అణుశక్తి విభాగం
శుద్ధ ఇంధనం ఉత్పత్తిని పెంచడానికి మరిన్ని అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపిన కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్
భవిష్యత్తులో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఐదు కొత్త ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది
Posted On:
07 DEC 2022 3:16PM by PIB Hyderabad
శుద్ధ ఇంధనం ఉత్పత్తిని పెంచడానికి మరిన్ని అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని కేంద్ర అణు శక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డా.జితేంద్ర సింగ్ చెప్పారు.
లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానంగా ఈ విషయాన్ని డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పదకొండు (11) రియాక్టర్‌లకు (8700 మెగావాట్లు) అదనంగా, మరో పది (10) స్వదేశీ 700 మె.వా. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు (పీహెచ్‌డబ్ల్యూఆర్) నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనాపరమైన, ఆర్థిక పరమైన అనుమతులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. వాటిని క్రమానుగతంగా ఏర్పాటు చేస్తామన్నారు.
భవిష్యత్తులో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం ఐదు కొత్త ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
అణు శక్తి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ మీద సుంకాలను, బొగ్గు విద్యుత్ వంటి ప్రస్తుత సాంప్రదాయ ప్రాథమిక ఉత్పత్తితో పోల్చవచ్చని డా.జితేంద్ర సింగ్ తన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. ప్రస్తుతం స్థాపించిన అణు విద్యుత్ వ్యవస్థలో 22 రియాక్టర్లు ఉన్నాయి, మొత్తం సామర్థ్యం 6780 మెగావాట్లు. వీటికి తోడు, ఒక రియాక్టర్, కేఏపీపీ-3ని (700 మె.వా.) కూడా గ్రిడ్‌కు అనుసంధానించారు.
<><><><><>
(Release ID: 1881707)
Visitor Counter : 215