ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ప్రధానమంత్రి ముద్ర యోజన కింద 37.76 కోట్ల మందికి రూ. 20.43 లక్షల కోట్ల పంపిణీ
Posted On:
12 DEC 2022 6:50PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) కింద ఋణాలిచ్చే సభ్య సంస్థలు 25.11.2022 నాటికి ముద్రా పోర్టల్ లో నమోడు చేసిన సమాచారం ప్రకారం ఈ పథకం మొదలైన 2015 ఏప్రిల్ మొదలుకొని 37.76 కోట్ల రుణాల కింద రూ. 20.43 లక్షలకోట్ల పంపిణీ జరిగింది. ఇందుకు సంబంధించి మంత్రి మరింత సమాచారం ఇస్తూ పిఎంఎంవై కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా మహారాష్ట్ర, ఒడిశా సహా ఇచ్చిన రుణాల జాబితాను అనుబంధంగా జోడించారు.
కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ సర్వేను ఉటంకిస్తూ, పిఎంఎంవై కింద ఉపాధి కల్పించబడిన జరిగిన తీరుమీద జాతీయ స్థాయిలో ఒక శాంపిల్ సర్వే జరిగినట్టు కార్మిక, ఉపాధికల్పన శాఖా మంత్రి వెల్లడించారు. ఆ సర్వే ఫలితాల ప్రకారం పిఎంఎంవై 2015 నుంచి 2018 వరకు మూడేళ్ళ కాలంలో నికరంగా 1.12 కోట్ల ఉపాధి కల్పనకు దోహదపడింది. మొత్తంగా చూసినప్పుడు శిశు విభాగం రుణాల లబ్ధిదారుల వాటా 66% ఉండగా, కిశోర్ విభాగంలో 19%, తరుణ్ విభాగంలో 15% లబ్ధిదారులున్నారు.
పథకం గురించి మరిన్ని వివరాలందిస్తూ, పిఎంఎంవై కింద హామీ లేని సంస్థాగత రుణం రూ.10 లక్షల వరకూ ఋణాలిచ్చే సభ్య సంస్థలు ఇస్తున్నాయన్నారు. అందులో షెడ్యూల్డ్ వాణిజ్య బాంకులు, ప్రాంతీయ గ్రామీణ బాంకులు, బాంకింగేతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మ ఋణ సంస్థలు ఉన్నాయన్నారు. రుణం పొందటానికి అర్హత ఉండి, ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోదలచినవారు ఈ పథకం కింద రుణం పొందవచ్చు. ఆదాయం తెచ్చిపెట్టే వస్తు తయారీ, వర్తక, సేవా, వ్యవసాయ అనుబంధ రంగాలకోసం అప్పు తీసుకోవచ్చు. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. శిశు (రూ.50 వేల వరకు), కిశోర్ (50 వేల నుంచి 5 లక్షల దాకా), తరుణ్ ( 5 నుంచి 10 లక్షల దాకా).
(Release ID: 1883009)
Visitor Counter : 164