కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లపై కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ను ప్రవేశపెట్టడంపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసిన ట్రాయ్
Posted On:
30 NOV 2022 12:44PM by PIB Hyderabad
టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లలో ఇంట్రడక్షన్ ఆఫ్ కాలింగ్ నేమ్ ప్రెసెంటేషన్ ( సిఎన్ ఎపి - ఫోన్ చేసిన వారి పేరు ప్రదర్శితం కావాడాన్ని ప్రవేశపెట్టడం)పై ఒక సమాలోచన పత్రాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టిఆర్ఎఐ - ట్రాయ్) బుధవారం విడుదల చేసింది.
భారతీయ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌పై ఫోన్ చేసినవారి పేరును ప్రదర్శితం కావడాన్ని (సిఎన్ఎపి) ప్రవేశపెట్టేందుకు ట్రాయ్ చట్టం, 1997 (సవరించినట్టుగా)లోని సెక్షన్ 11(1)(ఎ) కింద తమ సూచనలను అందించవలసిందిగా టెలికమ్యూనికేషన్స్ విభాగం (డిఒటి) 21.03.2022న ఒక ప్రస్తావన ద్వారా అథారిటీని అభ్యర్ధించింది.
ఈ విషయంలో, ఇంట్రడక్షన్ ఆఫ్ కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సిఎన్ఎపి) పై ఒక సంప్రదింపుల పత్రాన్ని భాగస్వాములందరి నుంచి సూచనలను కోరుతూ ట్రాయ్ వెబ్ సైట్ (www.trai.gov.in)లో ఉంచారు. ఈ సంప్రదింపుల పత్రంలోని అంశాలపై భాగస్వాములు చేసే లిఖితపూర్వక వ్యాఖ్యలను 27 డిసెంబర్ 2022 నాటికి, వాటికి ప్రతి వ్యాఖ్యలను 10 జనవరి 2023 నాటికి అందచేయవలసిందిగా ఆహ్వానించింది.
వ్యాఖ్యలను, ప్రతి వ్యాఖ్యలను ప్రధానంగా ఎలక్ట్రానిక్ రూపంలో ఎడివిఎంఎన్@టిఆర్ఎఐ.జిఒవి.ఐఎన్ (dvmn@trai.gov.in)కి పంపవలసి ఉంటుంది. ఈ విషయాలలో స్పష్టీకరణ/ సమాచారం కోసం ట్రాయ్ సలహాదారు (నెట్‌వర్క్స్, స్పెక్ట్రమ్, లైసెన్సింగ్) శ్రీ అఖిలేష్ కుమార్‌కు +91-11-23210481 అన్న టెలిఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా కోరవచ్చు.
(Release ID: 1880169)
Visitor Counter : 121