పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఒక్కసారి మాత్రమే వినియోగించగల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
Posted On:
12 DEC 2022 6:05PM by PIB Hyderabad
సవరించిన ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ నిబంధనలు, 2016కు అనుగుణంగా ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలిగే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం సహా నిబంధనల అమలు కోసం నిర్దేశిత అధికారులకు చట్టబద్ధమైన చట్రాన్ని అందిస్తుంది. దిగువన పేర్కొన్న తక్కువ వినియోగం, చెత్తపోగుపడే అవకాశం ఎక్కువగా ఉన్న ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులను 1 జులై, 2022 నుంచి ప్లాస్టిక్ వ్యర్ధ నిర్వహణ సవరణ నిబంధనలు 2021కు అనుగుణంగా నిషేధించారు-
ప్లాస్టిక్ తో చేసిన ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ పుల్లలు కలిగిన బెలూన్లు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ పుల్లలు, ఐస్‌క్రీమ్ పుల్లలు, అలంకరణ కోసం పోలిస్టైరీన్ (థెర్మోకోల్); ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్ బాక్స్‌ల చుట్టూ వేసే ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు, ఆహ్వాన పత్రికలు, సిగిరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ లేదా పివిసి బ్యానర్లు, స్టిరర్ర్‌లు.
ఈ నోటిఫికేషన్ డెబ్బై ఐదు మైక్రాన్లకన్నా తక్కువ గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, దిగుమతి, స్టాకింగ్, పంపిణీ, అమ్మకాలను 30 సెప్టెంబర్ 2021 నుంచి నిషేధించగా, వంద మైక్రాన్లు, ఇరవై మైక్రాన్లకన్నా తక్కువ మందంగల వాటిని 31 డిసెంబర్ 2022 నుంచి నిషేధించింది.
ప్లాస్టిక్ వ్యర్ధ నిర్వహణ నింధనలు, 2016 అమలును బలోపేతం చేయడానికి, గుర్తించిన ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని అమలు చేసేందుకు కింద పేర్కొన్న చర్యలు తీసుకోవడం జరిగింది.
మొత్తం ముప్పైఆరు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలూ ప్రధాన కార్యదర్శి/ అడ్మినిస్ట్రేటర్ అధ్యక్షతన గుర్తించిన ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులను తొలగించడానికి, ప్లాస్టిక్ వ్యర్ధాలను సమర్ధవంతంగా నిర్వహించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశాయి.
గుర్తించిన ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులను తొలగించడానికి, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ నిబంధనలు, 2016ను అమలు చేయడానికి సమన్వయంతో కృషి చేయడానికి జాతీయ స్థాయిలో మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసింది.
జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్ మూడు సమావేశాలను నిర్వహించింది. రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలను కూడా ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్‌ను తొలగించేందుకు, దానిని సమయానుకూల పద్ధతిలో అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ పథకాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరడం జరిగింది.
పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 లోని సెక్షన్ 5 కింద దిగువన పేర్కొన్నవారికి ఆదేశాలను జారీ చేయడం జరిగిందిః
నిషేధిత ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులను, ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులకు ప్లాస్టిక్ ముడిసరుకు ఉత్పత్తిదారులను సరఫరా నిలిపివేయాలి.
నిషేధిత ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ ఉత్పత్తుల (ఎస్‌యుపి) తయారీకి ఇచ్చిన అనుమతులను, నమోదులను రద్దు చేయవలసిందిగా ఎస్‌పిసిబిలు/ పిసిసిలకు ఆదేశాలు.
ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ ఉత్పత్తుల (ఎస్‌యుపి) రద్దును అమలు చేసేందుకు రాష్ట్ర నగరాభివృద్ధి విభాగాలకు ఆదేశాలు. ప్రత్యేకంగా, కస్టమ్ అధికారులకు నిషేధిత ఎస్‌యుపి వస్తువులను దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేయవలసిందిగా కోరారు.
దేశంలో గుర్తించిన ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ ఉత్పత్తుల (ఎస్‌యుపి)పై నిషేధాన్ని సమర్ధవంతంగా పర్యవేక్షించేందుకు, ప్లాస్టిక్ వ్యర్ధ నిర్వహణకు దిగువన పేర్కొన్న ఆన్‌లైన ప్లాట్‌ఫార్మ్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి (ఎ) సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు నేషనల్ డాష్ బోర్డ్ పని చేస్తుండగా, (బి) ఒక్కసారి మాత్రమ ఉపయోగించగల ప్లాస్టిక్ తొలగింపుకు కట్టుబడి ఉండేందుకు సిపిసిబి పర్యవేక్షణ మాడ్యూల్ (సి) సిపిసిబి ఫిర్యాదుల పరిష్కార ఆప్.
గుర్తించిన ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని అమలు చేసేందుకు 1 జులై నుంచి 31, 2022 వరకు దేశవ్యాప్తంగా అమలు ప్రచారాన్ని చేపట్టింది. అంతేకాకుండా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఈ నిషేధాన్ని అమలు చేసేందుకు క్రమం తప్పకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లను నిర్వహించాలని కోరడం జరిగింది.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణ, అడవులు, పర్యావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సోమవారం జవాబిచ్చారు.
గుర్తించిన ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులు, డెబ్బైఐదు మైక్రాన్లకన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల విషయంలో పళ్ళు, కూరగాయల మార్కెట్లు, స్థానిక మార్కెట్లు, పూల అమ్మకం దారులు, ప్లాస్టిక్ క్యారీ ్యాగుల ఉత్పత్తి యూనిట్లు తదితరాల విషయంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల అంతర్ రాష్ట్రాల కదలికను నిలిపివేసేందుకు సరిహద్దు చెక్‌పాయింట్లలో యాధృచ్ఛిక తనిఖీ చేపట్టవలసిందిగా కోరడం జరిగింది. కంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు, కాలుష్య నియంత్రణ కమిటీలు అక్టోబర్, నవంబర్ నెలలలోప్రత్యేక భారత వ్యాప్త అమలు డ్రైవ్‌లు చేపట్టాయి.
ప్రత్యామ్నాయాలను వేగంగా ప్రవేశపెట్టడమే గుర్తించిన ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విజయవంతమైన అమలుకు కీలకం. ప్రస్తుతం ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువుల నుంచి పర్యావరణ ప్రత్యామ్నాయాల దిశగా పరివర్తన చెందుతున్న ఎంఎస్ఎంఇల పరిశ్రమలకు తోడ్పాటును అందించేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలులో ఉన్న పథకాలలో కొన్ని ప్రొవిజన్లను చేశాయి. నిషేధిత ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులకు పర్యావరణకు అనుకూలమైన ప్రత్యామ్నాయాలపై జాతీయ ప్రదర్శన, స్టార్టప్‌ల సదస్సు-2022ను తమిళనాడు ప్రభుత్వంతో కలిసి ప్రత్యామ్నాయాలపై చైతన్యాన్ని తెచ్చేందుకు చెన్నైలో 26-27 సెప్టెంబర్ 2022న నిర్వహించింది. గుర్తించిన ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువుల తొలగింపు కోసం అవగాహన పెంచడం, సామర్ధ్య నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
అమలు ప్రచార రసమయంలో, గుర్తించిన ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని వాణిజ్య సంస్థలు, ఉత్పత్తి యూనిట్లు, స్థానిక మార్కెట్లలో చిన్న దుకాణాలు అమలు చేయడంలేదని గుర్తించడం జరిగింది. నిషేధిత ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం, జరిమానా విధించడం వంటి చర్యలను నిబంధనలకు కట్టుబడనివారిపై తీసుకోవడం జరిగింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అమలు ప్రచార సమయంలో విధించిన జరిమానా దాదాపు రూ. 5,81,78,001/- కాగా, 775.577 కేజీల సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా, నిషేధిత ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్ వస్తువుల వినియోగించేందుకు ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు,ఉత్పత్తిలో నిమగ్నమైన బ్రాండ్ యజమానులు/ దిగుమతులకు కేంద్రీకృత ఇపిఆర్ పోర్టల్‌పై రిజిస్ట్రేషన్‌ను మంజూరు చేయలేదు.
***
(Release ID: 1883010)
Visitor Counter : 379