పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

ఎన్.సి.ఆర్. రాష్ట్రాలతో పాటు, పంజాబ్‌ లో వరి పంట అవశేషాల నిర్వహణ - విశ్లేషణ

Posted On: 05 DEC 2022 5:19PM by PIB Hyderabad

ప్రస్తుత సంవత్సరంలో వరి పంట అవశేషాల దహనం సంఘటనలలో గణనీయమైన తగ్గింపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు,  ఇతర భాగస్వాములు చేసిన బలమైన, స్థిరమైన ప్రయత్నాలను ప్రతిబింబిస్తోంది.  వరి పంట అవశేషాలను కాల్చే సంఘటనలను పర్యవేక్షించడానికి ప్రామాణిక ఇస్రో ప్రోటోకాల్ ఆధారంగా నమోదైన గణాంకాల ప్రకారం, 15.09.2022 తేదీ నుంచి 30.11.2022 తేదీ మధ్య కాలంలో పంజాబ్, హర్యానా, ఢిల్లీతో పాటు, ఉత్తరప్రదేశ్ (యు.పి); రాజస్థాన్‌ లోని  ఎన్.సి.ఆర్. జిల్లాల్లో మొత్తం వరి పంట అవశేషాల దహనం సంఘటనలు 2021 లో 78,550 ఉండగా, 2022 నాటికి 53,792 కి తగ్గాయి. అంటే 31.5 శాతం మేర తగ్గాయి. 

2021 మరియు 2022 కోసం
పంజాబ్హర్యానాఎన్.సి.ఆర్-యు.పి.,  
ఎన్.సి.ఆర్-రాజస్థాన్ఎన్.సి.టిలో
మొత్తం యాక్టివ్ ఫైర్ కౌంట్లు (ఖరీఫ్ సీజన్)

క్రమ సంఖ్య

రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం

2021

2022

తగ్గుదల

(%)

1

 పంజాబ్ 

71304

49922

29.99

2

 హర్యానా 

6987

3661

47.60

3

ఎన్.సి.ఆర్. - యు.పి. 

252

198

21.43

4

ఎన్.సి.ఆర్. - రాజస్థాన్ 

3

1

66.67

5

ఢిల్లీ   

ఎన్.సి.టి.   

4

10

తగ్గుదల లేదు

 

మొత్తం 

78,550

53,792

31.51

 

కేంద్ర ప్రభుత్వం తన సి.ఆర్‌.ఎం. పథకం కింద 2018-19 నుండి 2022-23 వరకు ఐదేళ్ల కాలంలో, పంజాబ్ ప్రభుత్వం, ఎన్.సి.ఆర్. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జి.ఎన్.సి.టి.డి. కి 3,062 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా నిధులను, ఆయా ప్రాంతాల్లో పంట కోత అనంతరం మిగిలిన గడ్డి దుబ్బు సమర్థవంతమైన నిర్వహణ కోసం విడుదల చేసింది.  విడుదల చేసిన మొత్తంలో 1,426 కోట్ల రూపాయలు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది.

ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సేకరించిన పంట అవశేషాల నిర్వహణ కోసం యంత్రాల వినియోగం గురించి చూస్తే, పంజాబ్‌ దాదాపు 1.20 లక్షల యంత్రాలు; హర్యానా సుమారు 72,700 యంత్రాలు వినియోగించుకోగా,  యు.పి. (ఎన్.సి.ఆర్) సుమారు 7,480 యంత్రాల సేవలు  వినియోగించుకున్నాయి.   ఇదే సమయంలో, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ లలో దాదాపు 38,400 కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సి.హెచ్.సి. లు) స్థాపించబడ్డాయి, వీటిలో దాదాపు 24,200 సి.హెచ్.సి. లు పంజాబ్‌ లో; 6,775 హర్యానాలో ఉన్నాయి.

కమిషన్ సూచించిన ముసాయిదా ఆధారంగా, ఎన్‌.సి.ఆర్. రాష్ట్ర ప్రభుత్వాలు, పంజాబ్ ప్రభుత్వం పంట కోత అనంతరం మిగిలిన గడ్డి దుబ్బు కాల్చడాన్ని నియంత్రించడానికి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశాయి.  సమర్థవంతమైన పర్యవేక్షణ, డేటా సమగ్రతను నిర్ధారించడానికి, ఇస్రో, ఐ.ఏ.ఆర్.ఐ. తో పాటు, ఇతర భాగస్వాముల సహాయంతో ఉపగ్రహ డేటాని ఉపయోగించి వరి అవశేషాలను కాల్చడాన్ని పర్యవేక్షించడానికి, కమిషన్, ఒక ప్రామాణిక ప్రోటోకాల్‌ ను కూడా రూపొందించింది.

కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం, ఎన్.సి.ఆర్. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, ఇతర భాగస్వాముల సమిష్టి ప్రయత్నాలు, సి.ఆర్.ఎం. యంత్రాల ఉపయోగం, పి.యు.ఎస్.ఏ. బయో-డికంపోజర్ల ఉపయోగం, ఎక్స్-సిటు వినియోగానికి వివిధ ఎంపికలను సులభతరం చేయడం ద్వారా, పంట అవశేషాల మెరుగైన నిర్వహణ కోసం వరి గడ్డి, విస్తృతమైన ఐ.ఈ.సి. కార్యకలాపాలు, విద్యా ప్రచారాలు, అవగాహన శిబిరాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం వల్ల అగ్ని ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో గణనీయంగా సహాయపడ్డాయి. 

హర్యానాలో మొత్తం పంట అవశేషాలను కాల్చిన సంఘటనలు 2021 లో 6,987 ఉండగా, 2022 లో 3,661 కి తగ్గాయి, అంటే, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 47.60 శాతం తగ్గుదల నమోదయ్యింది.   అదేవిధంగా, పంజాబ్‌ లో మొత్తం పంట అవశేషాలను కాల్చిన సంఘటనలు 2021 లో 71,304 ఉండగా, 2022 లో 49,922 కి తగ్గాయి, అంటే 29.99% తగ్గుదల నమోదయ్యింది.  యు.పి. కి చెందిన ఎన్.సి.ఆర్. జిల్లాలు, రాజస్థాన్, ఢిల్లీ కి చెందిన ఎన్.సి.టి. లలో మొత్తం పంట అవశేషాలను కాల్చిన సంఘటనలు 2021 లో 259 ఉండగా, 2022 లో 209 కి తగ్గాయి, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 19.30 శాతం తక్కువ. 

పంజాబ్‌ లోని 23 జిల్లాలలో, ప్రస్తుత సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో పంటలను దహనం చేసిన ఐదు హాట్‌ స్పాట్ జిల్లాలు సంగ్రూర్, భటిండా, ఫిరోజ్‌పూర్, ముక్త్‌సర్, మోగా లలో, మొత్తం 21,882 సంఘటనలు నమోదయ్యాయి. అంటే, ఈ ఏడాది మొత్తం అగ్ని ప్రమాదాల సంఖ్యలో ఇది 43.83 శాతంగా ఉంది.  ఈ ఏడాది, కేవలం ఒక్క జిల్లాలో మాత్రమే 5,000 కంటే ఎక్కువ అగ్ని ప్రమాదాలు సంభవించాయి.  కాగా,  2021 లో, పంజాబ్‌ లోని ఐదు (5) జిల్లాల్లో 5,000 కంటే ఎక్కువ అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. మొత్తం 32,053 అగ్ని ప్రమాద సంఘటనల్లో ఇది 44.95 శాతంగా ఉంది. 

2021 లో, పంజాబ్‌ లో నమోదైన మొత్తం అగ్ని ప్రమాదాల్లో 79.6 శాతం, అంటే, 3,000 కంటే ఎక్కువ అగ్ని ప్రమాదాలు పదకొండు (11) జిల్లాల్లో సంభవించాయి.  ప్రస్తుత సంవత్సరంలో, కేవలం ఏడు (7) జిల్లాల్లో మాత్రమే 3,000 కంటే ఎక్కువ అగ్ని ప్రమాదాలు సంభవించాయి, ఇవి మొత్తం అగ్ని ప్రమాదాల్లో కేవలం 57 శాతంగా నమోదయ్యాయి.  2021 లో సంభవించిన 5,327 అగ్ని ప్రమాదాలతో పోలిస్తే, 2022 లో పంజాబ్‌ లో అత్యధికంగా 3,916 అగ్నిప్రమాదాలు మాత్రమే సంభవించాయి, అంటే దాదాపు 26.5శాతం తగ్గుదల నమోదయ్యింది. 

లూథియానా, మలేర్‌కోట్లలో 2021తో పోలిస్తే 2022లో యాక్టివ్ ఫైర్ కౌంట్‌ లు 50 శాతం కంటే ఎక్కువగా  తగ్గాయి.  ఈ సంవత్సరం పంజాబ్‌ లో యాక్టివ్ ఫైర్ ఈవెంట్‌ లలో గరిష్ట తగ్గింపు లూథియానా జిల్లాలో 3,135 వ్యవసాయ అగ్ని సంఘటనల తగ్గింపు (5817 నుండి 2682 వరకు) నమోదయింది. 

హర్యానాలోని మొత్తం 22 జిల్లాల్లో, ఈ సంవత్సరం గరిష్ట సంఖ్య లో వ్యవసాయ అగ్ని ప్రమాదాలు సంభవించిన ఐదు హాట్‌ స్పాట్ జిల్లాలు ఫతేహాబాద్, కైతాల్, జింద్, సిర్సా, కురుక్షేత్ర లలో 2,548  అగ్ని ప్రమాద సంఘటనలు నమోదయ్యాయి.  అంటే ప్రస్తుత సంవత్సరంలో మొత్తం అగ్ని ప్రమాద సంఘటనల్లో - ఇది 69.6 శాతంగా ఉంది.  ఈ ఐదు జిల్లాల్లో గత ఏడాది 4,644 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి, ఇది 45.1 శాతం తగ్గాయి.  హర్యానాలో ఒక్క రోజులో అత్యధికంగా 2021లో 363 నమోదుకాగా, 2022లో 250 అగ్నిప్రమాదాలు సంభవించాయి,  అంటే దాదాపు 31.1% తగ్గుదల.  హిసార్, కర్నాల్, పల్వాల్, పానిపట్, సోనిపట్‌ లలో ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల సంఖ్య సుమారు 50 శాతం కంటే ఎక్కువగా  తగ్గింది.  ఈ సంవత్సరం హర్యానా లోని ఫతేహాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదాల సంఖ్య 712 కాగా, గత ఏడాది ఈ సంఖ్య 1479 గా ఉంది. అంటే గరిష్ట తగ్గింపుతో నమోదయ్యింది. 

పర్యవేక్షించబడిన ప్రాంతంలో మొత్తం మీద  తగ్గింపు ఉన్నప్పటికీ,  పంజాబ్‌ లోని రెండు (02) జిల్లాలు (భటిండా, ఫజిల్కా);  ఒకటి (01) యు.పి.కి చెందిన ఎన్.సి.ఆర్. జిల్లా (బులంద్‌సహర్);  హర్యానాలోని ఒక (01) జిల్లా (యమునా నగర్) గత సంవత్సరం సంబంధిత కాలంతో పోల్చితే గణనీయంగా ఎక్కువ సంఖ్యలో వ్యవసాయ అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. 

ఢిల్లీలో రోజువారీ పి.ఎం. 2.5 స్థాయిలకు వ్యవసాయ అగ్నిప్రమాదాలు గరిష్టంగా గత ఏడాది (7/11/2021 తేదీ) 48 శాతం ఉండగా, ప్రస్తుత సంవత్సరంలో (3/11/2022 తేదీ) 34 శాతం ఉంది.  ఢిల్లీ రోజువారీ సగటు ఏ.క్యూ.ఐ. 2021 నవంబర్ లో 376.50 తో పోలిస్తే, 2022 నవంబర్ లో 320.60 వద్ద మెరుగుపడింది, అంటే దాదాపు 56 పాయింట్లు తగ్గింది. 

*****



(Release ID: 1881184) Visitor Counter : 171


Read this release in: English , Urdu , Hindi