పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

ఈ వ్యర్థాల రీసైక్లింగ్

Posted On: 08 DEC 2022 2:48PM by PIB Hyderabad

దేశంలో ఈ వ్యర్థాల రీసైక్లింగ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ-వేస్ట్ (నిర్వహణ) నియమాలు, 2016 ప్రకారం తొలగింపు మరియు రీసైక్లింగ్ యూనిట్లు సంబంధిత  రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (ఎస్ పీసీబీ )/ కాలుష్య నియంత్రణ కమిటీ (పీసీసీ) నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ -వ్యర్థాల ప్రాసెసింగ్ కోసం సీపీసీబీ మార్గదర్శకాలు/ఎస్ఓపి  జారీ చేసింది. యూనిట్లను  సీపీసీబీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు పర్యవేక్షిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయంతో రీసైక్లింగ్ పరిశ్రమల పనితీరు మెరుగు పరిచి, ఆధునికీకరించడానికి అవసరమైన చర్యలు అమలు జరుగుతున్నాయి. 

ఈ-వ్యర్థ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం క్రింది చర్యలు చేపట్టింది :-

i. ఈ-వేస్ట్ (నిర్వహణ) రూల్స్, 2016 , కాలానుగుణంగా సవరించిన నిబంధనల కింద  ఈ-వ్యర్థాల నిర్వహణ జరుగుతుంది. 2016 అక్టోబర్ 1 నుంచి నియమ, నిబంధనలు అమలులోకి వచ్చాయి. నియమ, నిబంధనలు కింది విధంగా ఉన్నాయి:

* తయారీదారులు, నిర్మాతలు, వినియోగదారులు, భారీ వినియోగదారులు, సేకరణ కేంద్రాలు, డీలర్లు, ఈ-రిటైల్ రంగం, పునరుద్ధరణ దారు, రీసైక్లర్‌కు నియమ, నిబంధనలు వర్తిస్తాయి. 

* ఈపిఆర్ పరిధిలోకి వచ్చే ఉత్పత్తిదారులు తమ ఈపిఆర్ కు  సీపీసీబీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనికోసం తాము తొలగిస్తున్న/రీసైకిల్ చేస్తున్న సంస్థ ఈపిఆర్ లను అందించవలసి ఉంటుంది.  

* నోటిఫై చేసిన 21 ఈఈఈ లను నిబంధన లోని షెడ్యూల్ -I లో చేర్చడం జరిగింది. 

*  ఈపిఆర్ పరిధిలోకి వచ్చే ఉత్పత్తిదారులకు వార్షిక ఈఈఈ లక్ష్యాలు నిర్ణయించబడతాయి. గత ఏడాది సంస్థ సేకరించిన ఈఈఈ లేదా  విక్రయించిన ఈఈఈ -వ్యర్థాల వార్షిక నివేదిక (ఏది వర్తిస్తే అది) ఆధారంగా లక్ష్యాలను నిర్ణయిస్తారు. 

ii. 2022 నవంబర్ 2న ఈ-వేస్ట్ (నిర్వహణ) నిబంధనలు 2022 లను విడుదల చేసింది. ఈ-వేస్ట్ (నిర్వహణ) నిబంధనలు 2016 స్థానంలో నూతన నిబంధనలను అమలు జరుగుతాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధనలు అమలులోకి వస్తాయి.  నిబంధనలు ఈపీఆర్ రంగంలో ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ రంగంలో నూతన వ్యవస్థను అమల్లోకి తెస్తాయి. నిబంధనల ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి..    

* ప్రతి తయారీదారు, నిర్మాత, పునరుద్ధరణదారు, డిస్‌మాంట్లర్ మరియు రీసైక్లర్‌కు నిబంధనలు వర్తిస్తాయి. 

* తయారీదారులు, నిర్మాతలు, పునరుద్ధరణదారులు మరియు రీసైక్లర్లు సీపీసీబీ  అభివృద్ధి చేసిన   పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.

* రిజిస్ట్రేషన్ లేకుండా ఎలాంటి వ్యాపారాన్ని నిర్వహించకూడదు మరియు నమోదుకాని ఏ సంస్థతో అయినా కార్యకలాపాలు నిర్వహించరాదు.

* ఇప్పుడు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ స్థానంలో  ఆథరైజేషన్ అమలులోకి వస్తుంది.   తయారీదారు, నిర్మాత, రిఫర్బిషర్ మరియు రీసైకిల్ చేసే వారికి  మాత్రమే రిజిస్ట్రేషన్ అవసరం.

* షెడ్యూల్ I విస్తరించబడింది.    ఈపిఆర్ వ్యవస్థ పరిధిలో ఇప్పుడు 106 ఈఈఈ లు ఉంటాయి. 

*  నోటిఫై చేయబడిన ఈఈఈ ఉత్పత్తిదారులకు  గతంలో వారు సాగించిన  ఈఈఈ  ఉత్పత్తి లేదా ఈఈఈ అమ్మకాల ఆధారంగా వార్షిక ఈ -వేస్ట్ రీసైక్లింగ్ లక్ష్యాలు ఇవ్వబడ్డాయి.  2023-2024 మరియు 2024-25 సంవత్సరానికి లక్ష్యం 60% వద్ద 2 సంవత్సరాల పాటు స్థిరంగా ఉండవచ్చు;  2025-26 మరియు 2026-27 సంవత్సరానికి 70% మరియు 2027-28 మరియు 2028-29 మరియు ఆ తర్వాత సంవత్సరానికి 80% గా లక్ష్యం ఉంటుంది. 

* కొత్త నియమాలలో సోలార్ పీవీ  మాడ్యూల్స్/ప్యానెల్స్/ సెల్‌ల నిర్వహణ చేర్చబడింది. 

* అవకతవకలు  నివారించడానికి రీసైకిల్ చేయబడిన పరిమాణం తుది ఉత్పత్తుల ఆధారంగా లెక్కించబడుతుంది.

*  ఉత్పత్తి మరియు లావాదేవీ కోసం ఈపిఆర్  సర్టిఫికేట్ నిబంధన ప్రవేశపెట్టబడింది.

* పర్యావరణ పరిహారం మరియు ధృవీకరణ,ఆడిట్ కోసం నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి.

ఈ -వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల (ఈఈఈ) తయారీలో ప్రమాదకర పదార్థాల వినియోగాన్ని  తగ్గించడానికి అవకాశం కల్పించబడింది.  పరికరాలు,భాగాలు  ఉత్పత్తులలో గరిష్టంగా సూచించిన సాంద్రతకు మించి  సీసం, పాదరసం మరియు ఇతర ప్రమాదకర పదార్థాలను లేకుండా చూడాల్సిన బాధ్యత  ఈఈఈ కలిగిన ప్రతి ఉత్పత్తిదారుడుపై ఉంటుంది.   

 ఈ -వ్యర్థాల తొలగింపు మరియు రీసైక్లింగ్‌లో పాల్గొంటున్న కార్మికుల గుర్తింపు మరియు నమోదు, నైపుణ్యాభివృద్ధి, పర్యవేక్షణ మరియు భద్రత మరియు ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి  

 ఇ-వేస్ట్ (నిర్వహణ) నియమాలు ఉపయోగపడతాయి. 

పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు  లిఖితపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***

 



(Release ID: 1882004) Visitor Counter : 306


Read this release in: English , Urdu