విద్యుత్తు మంత్రిత్వ శాఖ
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డీడీయుజీజేవై) కింద గ్రామాల విద్యుద్దీకరణ
నాడు పోస్టు చేయడమైనది:
13 DEC 2022 5:19PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా గ్రామాల విద్యుదీకరణ పనుల కోసం భారత ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీయుజీజేవై) పథకాన్ని 2014 డిసెంబర్ లో ప్రారంభించింది. డీడీయుజీజేవై కింద మరియు ఆ తర్వాత ప్రారంభించిన ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) కింద రాష్ట్ర ప్రభుత్వాలు నివేదించిన ప్రకారం అన్ని గ్రామాలు మరియు అన్ని ఇష్టపడే గృహాలకు 31 మార్చి, 2019 నాటికి విద్యుద్దీకరణ పూర్తయింది. సౌభాగ్య పథకం ఆధ్వర్యంలో మొత్తం 2.86 కోట్ల కుటుంబాలకు విద్యుద్దీకరణ సౌకర్యం అందించబడింది. తొలత గృహ విద్యుద్దీకరణకు ఇష్టపడని వారితో సహా రెండు విడతల్లో అదనపు గృహాలను కలుపుకొని విద్యుదీకరణ సౌకర్యం అందించడింది. తొలత ఇష్టపడని కుటుంబాలు కూడా తరువాత విద్యుద్దీకరణకు సుముఖంగా మారాయి. డీడీయుజీజేవై /సౌభాగ్య మంజూరు చేయబడినప్పుడు పేర్కొన్న ఇల్లు/నివాసం ఉనికిలో లేన్నట్లయితే, ఏదైనా నివాసం/గృహాన్ని విడిచిపెట్టి ఉంటే దానికి మారు కనెక్టివిటీని అందించడానికి సహాయాన్ని అందించడానికి పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం (ఆర్డీఎస్ఎస్) నిబంధనలను కలిగి ఉంది. కేంద్ర విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 1883277)
సందర్శకుల సూచీ సంఖ్య : : 141