ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విదేశీ వైద్య విద్యార్థుల తాజా పరిస్థితి


విదేశాలనుంచి తిరిగి వచ్చే విద్యార్థులు సంబంధిత విద్యాసంస్థ ఆ కోర్సు పూర్తి చేసినట్టు ధృవీకరిస్తే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షకు అనుమతించబడతారు

ఉక్రెయిన్ లోని సంబంధిత విశ్వవిద్యాలయాలన్నిటినీ ప్రభుత్వం సంప్రదించి విద్యార్థులకు ట్రాన్ స్క్రిప్ట్ లు, ఇతర డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరింది

Posted On: 13 DEC 2022 5:41PM by PIB Hyderabad

విదేశీ వైద్య విద్యార్థులు స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులేషన్స్ -2002 లేదా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్ రెగ్యులేషన్స్ 2021 కిందికి వస్తారు. విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి వైద్య విద్యార్థులను భారతీయ వైద్య కళాశాలలో చేర్చుకునే వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలు భారతీయ వైద్య మండలి చట్టం 1956 లోగాని,  జాతీయ వైద్య కమిషన్ చట్టం, 2021 లో గాని లేవు.  జాతీయ వైద్య మండలి అలా ఏదైనా భారతీయ వైద్య విద్యా సంస్థ/విశ్వవిద్యాలయంలోకి బదలీ చేసుకునే అనుమతి కూడా ఇవ్వలేదు.   

నేషనల్ మెడికల్ కమిషన్ రూపొందించిన ఒక పథకం కింద మెడిసిన్ గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు కోవిడ్ వల్ల గాని,  ఉక్రెయిన్ యుద్ధం వల్ల గాని బాధితులైతే తమ విదేశీ విద్యా సంస్థ వదిలేసి రావాల్సి వస్తే అలాంటి వాళ్ళు చదువు పూర్తి చేసినప్పుడు కూడా 2022 జూన్ 30 లోగా ఆయా సంస్థలు కోర్సు పూర్తి చేసినట్టు ధృవీకరిస్తే అలాంటి వారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించబడింది. అందువల్ల, ఎఫ్ ఎం జి పరీక్ష ఉత్తీర్ణత సాధిస్తే అలాంటి విదేశీ వైద్య పట్టభద్రులు రెండేళ్లపాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్ షిప్ చేయటం ద్వారా వాళ్ళు విదేశీ సంస్థలో నేరుగా హాజరై  పూర్తి చేయలేకపోయిన క్లినికల్ ట్రెయినింగ్ ను పూర్తి చేయటమే కాకుండా భారతీయ పరిస్థితుల మధ్య వైద్య ఆచరణను నేర్చుకోవచ్చు.  విదేశీ వైద్య పట్టభద్రులు రెండేళ్ళపాటు ఈ సీఆర్ఎంఐ పూర్తి చేసిన మీదట మాత్రమే రిజిస్ట్రేషన్ పొందగలుగుతారు.

విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం క్యివ్ లోని భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్ లోని  సంబంధిత విశ్వవిద్యాలయాలన్నీటినీ సంప్రదించి ట్రాన్ స్క్రిప్ట్ లు, ఇతర డాక్యుమెంట్లు ఎలాంటి సమస్యలూ లేకుండా విద్యార్థులకు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేసింది.  రాయబార కార్యాలయం వెబ్ సైట్ లో ఆ వివరాలన్నీ అందుబాటులో ఉన్నాయి. సంబంధిత సమస్యలగు రించి అందులో చూడవచ్చు.

ఉక్రెయిన్ ఘర్షణ కారణంగా విద్యార్థులు ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్ళటానికి,  విద్యాపరమైన బదలాయింపులకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఎన్ ఎం సి  బహిరంగ ప్రకటన కూడా జారీ చేసింది.  ఇది ఆ బహిరంగ ప్రకటనలో పేర్కొన్న 29 దేశాలకు వర్తిస్తుంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానమిది.

***


(Release ID: 1883297)
Read this release in: English , Urdu