మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

నవ భారత సాక్షరతా కార్యక్రమం

Posted On: 12 DEC 2022 4:23PM by PIB Hyderabad

ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం “ నవ భారత సాక్షరతా కార్యక్రమం (ఎన్ ఐ ఎల్ పి) ని 2022-234 నుంచి 2026-27 దాకా ఐదేళ్ళపాటు అమలయ్యేలా ప్రకటించింది.  ప్రాథమిక సాక్షరత, గణిత సాక్షరతలో  ఐదేళ్లలో 5 కోట్ల మందికి బోధించటం దీని ఉద్దేశ్యం. ఈ కార్యక్రమ లక్ష్యాలు ఐదు:  1. ప్రాథమిక సాక్షరత, గణిత సాక్షరత 2. కీలకమైన జీవన నైపుణ్యాలు 3. వృత్తి నైపుణ్యాభివృద్ధి 4. ప్రాథమిక విద్య 5. కొనసాగింపు విద్య

ఈ కార్యక్రమం అమలులో ప్రభుత్వం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఏంటంటే, అన్నీ రాష్ట్రాలలో నోడల్ ఏజెన్సీలు, అమలు సంస్థలను గుర్తించి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో వాటి బాంకు ఖాతాలు తెరవటం. ఆర్థిక మంత్రిత్వశాఖ మార్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ తప్పనిసరి. అమలు చేయటంలో ఇది మొదటి సంవత్సరం కావటంతో ఇదొక సవాలు గా మారింది.          

ఈ కార్యక్రమానికి మొత్తం ఐదేళ్ళకు 2022-23 నుంచి 2026-27 వరకు బడ్జెట్ 1037.90 కోట్లు. అందులో 700 కోట్లు కేంద్ర వాటా కాగా, 337.90 కోట్లు రాష్ట్రాల వాటా.  కేంద్ర, రాష్ట్ర వాటా ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతం  మినహా 60:40.  వాటిలో  మాత్రం కేంద్ర, రాష్ట్ర వాటా 90:10. ఇక మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం వాటా 100%. నిధుల పంపిణీ పి ఎఫ్ ఎం ఎస్ ద్వారా, రాష్ట్ర ట్రెజరీల ద్వారా జరుగుతుంది.   

దేశంలో ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయటానికి ప్రభుత్వం రక రకాల చర్యలు తీసుకుంటోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో సహా ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెబుతోంది. 

లబ్ధిదారులను, వాలంటీర్ టీచర్లను ఎంపిక చేయటం మొదటి దశ.  పాఠశాలలే ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆధ్వర్యంలో వీళ్ళ ఎంపిక జరుగుతోంది. వాలంటీర్లుగా ఎంపికైన టీచర్లకు  ఆయన లైన్ పద్ధతిలో శిక్షణ ఇస్తారు. రాష్ట్రాలు అనేక వర్క్ షాప్ లు నడుపుతున్నాయి. జాతీయ స్థాయిలో  ఎన్ సి ఈ ఆర్ టి ఆధ్వర్యంలో జాతీయ సాక్షారతా కేంద్ర విభాగం ఆధ్వర్యంలో పాఠ్యాంశాల తయారీ జరుగుతోంది.  నమూనా మూల్యాంకన మాడ్యూల్స్ ను దీక్ష యాప్ లో అందుబాటులో ఉంచారు.

ఎన్ ఐ ఎల్ పి ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 నుంచే మొదలవటం వల్ల గత మూడేళ్లలో కేటాయించిన, వెచ్చించిన  నిధులు వర్తించవు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన నిధులు ఈ అనుబంధం-1 లో ఉన్నాయి.

 

అనుబంధం –I

లోక్ సభలో గౌరవ సభ్యులు శ్రీ సునీల్ దత్తాత్రేయ తత్కరే, డాక్టర్ అమోల్ రామ్ సింగ్ కొల్హే,  శ్రీమతి సుప్రియా సూలె, డాక్టర్ సుభాష్ రామారావు భమ్రే , శ్రీ కులదీప్ రాయ్ శర్మ నవ భారత సాక్షారతా కార్యక్రమం గురించి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో భాగమిది.

నవ భారత సాక్షారతా కార్యక్రమం కింద రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రస్తుత సంవత్సరానికి కేటాయించిన నిధుల జాబితా (2022-23):

 

సంఖ్య

రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం

మొత్తం ( రూపాయలలో)

మొత్తం

కేంద్ర వాటా

రాష్ట్ర వాటా

1

2

3

4

5

1

అండమాన్, నికోబార్ దీవులు

52,72,423

52,72,423

0

2

ఆంధ్ర ప్రదేశ్

8,54,47,700

5,12,68,620

3,41,79,080

3

అరుణాచాల్ ప్రదేశ్

95,87,188

86,28,469

9,58,719

4

అస్సాం

13,64,31,360

12,27,88,224

1,36,43,136

5

బీహార్

18,95,97,200

11,37,58,320

7,58,38,880

6

చండీగఢ్

82,18,366

82,18,366

0

7

చత్తీస్ గఢ్

3,98,20,300

2,38,92,180

1,59,28,120

8

దాద్రా, నాగర్ హవేలి,  డయ్యూ

69,09,058

69,09,058

0

9

గోవా

45,08,660

27,05,196

18,03,464

10

గుజరాత్

8,44,55,800

5,06,73,480

3,37,82,320

11

హర్యానా

3,78,36,500

2,27,01,900

1,51,34,600

12

హిమాచల్ ప్రదేశ్

2,07,75,820

1,86,98,238

20,77,582

13

జమ్ము కశ్మీర్

4,97,39,300

4,47,65,370

49,73,930

14

జార్ఖండ్

5,96,58,300

3,57,94,980

2,38,63,320

15

కర్ణాటక

9,87,39,160

5,92,43,496

3,94,95,664

16

కేరళ

1,99,82,300

1,19,89,380

79,92,920

17

లద్దాఖ్

1,50,22,800

1,50,22,800

0

18

లక్షదీవులు

33,18,380

33,18,380

0

19

మధ్య ప్రదేశ్

10,92,53,300

6,55,51,980

4,37,01,320

20

మహారాష్ట్ర

12,61,15,600

7,56,69,360

5,04,46,240

21

మణిపూర్

1,22,05,804

1,09,85,224

12,20,580

22

మేఘాలయ

1,32,37,380

1,19,13,642

13,23,738

23

మిజోరాం

43,69,794

39,32,815

4,36,979

24

నాగాలాండ్

1,21,46,290

1,09,31,661

12,14,629

25

ఢిల్లీ ఎన్ సి టి

1,62,13,080

97,27,848

64,85,232

26

ఒడిశా

7,15,61,100

4,29,36,660

2,86,24,440

27

పుదుచ్చేరి

41,11,900

24,67,140

16,44,760

28

పంజాబ్

4,27,96,000

2,56,77,600

1,71,18,400

29

రాజస్థాన్

11,22,29,000

6,73,37,400

4,48,91,600

30

సిక్కిం

55,99,750

50,39,775

5,59,975

31

తమిళనాడు

9,83,42,400

5,90,05,440

3,93,36,960

32

తెలంగాణ

8,54,47,700

5,12,68,620

3,41,79,080

33

త్రిపుర

1,60,14,700

1,44,13,230

16,01,470

34

ఉత్తరప్రదేశ్

34,03,66,000

20,42,19,600

13,61,46,400

35

ఉత్తరాఖండ్

3,00,99,680

2,70,89,712

30,09,968

36

పశ్చిమ బెంగాల్

11,42,12,800

6,85,27,680

4,56,85,120

 

మొత్తం

208,96,42,893

136,23,44,266

72,72,98,627

 

విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారమ ఇచ్చారు. 

*****



(Release ID: 1882939) Visitor Counter : 162


Read this release in: English , Urdu