రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఎం ఎస్ ఎం ఈ ల కోసం ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్

Posted On: 13 DEC 2022 6:03PM by PIB Hyderabad

ఎం ఎస్ ఎం ఈ లు గతంలో వున్న ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ ( పీ టీ యూ ఏ ఎస్) పథకం కింద ప్రయోజనాన్ని పొందాయి. అయితే, పీ టీ యూ ఏ ఎస్ అనే స్కీమ్ - స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ (SPI)  ఉప-పథకం కింద చేర్చబడింది. ఈ పథకం జూలై 2022లో ప్రారంభించబడింది.

 

ఫార్మాస్యూటికల్ పరిశ్రమ బలోపేతం కోసం (స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ), రూ. 500 కోట్లు ఆర్థిక వ్యయం తో  2021-2022 నుండి 2025-26 వరకు,  క్లస్టర్‌లలోని ఫార్మా ఎం ఎస్ ఎం ఈ లకు మౌలిక సదుపాయాల కల్పన లో మద్దతును అందించడానికి మరియు  ఫార్మా ఎం ఎస్ ఎం ఈ ల సాంకేతికత అప్‌గ్రేడేషన్ సమస్యలను పరిష్కరించడానికి క్రింది మూడు అంశాలు కలిగి ఉంది:-

 

1.  ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు ఉమ్మడి సౌకర్యాల కల్పన కోసం సహాయం

2. ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ (పీ టీ యూ ఏ ఎస్ )

3.ఫార్మాస్యూటికల్ & మెడికల్ డివైసెస్ ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ స్కీమ్ (PMPDS)

 

సబ్-స్కీమ్ పీ టీ యూ ఏ ఎస్ , ఎం ఎస్ ఎం ఈ లు జాతీయ మరియు అంతర్జాతీయ నాణ్యత నియంత్రణ ప్రమాణాలకు (WHO-GMP లేదా షెడ్యూల్-M) అనుగుణంగా  ఎదిగేందుకు నిరూపితమైన అనుభవం కలిగి ఉన్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా ఫార్మా పరిశ్రమ లకు (ఎం ఎస్ ఎం ఈ లు) వడ్డీ రాయితీ లేదా మూలధన రాయితీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.  ఇది ఉత్పత్తి లో మరియు నాణ్యతలో వృద్ధిని మరింత సులభతరం చేస్తుంది. ఈ ఉప పథకం  కింద పథకం పదవీకాలంలో    సుమారు 400 ఫార్మా ఎం ఎస్ ఎం ఈ యూనిట్లకు మద్దతునిస్తుంది.

 

పీ టీ యూ ఏ ఎస్ అనేది రుణ సంబంధిత స్కీమ్ దీని కింద, 01.08.2022 నుండి అర్హత కలిగిన ఫార్మా ఎం ఎస్ ఎం ఈ యూనిట్ల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు నమోదు కోసం, పథకం యొక్క ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (PMC) అయిన సిడ్బి ద్వారా ఆన్‌లైన్ పోర్టల్ అభివృద్ధి చేయబడింది.

ఈ పథకం వివరాలు ఈ దిగువ లింక్ https://spi.udyamimitra.in లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 60 దరఖాస్తులు నమోదయ్యాయి.

 

ఇంకా, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఫార్మా ఇండస్ట్రీ అసోసియేషన్‌లను కలుపుకొని ఒక జాతీయ స్థాయి మరియు 10 రాష్ట్ర స్థాయి అవగాహన సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఇందులో  స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు ఫార్మా ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పించారు.

 

ఈ విషయాన్ని రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు

***



(Release ID: 1883301) Visitor Counter : 106


Read this release in: English , Urdu