వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఫెసిలిటేటర్ల వృత్తిపరమైన ఛార్జీలను పెంచడానికి మేధో సంపత్తి (ఐ.పి) రక్షణ పథకం సవరించబడింది


అంకుర సంస్థలు దాఖలు చేసిన పేటెంట్ దరఖాస్తుల సంఖ్య 2016-17 లో 179 ఉండగా, 2021-22 లో ఆ సంఖ్య 1500 కి పెరిగింది; అంకుర సంస్థలు దాఖలు చేసిన ట్రేడ్ మార్క్ దరఖాస్తుల సంఖ్య 2016-17 లో కేవలం 4 ఉండగా, 2021-22 లో ఆ సంఖ్య 8,649 కి పెరిగింది

Posted On: 02 DEC 2022 3:31PM by PIB Hyderabad

అంకుర సంస్థల మేధో సంపత్తి హక్కులు (ఐ.పి.ఆర్) రక్షించడానికి, ప్రోత్సహించడానికి, వాటిలో ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, భారత ప్రభుత్వం 2016 లో అంకుర సంస్థల మేధో సంపత్తి రక్షణ (ఎస్.ఐ.పి.పి) ని సులభతరం చేయడానికి ఒక పథకాన్ని ప్రారంభించింది.  అంకుర సంస్థలకు వారి పేటెంట్, డిజైన్ లేదా ట్రేడ్‌మార్క్ దరఖాసులను ఐ.పి. ఫెసిలిటేటర్ల సహాయంతో దాఖలు చేయడం, ప్రాసెస్ చేయడాన్ని ఈ పథకం  సులభతరం చేసింది.  దీని రుసుమును భారత ప్రభుత్వ పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగానికి చెందిన, పేటెంట్ డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్‌ల కంట్రోలర్ జనరల్ కార్యాలయం భరించింది.   దాని విజయవంతమైన అమలు తర్వాత, అంకుర సంస్థల ద్వారా ఐ.పి. దాఖలు లో గణనీయమైన పెరుగుదల ఫలితంగా, ఈ పథకం 2023 మార్చి, 31వ తేదీ వరకు మూడేళ్ల పాటు పొడిగించబడింది.

అంకుర సంస్థలు దాఖలు చేసే ఐ.పి. దరఖాస్తుల సంఖ్యను పెంచడానికి, అలాగే, అంకుర సంస్థలకు నాణ్యమైన సేవలను అందించే ఐ.పి. ఫెసిలిటేటర్లను మరింత ప్రోత్సహించడానికి వీలుగా, ఇప్పుడు, ఈ పథకం సవరించబడింది, ఫెసిలిటేషన్ రుసుములు కూడా కనీసం వంద శాతం పెంచబడ్డాయి.  సవరించిన పథకం 2022 నవంబర్ 2వ తేదీ నుంచి వర్తిస్తుంది. 

 

పాత, కొత్త పథకాల ప్రకారం సవరించిన ఫీజు వివరాలు  విధంగా ఉన్నాయి:

 

Stage of Payment

Patents

Trademarks

Designs

FEE (in INR)

2016

2022

2016

2022

2016

2022

At the time of filing of Application

10,000

15,000

2,000

3,000

2,000

3,000

At the time of final disposal of Applications

Without Opposition

10,000

25,000

2,000

5000

2,000

5,000

With Opposition

15,000

35,000

4,000

10000

4,000

10,000

 

పైన పేర్కొన్న పథకంతో పాటు, సంబంధిత ఐ.పి. చట్టాల ప్రకారం రుసుము రాయితీలను అందించడం ద్వారా, అంకుర సంస్థలే ఐ.పి. ఫైలింగ్ కూడా చేసే విధంగా ప్రోత్సహించడం జరుగుతోంది.  అంకుర సంస్థలకు, పేటెంట్ దరఖాస్తు రుసుము పై 80 శాతం రాయితీ, ట్రేడ్‌మార్క్ దరఖాస్తు రుసుము పై 50 శాతం రాయితీ అందించబడుతుంది.  అదనంగా, పేటెంట్ దరఖాస్తుల విషయంలో ఫాస్ట్ ట్రాక్ పరిశీలనకు కూడా అవకాశం ఉంది. 

ఫలితంగా, గత 6 సంవత్సరాల్లో, అంకుర సంస్థల ద్వారా ఐ.పి. కార్యకలాపాలలో గణనీయమైన పెరుగుదల నమోదయ్యింది: 

అంకుర సంస్థలు దాఖలు చేసిన పేటెంట్ దరఖాస్తుల సంఖ్య  2016-17 లో 179 ఉండగా, 2021-22 నాటికి ఆ సంఖ్య  1, 500 కి పెరిగింది; 

అంకుర సంస్థలు దాఖలు చేసిన ట్రేడ్ మార్క్ దరఖాస్తుల సంఖ్య  2016-17 లో కేవలం 4 కాగా, 2021-22 నాటికి ఆ సంఖ్య 8,649 కి పెరిగింది; 

2016-17 నుంచి, 2022 అక్టోబర్ వరకు, అంకుర సంస్థల ద్వారా 7430 పేటెంట్ దరఖాస్తులు, 28749 ట్రేడ్ మార్క్ దరఖాస్తులు దాఖలయ్యాయి. 

ఐ.పి. ఫిల్లింగ్‌ లలో అంకుర సంస్థలకు సహాయం చేసే ఫెసిలిటేటర్లకు, 2022 సెప్టెంబర్, 30వ తేదీ నాటికి, 380.81 లక్షల రూపాయలు  ఫీజు గా పంపిణీ చేయడం జరిగింది.  ప్రభావవంతమైన, నాణ్యమైన సేవలు అందించే ఐ.పి. ఫెసిలిటేటర్ల ద్వారా అంకుర సంస్థలు దాఖలు చేసే ఐ.పి. దరఖాస్తుల సంఖ్యను ఈ సవరించిన ఫీజు విధానం మరింత పెంచుతుంది.

 

 

*****(Release ID: 1880597) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi