ఆయుష్
azadi ka amrit mahotsav

ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి

Posted On: 13 DEC 2022 5:14PM by PIB Hyderabad

యావత్ ఆయుష్ రంగానికి సమగ్రంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వెన్నెముకగా మార్చే ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను ఆయుష్ మంత్రిత్వశాఖ రూపొందించింది. ఆరు ప్రధాన విభాగాలలో సేవలందించటాన్ని డిజిటైజ్ చేయాలని ఆయుష్ గ్రిడ్ వేదిక నిర్ణయించింది. ఆరోగ్య సేవలు, విద్య, పరిశోధన, ఔషధ యాజమాన్యం, ఔషధ మొక్కలతోబాటు ఆయుష్ పర్యవేక్షణను, సామర్థ్య నిర్మాణాన్ని ఇందులో పొందుపరచారు.  

ప్రతిపాదించిన లక్ష్యాలు, నిర్మాణం, విధులతోబాటు ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలు కాల వ్యవధి ఇలా ఉన్నాయి:

లక్ష్యాలు:   i. ఆరోగ్య సేవలు, విద్య, పరిశోధన లాంటి ఆరోగ్య సేవల అందుబాటును దేశంలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ పెంచటం

ii.   డిజిటల్ సొల్యూషన్స్ ద్వారా ఆయుష్ ను సంపూర్ణంగా అన్నిటికీ వర్తింపజేయటం.

iii.  ఆయుష్ భాగస్వాములందరిలో ఉత్తమ ఆచారణ విధానాల పంపిణీకి డిజిటల్ సేవలు వాడుకోవటం  

iv.   జాతీయ ఆరోగ్య విధానం-2017 కు అనుగుణంగా అత్యధిక స్థాయి ఆరోగ్యం, సంక్షేమం సాధించటం

v.  సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు -3, 2030 కి అనుగుణంగా అన్నీ వయోవారగాల వారికి మంచి ఆరోగ్యం, సంక్షేమం  సాధించటం

vi.  సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-4 కు అనుగుణంగా 2030 నాటికి నాణ్యమైన విద్య ( సమ్మిళిత, సమానమైన నాణ్యవు విద్య అందించి జీవితకాలపు అధ్యయన అవకాశాలు అందరికీ కల్పించటం  

vii. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు -9 కు అనుగుణంగా 2030 నాటికి పరిశ్రమ, నవకల్పన, మౌలిక సదుపాయాలు ( తిరిగి కోలుకోవటానికి అవసరమైన మౌలికసదుపాయాలు నిర్మించి సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి పారిశ్రామికీకరణ ద్వారా నవకల్పనలను పెంచటం  

నిర్మాణం :  ఉన్నత స్థాయి సలహా సంఘం నివేదిక, సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ప్రకారం ఆయుష్ గ్రిడ్ ఇండియా ఎంటర్ ప్రైజ్ ఆర్కిటెక్చర్ 2.0 కు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ చట్రానికి అనుగుణంగా  సంబంధిత డిజైన్ సూత్రాలు అనుసరిస్తుంది. అదే విధంగా సంబంధిత సూత్రాలను, నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూ ప్రింట్ ప్రమాణాలను పాటిస్తుంది. ఈ క్రింది విధంగా ఆయుష్ గ్రిడ్ ఆర్కిటెక్చర్ రూపకల్పన జరిగింది:

i. ఆయుష్ కోర్ లేయర్ లో ఆయుష్ కోర్ రిజిస్ట్రీల అభివృద్ధి, ఆయుష్ కోర్ డైరక్టరీలు, ఆయుష్ ఆర్కిటెక్చర్ నిల్వలు,  ఆయిష్ వ్యాధి ప్రాబల్యాలు, ఆయుష్ డ్రగ్స్  కోడ్స్ లాంటివి ఉంటాయి  

ii. ఆయుష్ నేషనల్ లేయర్ లో అన్నీ ఆయుష్ ఐటీ అప్లికేషన్స్ ను అభివృద్ధి చేయటం, అలా రూపొందించిన అప్లికేషన్స్ ను జాగ్రత్తగా వాడి చూపటం

iii. ఆయుష్ స్టేట్ లేయర్ -  రాష్ట్ర /కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు, ప్రైవేట్ భాగస్వాములకు ఆయుష్ గ్రిడ్ రూపొందించిన యాప్స్ ను వాడుకునే అవకాశం ఇస్తారు. లేదా అందుబాటులో ఉంటే,  వాళ్ళు స్వయంగా తయారు చేసుకున్న ఐటీ సిస్టమ్స్ ను కూడా వాడుకోవచ్చు. సమీకృతం చేసి అవసరానికి తగినట్టు నిరాటంకంగా డేటా బదలాయింపుకు అవకాశం కల్పిస్తారు. 

iv. ఆయుష్ సిటిజెన్ యాక్సెస్ లేయర్ – జనం వాడే పోర్టల్స్, మొబైల్ యాప్స్ ద్వారా ఈ సేవలు అందరికీ అందుబాటులో ఉంచటం

విధులు : ఆయుష్ గ్రిడ్ కింద రూపొందించిన యాప్స్ ద్వారా ఆయుష్ రంగంలోని అన్నీ కార్యకలాపాలను, ప్రక్రియలను డిజిటైజ్ చేయటం. అంతర్గత, బాహ్య యాప్స్ తో సమాచారాన్ని పరస్పరం మార్చుకునే అవకాశం కల్పించటం

కాలపట్టిక : డీపీఆర్ కు అనుగుణంగా,  ప్రాజెక్ట్ తుది ఆమోదం మేరకు

ఈ సమాచారాన్ని ఆయుష్ శాఖామంత్రి శ్రీ శరబానంద సోనోవాల్ ఈ రోజు లోక్ సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో అందించారు..

 

****


(Release ID: 1883293)
Read this release in: English , Urdu