పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పర్యావరణ పరిశీలన, పరీక్షకు విశ్వసనీయ వ్యవస్థ
प्रविष्टि तिथि:
08 DEC 2022 2:46PM by PIB Hyderabad
పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 కింద ప్రభుత్వం 14.09.2006వ తేదీన ఎస్.ఒ. 1533 (ఇ) పర్యావరణ ప్రభావ అంచనా (ఇఐఎ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇఐఎ నోటిఫికేషన్,2006 లో గల అంశాల ప్రకారం , ముందస్తు పర్యావరణ అనుమతులు పొందవలసినవి - 1) కొత్త ప్రాజెక్టులు లేదా ఈ నోటిఫికేషన్ షెడ్యూల్‌లో పొందుపరిచిన కార్యకలాపాలు 2) ఉనికిలో ఉన్న ప్రాజెక్టులకు షెడ్యూల్‌లో పేర్కొన్న సంబంధిత రంగానికి నిర్దేశించిన పరిమితులకు మించి సామర్ధ్యపు జోడింపుతో ఈ నోటిఫికేషన్ షెడ్యూల్‌లో పేర్కొన్న కార్యకలాపాలు -విస్తరణ లేదా ఆధునీకరణ తర్వాత షెడ్యూల్‌లో నిర్దేశించిన ప్రభావసీమ పరిమితులు దాటిన ప్రాజెక్టులు లేదా కార్యకలాపాలు; 3) నిర్దేశిత పరిధిని దాటి షెడ్యూల్‌లో జోడించిన ఉనికిలో ఉన్న ఉత్పత్తి యూనిట్లలో ఉత్పత్తి మిశ్రమంలో ఏదైనా మార్పు. ప్రాజెక్టుల కోసం ఇసి ప్రక్రియలో పరీక్షించడం, ఆస్కారం (స్కోపింగ్), ప్రజలతో సంప్రదింపు, మదింపుచేయడం అనే నాలుగు దశలను కలిగి ఉంటుంది. మంత్రిత్వ శాఖ సుస్థిరమైన అభివృద్ధిపై దృష్టితో ఇసి పొందేందుకు బలమైన, పారదర్శిక ప్రక్రియను రూపొందించే లక్ష్యంతో పలు కార్యక్రమాలను చొరవలను చేపట్టి, విధానాలు, నిబంధనలు, నోటిఫికేషన్లలో అవసరమైన మార్పులను చేపట్టింది. ముఖ్యమైన చొరవలు -
పరివేష్ (పిఎఆర్ఐవిఇఎస్‌హెచ్ - ప్రోయాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ ఫెసిలిటేషన్ బై ఇంటరాక్టివ్, వర్చువస్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సింగిల్ - విండో హబ్) ద్వారా ఆన్‌లైన్‌లో ప్రతిపాదనల సమర్పణ, అనుమతి తప్పనిసరి. దరఖాస్తుల సమర్పణ, అజెండా తయారీ, మినిట్స్ తయారీతో పాటుగా అనుమతులను మంజూరు చేసే మొత్తం ప్రక్రియను పరివేష్ ఆటోమేట్ (యాంత్రికం) చేస్తుంది.
అన్ని రకాల అనుమతులకు (పర్యావరణ, అటవీ, వన్యప్రాణి, తీర ప్రాంత వ్యవస్థీకృత జోన్ (సిఆర్‌జెడ్) ఒకటే రిజిస్ట్రేషన్.
ఇఐఎ నోటిఫికేషన్, 2006ను సవరించడమే కాక,పర్యావరణ పటిష్టత, భద్రతల విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ఇసి ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఎప్పటికప్పుడు వివిధ కార్యాలయ మెమొరాండాలు జారీ అయ్యాయి.
ఈ సమాచారాన్ని పర్యావరణం, అడవులు & పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే గురువారం రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 1882005)
आगंतुक पटल : 177