రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్ మందులను సూచించడానికి మార్గదర్శకాలు

Posted On: 13 DEC 2022 6:02PM by PIB Hyderabad

ఫార్మాస్యూటికల్ కంపెనీల అనైతిక మార్కెటింగ్ పద్ధతులను నిరోధించడానికి  ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం 01.01.2015 నుండి అమలులో ఉన్న యూనిఫాం కోడ్ ఫర్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (UCPMP) నియమావళి ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ నియమావళి ఫార్మాస్యూటికల్ కంపెనీల మార్కెటింగ్ పద్ధతులలో ఉన్న అనైతిక ప్రవర్తనను నియంత్రిస్తుంది, వైద్యలు, ఆడియో-విజువల్ ప్రచార సామగ్రి, నమూనాలు, బహుమతులు మొదలైన వివిధ అంశాలను నియమావళి సక్రమంగా అమలుచేస్తుంది. ఇంకా,నియమావళి ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ తో వైద్య నిపుణులతో సంబంధాన్ని , ఇందులో నిబంధనలు వైద్యులకు ఫార్మాస్యూటికల్ కంపెనీలు అందించే ప్రయాణ సౌకర్యాలు, ఆతిథ్యం మరియు వైద్యులకు లేదా వారి కుటుంబాలకు నగదు లేదా ద్రవ్య బహుమతుల గురించి నియమావళి లో వివరించడం జరిగింది.  ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (ECPMP) కోసం ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేయడంలో ఫార్మాస్యూటికల్ అసోసియేషన్‌ల బాధ్యతలు మరియు సమీక్ష, ఫిర్యాదుల నిర్వహణ కోసం ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (AECPMP)  కోసం అపెక్స్ ఎథిక్స్ కమిటీ (AECPMP) ఏర్పాటు, ఆపరేషన్ విధానం, ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ల ద్వారా ఫిర్యాదులను నిర్వహించే విధానం మరియు వివిధ పెనాల్టీ నిబంధనలను ఈ నియమావళి వివరిస్తుంది.

 

ఈ నియమావళిని  ఫార్మాస్యూటికల్ కంపెనీల అన్ని ప్రధానసంఘాలు ఆమోదించాయి  వివిధ సందర్భాల్లో ఫార్మాస్యూటికల్స్ అసోసియేషన్ల చే కోడ్ అమలును డిపార్ట్‌మెంట్ సమీక్షించింది. ఫార్మా కంపెనీలు స్వచ్ఛంద యూనిఫాం కోడ్ ఫర్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ ను ఉల్లంఘించినట్లు అందిన ఫిర్యాదులను డిపార్ట్‌మెంట్ స్వీకరించింది. వీటిపై అవసరమైన చర్య తీసుకోవడానికి సంబంధిత ఫార్మాస్యూటికల్ అసోసియేషన్‌లకు పంపబడతాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ప్రొఫెషనల్ కండక్ట్, మర్యాద మరియు నీతి) నిబంధనలు, 2002 ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్, 1956 (102 ఆఫ్ 1956) కింద ఏర్పడినది. ఫార్మాస్యూటికల్ మరియు అనుబంధ వైద్య ఆరోగ్య పరిశ్రమతో వైద్యులు మరియు వృత్తిపరమైన ప్రవర్తన పర్యవేక్షణ ను ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వైద్యుల సంఘం అందిస్తుంది. దీని కింద, మెడికల్ ప్రాక్టీషనర్ లేదా ప్రొఫెషనల్ యొక్క వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదు సంబంధిత రాష్ట్ర వైద్య మండలి ద్వారా పరిష్కరించబడుతుంది. ఈ విషయాన్ని రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

***



(Release ID: 1883305) Visitor Counter : 103


Read this release in: English , Urdu