సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

అటల్ వయో అభ్యుదయ యోజన

Posted On: 13 DEC 2022 5:28PM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహిస్తున్న అటల్ వయో అభ్యుదయ యోజన (ఏవీవైఏవై) పథకంలో వృద్ధుల కోసం ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, ఆశ్రయం, సంక్షేమం మొదలైన అంశాలన్నీ ఇమిడి ఉన్నాయి. నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రయం, ఆహారం, వైద్యం, కాలక్షేప కార్యక్రమాల వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉచితంగా అందించడం జరుగుతుంది.

ఏవీవైఏవై కింద ఇంటిగ్రేటెడ్‌ సీనియర్‌ సిటిజన్‌ ప్రోగ్రామ్‌ అమలు కావడం లేదంటూ 2021-22 సంవత్సరానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నోటిఫై చేసిన జిల్లాలు ఆగ్రా, బాగ్‌పట్, ఇటావా, ఫరూఖాబాద్, గోరఖ్‌పూర్, హమీర్‌పూర్, కస్‌గంజ్‌, మథుర, ప్రయాగ్‌రాజ్ . 2022-23 సంవత్సరం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసిన జిల్లాలు మవు, బాగ్‌పట్‌, బారాబంకి, బులంద్‌షహర్, కన్నౌజ్, కుషీ నగర్.

ఏవీవైఏవైలో భాగం అయినఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌ (ఐపీఎస్‌ఆర్‌సీ) కింద ఆయా జిల్లాల్లో వృద్ధాశ్రమాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వృద్ధాశ్రమాలు నిర్వహించని జిల్లాల్లో వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాలు/యుూటీల నుంచి మంత్రిత్వ శాఖ పొందుతుంది. ఆ సమాచారం ఆధారంగా, అర్హత గల సంస్థల నుంచి దరఖాస్తులను ఈ-అనుదాన్ పోర్టల్‌లో మాత్రమే ఆహ్వానించడం జరుగుతుంది. వారు అందించిన పత్రాలు, సంబంధిత రాష్ట్ర/యూటీ ప్రభుత్వ సిఫార్సుల ఆధారంగా సంస్థల ఎంపిక జరుగుతుంది.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమ భూమిక్ ఈ విషయాన్ని ఇవాళ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.

 

***



(Release ID: 1883295) Visitor Counter : 121


Read this release in: English , Urdu