వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వినియోగదారుల సమీక్షలను ప్రచురించే సంస్థలకు ప్రమాణాలను జారీ చేసిన బీఐఎస్
తాజా ప్రమాణాలు ఆన్‌లైన్ సమీక్ష రచయితలకు, సమీక్ష నిర్వాహకులకు నిర్దిష్ట బాధ్యతలను నిర్దేశిస్తుంది
Posted On:
12 DEC 2022 5:24PM by PIB Hyderabad
భారత జాతీయ ప్రమాణాల నిర్దేశన సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (బీఐఎస్), ఇండియన్ స్టాండర్డ్, ఐఎస్ 19000:2022, ‘ఆన్‌లైన్ కన్స్యూమర్ రివ్యూలు - ప్రిన్సిపల్స్ అండ్ రిక్వైర్‌మెంట్స్ ఫర్ థెయిర్ కలెక్షన్, మోడరేషన్ అండ్ పబ్లికేషన్’ని ప్రచురించింది. ఇది ఆన్‌లైన్ నిర్వాహకులు (అడ్మినిస్ట్రేటర్లు) వారి సేకరణ విధానం, నియంత్రణ, ఆన్‌లైన్ వినియోగదారు సమీక్షల ప్రచురణలో వర్తించే సూత్రాలు, పద్ధతులకు కావాల్సిన అవసరాలు, సిఫార్సులను అందిస్తుంది. బీఐఎస్ వెలువరించిన ఈ విధానం సమీక్ష రచయిత, సమీక్ష నిర్వాహకులకు ప్రమాణాల నిర్దిష్ట బాధ్యతలను నిర్దేశిస్తుంది. తాజా ప్రమాణం ఆన్‌లైన్‌లో వినియోగదారుల సమీక్షలను ప్రచురించే ఏ సంస్థకైనా వర్తిస్తుంది. ఆయా సంస్థలు వారి సొంత వినియోగదారుల నుండి సమీక్షలను సేకరించే ఉత్పత్తులు, సేవల సరఫరాదారులు/ విక్రయదారులు, సరఫరాదారులు/ విక్రేతలు లేదా స్వతంత్ర మూడవ పక్షం ద్వారా ఒప్పందం చేసుకున్న తృతీయ పక్షంతో సహా సంబంధితులందరికీ ఇది వర్తిస్తుంది. వినియోగదారు సమీక్ష సైట్‌ల నిబద్ధతను ప్రదర్శించే ప్రక్రియను ఇది నిర్దేశిస్తుంది, వారు తమ వినియోగదారులను వారి అభిప్రాయాలను విలువైనవిగా భావించి నమ్మశక్యమైన సమీక్షలను అందించేందుకు దోహదం చేస్తుంది. ఇది ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేయడానికి వినియోగదారులలో విశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడంలోనూ దోహదం చేస్తుంది.
బీఐఎస్ నిర్దేశించిన ప్రమాణం ఈ-కామర్స్ పర్యావరణ వ్యవస్థలోని వాటాదారులఅందరకీ మేలు చేస్తుంది, వినియోగదారులు, ఈ-కామర్స్ వేదికలు, విక్రేతలు మొదలైన వారందరికీ ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, దేశ వ్యాప్తంగా ఈ-కామర్స్ లావాదేవీలలో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయబడిన సమీక్షలు.. కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. వినియోగదారులు ఇప్పటికే వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసిన వినియోగదారుల అభిప్రాయం మరియు అనుభవాన్ని చూడటానికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేసిన వారివారి సమీక్షలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఆన్‌లైన్ సమీక్షలు వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నందున, సమీక్షల నాణ్యత, సమగ్రత, కచ్చితత్వం మరియు పారదర్శకతపై విశ్వాసాన్ని పెంపొందించడానికి వాటిని సమర్థవంతంగా నిర్వహించడం వినియోగదారులకు మరియు సరఫరాదారులు/విక్రేతలకు చాలా ముఖ్యం. ఇందుకు తాజా ప్రమాణాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
***
(Release ID: 1882936)
Visitor Counter : 141