నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
నూతన, పునరావృత ఇంధన లక్ష్యం
Posted On:
13 DEC 2022 5:21PM by PIB Hyderabad
సిఒపి26లో ప్రధానమంత్రి ప్రకటనకు అనుగుణంగా, 2030 నాటికి శిలాజరహిత వనరుల నుంచి 500 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్ధ్యాన్ని సాధించడానికి, 2070 నాటికి నికర జీరోను సాధించడానికి నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.
దేశంలో 31.10.2022 మొత్తం 172,72 గిగావాట్ల సామర్ధ్యం శిలాజేతర ఇంధన ఆధారిత ఇంధన వనరులను నెలకొల్పారు. ఇందులో 119.09 గిగావాట్ల పునరావృత ఇంధనం, 46.85 గిగావాట్ల భారీ జిలవిద్యుత్, 6.78 గిగావాట్ల అణు ఇంధన సామర్ధ్యం ఉన్నాయి. ఇది 31.10. 2022 నాటికి మొత్తం నెలకొల్పిన ఉత్పాదక సామర్ధ్యం అయిన 408.71 గిగావాట్లలో 42.26%వాటా.
అదనంగా, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సిఇఎ) 2029-30 సంవత్సరానికి (ముసాయిదా 20 ఇపిఎస్ ప్రొజెక్షన్) అంచనా వేసిన ఆలిండియా గరిష్ట విద్యుత్ డిమాండ్, 325 గిగావాట్ల , 2256 బియు విద్యుత్ శక్తి అవసరాలతో ఉత్పత్తి విస్తరణ అధ్యయనాలను నిర్వహించింది.
సామర్ధ్య మిశ్రమంలో ఆర్ ఇ ఆధారిత వ్యవస్థాపక సామర్ధ్యం 2029-30 నాటికి (భారీ జల విద్యుత్) దాదాపు 480 గిగావాట్ల పెరుగదలకు తావిస్తుందని అధ్యయనం వెల్లడించింది. దేశంలో మార్చి 2022 నాటికి 22% గా ఉన్న ఆర్ఇ వాటా (భారీ జలవిద్యుత్) సహా 2029-30 నాటికి 41%కి పెరుగుతుంది.
శిలాజేతర మూలాల నుంచి ప్రభుత్వం 500 గిగావాట్ల వ్యవస్థాపక సామర్ధ్యాన్ని సాధించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. అందులో -
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ)ను 100 శాతం వరకు యాంత్రిక మార్గంలో అనుమతించడం.
జూన్ 30, 2025 నాటికి ప్రారంభించే ప్రాజెక్టుల కోసం సౌర, వాయు విద్యుత్ ప్రసారం కోసం అంతర్ రాష్ట్ర ప్రసార వ్యవస్థ (ఐఎస్‌టిఎస్) చార్జీల మినహాయింపు.
పునరావృత కొనుగోలు బాధ్యత (ఆర్‌పిఒ) ప్రకటిత పథం 2029-30 సంవత్సరం వరకు
భారీ స్థాయిలో ఆర్ఇ ప్రాజెక్టుల స్థాపన కోసం ఆర్ఇ అభివృద్ధిదారులకు భూమి, ప్రసారాన్ని అందించేందుకు విశేష భారీ పునరావృత ఇంధన పార్కుల ఏర్పాటు
ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పిఎం-కెయుఎస్‌యుఎం), సోలార్ రూఫ్‌టాప్ దశ 2 (ఇంటికప్పుపై సౌర పరికరాల ఏర్పాటు) 12000 మెగావాట్ల సిపిఎస్‌యు పథకం దశ 2, తదితర పథకాలు
పునరావృత ఇంధన సరఫరా కోసం హరిత ఇంధన కారిడార్ పథకం కింద నూతన ట్రాన్స్‌మిషన్ లైన్లు, నూతన సబ్- స్టేషన్ సామర్ధ్యాల సృష్టి
సోలార్ ఫోటోవోల్టాయిక్ వ్యవస్థ/ పరికరాల మోహరింపు కోసం ప్రమాణాలు జారీ
పెట్టుబడులను ఆకర్షించి.. సులభతరం చేసేందుకు ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్
గ్రిడ్‌తో అనుసంధానమైన సౌర పివి, వాయు ప్రాజెక్టుల నుంచి విద్యుత్ సేకరణ కోసం సుంక ఆధారిత పోటీ బిడ్డింగ్ ప్రక్రియకు ప్రామాణిక బిడ్డింగ్ మార్గదర్శకాలు.
ఆర్ఇ ఉత్పత్తిదారులకు పంపిణీ లైసెన్సుల ద్వారా సకాలంలో చెల్లింపును నిర్ధారించడానికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సి) లేదా ముందస్తు చెల్లింపుకు వ్యతిరేకంగా విద్యుత్ పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హరిత ఇంధన బహిరంగ ప్రవేశ నిబంధనలు (గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్) 2022 ద్వారా పునరావృత ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు నోటిఫికేషన్.
విద్యుత్ (ఆలస్య చెల్లింపుపై అదనపు సుంకం, తత్సంబంధిత వ్యవహారాల) నిబంధనలు (ఎల్‌పిఎస్ రూల్స్) పై నోటిఫికేషన్.
ఎక్స్‌చేంజీల ద్వారా పునరావృత ఇంధన విద్యుత్ అమ్మకాలను సులభతరం చేసేందుకు గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ (జిటిఎఎం) ప్రారంభం.
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యుత్, నూతన & పునరావృత ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ మంగళవారం రాజ్యసభలో అందించారు.
***
(Release ID: 1883302)
Visitor Counter : 199