి, 9 ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నియంత్రిత మరియు 2 పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నియంత్రిత సంస్థలు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్‌రావ్ కరాద్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

26 ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ (ఎఫ్‌ఐపి)గా పనిచేస్తున్నాయని, వాటిలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 10 ప్రైవేట్ రంగ బ్యాంకులు, 1 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు 3 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలని మంత్రి తెలిపారు.

 

పైన పేర్కొన్న వాటికి అదనంగా, ఆర్‌బిఐ నవంబర్ 23, 2022 నాటి సర్క్యులర్‌లో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నెట్‌వర్క్ (జిఎస్‌టిఎన్)ని ఖాతా అగ్రిగేటర్ (AA) ఫ్రేమ్‌వర్క్ కింద ఎఫ్ ఐ పి (FIP) గా చేర్చింది.

 

ఇంకా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వారు ఈ రోజు నాటికి ఖాతా అగ్రిగేటర్ (AA)గా ఆరు కంపెనీలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు చేసినట్లు తెలియజేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కంపెనీల పేర్లు:

 

ఫిన్సెక్ ఏ ఏ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్,

క్యామ్స్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్,

కుకీజార్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్,

నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (NESL) అసెట్ డేటా లిమిటెడ్,

పెర్ఫియోస్ అకౌంట్ అగ్రిగేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు

యోడ్లీ ఫిన్‌సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్.

 

నేపథ్య సమాచారాన్ని అందజేస్తూ, ఆర్‌బిఐ సెప్టెంబరు 02, 2016 నాటి (అక్టోబర్ 05, 2021 వరకు నవీకరించబడింది) నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) – ఖాతా అగ్రిగేటర్ (రిజర్వ్ బ్యాంక్) ఆదేశాలు జారీ చేసిందని మంత్రి పేర్కొన్నారు. అగ్రిగేటర్ (AA) నెట్‌వర్క్ అనేది పెట్టుబడి మరియు రుణ వితరణ ను సులభతరం చేయగల ఆర్థిక బదిలీ వ్యవస్థ గా పరిచయం చేయబడింది, వినియోగదారులకు వారి ఆర్థిక వ్యవహరాల సమచారం మరియు నియంత్రణను ఇస్తుంది మరియు ఆర్థిక రంగ సంస్థలు మరియు ఫిన్‌టెక్ కంపెనీలకు కస్టమర్ల పరిధిని విస్తరించింది. ఏ ఏ ఒక వ్యక్తి యొక్క ఇష్టం మరియు సమ్మతి ఆధారంగా ఒక ఆర్థిక సంస్థ నుండి మరొకదానికి డేటాను తీసుకుంటుంది. అయితే, ఏ ఏ లో నమోదు చేసుకోవడం వినియోగదారులకు పూర్తిగా స్వచ్ఛంద  స్వీయ నిర్ణయం పై ఆధారం గా  ఉంటుంది.

***



(Release ID: 1883315) Visitor Counter : 123


Read this release in: English , Urdu