ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్,పీజీ సీట్ల తాజా పరిస్థితి


67% పెరిగి 387 నుంచి 648 కి చేరిన వైద్య కళాశాలల సంఖ్య

87% పెరుగుదలతో 51348 నుంచి 96077 కి పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు , 105% పెరిగి 31185 నుంచి 64059 కి చేరిన పీజీ సీట్లు

22 ఎయిమ్స్ కు గుర్తింపు

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తున్న 19 ఎయిమ్స్

Posted On: 13 DEC 2022 5:37PM by PIB Hyderabad

దేశంలో 96,077 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో 51,712 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలు, 44,365 సీట్లు ప్రైవేటు వైద్య కళాశాల్లో ఉన్నాయి.పీజీ కోర్సులకు సంబంధించి  నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ ఎం సీ ) 49,790 సీట్లు అందుబాటులో ఉంచింది. వీటిలో 30,384 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలు, మిగిలిన 19,406 సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లో వున్నాయి.  డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DNB) / ఫెలోషిప్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (FNB)  12,648 పీజీ సీట్లు అందిస్తోంది. వీటిలో 4185 ప్రభుత్వ సంస్థలు, మిగిలిన  8463 ప్రైవేటు సంస్థల్లో ఉన్నాయి.వీటికి అదనంగా  కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ (సీపీఎస్)లో  1621 పీజీ సీట్లు ఉన్నాయి. 

2014 నుంచి ఇప్పటివరకు దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 67% పెరిగింది. 2014 నాటికి దేశంలో 387 వైద్య కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 648కి చేరింది. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 87% పెరిగింది. 2014 నాటికి 51348 ఎంబీబీఎస్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 96077 కి చేరింది. 2014 నాటికి 31185 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 105% వృద్ధి నమోదు చేసి ప్రస్తుతం పబ్ సీట్ల సంఖ్య 64059కి చేరింది. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల వైద్య రంగంలో విద్యావకాశాలు పెరిగాయి. వైద్య విద్య పరిధి కూడా పెరిగింది. దేశంలో వైద్య విద్య రంగానికి సంబంధించిన వివరాలు;-

i . జిల్లా/రెఫరల్ ఆస్పత్రి స్థాయి పెంచి వైద్య కళాశాల ఏర్పాటుకు కేంద్ర పథకం. ఈ పథకం కింద ఆమోదించిన 157 ఆస్పత్రుల్లో 94 ఆస్పత్రులు వైద్య కళాశాలలుగా పనిచేయడం ప్రారంభించాయి. 

ii. ఎంబీబీస్, పీజీ సీట్ల సంఖ్య పెంచేందుకు ఇప్పటికే పనిచేస్తున్న రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను పటిష్టం చేయడం/ స్థాయి పెంచడానికి కేంద్ర ప్రభుత్వ పథకం 

iii. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లను ఏర్పాటు చేసి ప్రభుత్వ వైద్య కళాశాల స్థాయి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం. దీనికింద ఆమోదం తెలిపిన 75 ప్రాజెక్టుల్లో 60 ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. 

iv. కేంద్ర పధకంగా కొత్తగా ఎయిమ్స్ సంస్థలు నెలకొల్పడం. దీనికింద 22 ఎయిమ్స్ స్థాపనకు ఆమోదం లభించింది. 19 సంస్ధల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభమయ్యాయి. 

v. వైద్య కళాశాలను ప్రారంభించేందుకు విధించిన నిబంధనలు సడలింపు. అధ్యాపక సిబ్బంది, సిబ్బంది, పడకల సంఖ్య మౌలిక సదుపాయాల కల్పన అంశాల్లో సడలింపు ఉంటుంది. 

vi. సిబ్బంది కొరత తీర్చేందుకు నియామక అర్హతల సడలింపు. దీనికోసం అధ్యాపక సిబ్బంది నియామకానికి డీఎన్బీ అర్హతను గుర్తించడం జరిగింది. 

vii. ఉపాధ్యాయులు/డీన్/ప్రిన్సిపాల్/డైరెక్టర్ల పోస్టులకు సంబంధించి  నియామకం/పొడగింపు/పునర్ ఉపాధి కోసం వయోపరిమితి 70 సంవత్సరాల వరకు పెంపు.

వైద్య విద్యను స్థానిక భాషలో అందించేందుకు కృషి జరుగుతోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం హిందీ భాషలో వైద్య విద్యను అందిస్తోంది. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది. 

ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా  ఇచ్చిన సమాధానంలో తెలిపారు. 

 

***(Release ID: 1883280) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Marathi