పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
యూఎన్‌ఎఫ్‌సీసీసీ కాప్ 27, కర్బన రహితంగా మారడానికి భారతదేశం చేసిన వాగ్దానం
Posted On:
08 DEC 2022 2:44PM by PIB Hyderabad
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి విధాన నిర్ణయ ఒప్పందానికి (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) సంబంధించిన అన్ని దేశాల సమావేశానికి (కాప్) సంబంధించి, విస్తృత చర్చల తర్వాత, అన్ని దేశాల ఏకాభిప్రాయంతో తీసుకున్న వివిధ నిర్ణయాల రూపంలో తుది ఫలితాలు ఉంటాయి. పూర్తి స్వచ్ఛందంగా లేదా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకునేలా వివిధ స్థాయిల నిబద్ధతలు, బాధ్యతలతో ఆ నిర్ణయాలు ఉంటాయి. పారిస్ ఒడంబడిక ప్రాథమిక నిబంధనల ప్రకారం, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తించేలా, ఆయా దేశాల్లోని పరిస్థితుల ఆధారంగా ఉమ్మడిగా ఉండని, విభిన్నమైన బాధ్యతలు & సామర్థ్యాల ఆధారంగా మినహాయింపులు కూడా ఉంటాయి. ఈ నిర్ణయాలకు సంబంధించిన ఖచ్చితమైన ప్రాథమిక నిబంధనల ఆధారంగా, తన బాధ్యతల నెరవేర్చడంలో భారతదేశం తగిన చర్యలు తీసుకుంటుంది.
పారిస్ ఒడంబడిక నిబంధనల ప్రకారం, జాతీయ స్థాయిలో నిర్ణయించిన సహకారాలు (ఎన్‌డీసీలు), దీర్ఘకాలంలో తక్కువ ఉద్గారాల అభివృద్ధి వ్యూహాన్ని (ఎల్‌టీ-ఎల్‌ఈడీఎస్) దేశాలు స్వయంగా నిర్ణయించుకుంటాయి, వాటిని యూఎన్‌ఎఫ్‌సీసీసీకి తెలియజేస్తాయి. దీనికి అనుగుణంగా, భారతదేశం తన నవీకరించిన ఎన్‌డీసీలను 26 ఆగస్టు 2022న సమర్పించింది. దీర్ఘకాలిక తక్కువ కర్బన అభివృద్ధి వ్యూహాన్ని నవంబర్ 14, 2022న సమర్పించింది. 2070 నాటికి సున్న కర్బన స్థాయికి చేరుకునే దిశగా భారతదేశ దృక్పథాన్ని, విధానాన్ని ఈ పత్రాలు తెలియజేస్తాయి. వీటిలో కాలక్రమేణా అవసరమైన మార్పులు ఉంటాయని భావిస్తున్నాం.
ఎల్‌టీ-ఎల్‌ఈడీఎస్ ప్రకారం, పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం, ఆర్థిక వృద్ధి సహా దేశాభివృద్ధి అవసరాలకు కోసం శక్తి అవసరాలను కూడగట్టుకునే అవసరాన్ని బట్టి తక్కువ కర్బన్ అభివృద్ధి మీద భారతదేశ దృష్టి ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం శిలాజయేతర ఇంధన వనరుల విస్తరణ, శిలాజ ఇంధన వనరుల హేతుబద్ధ వినియోగం, ఇలా రెండింటిపై దేశ ఇంధన భద్రతకు సంబంధించిన ప్రణాళిక ఆధారపడి ఉండటం అవసరం. పునరుత్పాదకాలను పెంచడం, గ్రిడ్‌ను బలోపేతం చేయడం, డిమాండ్ నిర్వహణ మీద దృష్టి పెట్టడం వంటివి అటువంటి వినియోగానికి సంబంధించిన నిర్దిష్ట దశలు.
పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని ఈరోజు రాజ్యసభకు అందించారు.
******
(Release ID: 1882008)
Visitor Counter : 166