సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఓబీసీలకు జాతీయ ఫెలోషిప్‌లు
Posted On:
13 DEC 2022 5:29PM by PIB Hyderabad
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న షెడ్యూల్డ్ కులాల జాతీయ ఫెలోషిప్ పథకం (ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ), ఓబీసీల కోసం జాతీయ ఫెలోషిప్ పథకం (ఎన్‌ఎఫ్‌ఓబీసీ), దివ్యాంగులకు జాతీయ ఫెలోషిప్ (ఎన్‌ఎఫ్‌పీడబ్ల్యూడీ) కింద ఫెలోషిప్ జారీకి సంబంధించి, అర్హత గల అభ్యర్థులకు ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ కింద నవంబర్ 2022 వరకు, ఎన్‌బీఓబీసీ, ఎన్‌ఎఫ్‌పీడబ్ల్యూడీ కింద సెప్టెంబర్ 2022 వరకు ఫెలోషిప్ చెల్లించడం జరిగింది.
షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులకు సెప్టెంబర్ 2022 వరకు యూజీసీ ద్వారా జాతీయ ఫెలోషిప్ అందించడం వాస్తవం. అయితే, కేంద్ర నోడల్ ఏజెన్సీ (సీఎన్‌ఏ) ద్వారా నిధుల విడుదల కోసం సవరించిన విధానం ప్రకారం, అక్టోబర్ 2022 నుంచి ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ & ఎన్‌ఎఫ్‌ఓబీసీ పథకాలు జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ), జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) ద్వారా అమలవుతున్నాయి. ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ లబ్ధిదారులకు ఫెలోషిప్ పంపిణీ చేయడం కోసం సంబంధిత అమలు సంస్థకు 2022-23లో రూ.85 కోట్లు విడుదలయ్యాయి. ఎన్‌ఎఫ్‌ఓబీసీ లబ్ధిదారులకు ఫెలోషిప్ పంపిణీ కోసం సంబంధిత అమలు సంస్థకు 2022-23 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికం వరకు రూ.45.84 కోట్లు విడుదలయ్యాయి. ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ విషయంలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీకి, ఎన్‌ఎఫ్‌ఓబీసీ విషయంలో ఎన్‌బీసీఎఫ్‌డీసీకి త్రైమాసికం ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందాయి.
దివ్యాంగులకు జాతీయ ఫెలోషిప్ (ఎన్‌ఎఫ్‌పీడబ్ల్యూడీ) పథకం కింద, కెనరా బ్యాంక్‌కు చెందిన ఉపకార వేతనాల వెబ్ పోర్టల్ (https://scholarship.canarabank.in/scholar) ద్వారా ఫెలోషిప్ పంపిణీ జరుగుతుంది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ.నారాయణస్వామి ఈ విషయాన్ని ఇవాళ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
********
(Release ID: 1883294)
Visitor Counter : 142