ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమంపై నవీకరణ


మిషన్ పరివార్ వికాస్ 13 రాష్ట్రాల్లో అమలు అయింది

36 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు 31 రిప్లేస్మెంట్ లెవెల్ సంతానోత్పత్తిని సాధించాయి

Posted On: 13 DEC 2022 5:39PM by PIB Hyderabad

నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 , నేషనల్ హెల్త్ పాలసీ 2017   సిద్ధాంతాల ద్వారా మార్గనిర్దేశం చేసిన జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది, ఇది కుటుంబ నియంత్రణ   అసంపూర్ణ అవసరాన్ని పరిష్కరించడానికి దోహదం చేసింది.

ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపట్టింది:

విస్తరించిన గర్భనిరోధక ఎంపికలు

మిషన్ పరివార్ వికాస్ (ఎంపీవీ) గర్భనిరోధక సాధనాలు , కుటుంబ నియంత్రణ సేవలను గణనీయంగా పెంచడం 13 రాష్ట్రాల్లో అమలు అయింది. స్టెరిలైజేషన్ అంగీకరించేవారికి పరిహారం పథకం, ఇది లబ్ధిదారునికి , స్టెరిలైజేషన్ నిర్వహించడానికి సర్వీస్ ప్రొవైడర్ బృందానికి వేతనాల నష్టానికి పరిహారం అందిస్తుంది. ప్రసవానంతర గర్భాశయ గర్భనిరోధక పరికరం (పీపీఐయూసీడీ) సేవలు డెలివరీ తర్వాత అందజేస్తారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే ఆశా వర్కర్లల ద్వారా గర్భనిరోధక సాధనాలను హోమ్ డెలివరీ చేసే పథకం కూడా ఉంది.  కుటుంబ నియంత్రణ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎఫ్పీ ఎల్ఎంఐఎస్) అన్ని స్థాయిల ఆరోగ్య సౌకర్యాలలో కుటుంబ నియంత్రణ వస్తువుల చివరి మైలు లభ్యతను నిర్ధారించడానికి నిర్వహిస్తోంది.

  ప్రభుత్వం ఈ క్రింది పురోగతిని సాధించింది:

మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 2019-21లో 2.0కి తగ్గింది (ఎన్ఎఫ్హెచ్ఎస్ 5) ఇది భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉంది.

36 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతంలలో 31 రీప్లేస్‌మెంట్ లెవల్ ఫెర్టిలిటీ (ఎన్ఎఫ్హెచ్ఎస్ 5) సాధించాయి.

ఆధునిక గర్భనిరోధక వినియోగం 56.5శాతానికి పెరిగింది (ఎన్ఎఫ్హెచ్ఎస్ 5).

కుటుంబ నియంత్రణ కోసం అన్‌మెట్ నీడ్ 9.4శాతానికి తగ్గింది (ఎన్ఎఫ్హెచ్ఎస్ 5).

క్రూడ్ బర్త్ రేట్ (సీబీఆర్) 2020 (ఎస్ఆర్ఎస్)లో 19.5 శాతానికి తగ్గింది.

కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.

***



(Release ID: 1883307) Visitor Counter : 118


Read this release in: English , Urdu